India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలోని కోరపల్లిలో మూడేళ్ల బాలికపై గురువారం పిచ్చికుక్కలు దాడి చేశాయి. స్థానికుల ప్రకారం.. గ్రామానికి చెందిన బాలిక అక్షర.. ఆడుకునేందుకు ఇంటి ముందరికి వచ్చింది. ఈ క్రమంలో అక్కడే ఉన్న కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. బాలికను చికిత్స నిమిత్తం వరంగల్ MGMకు తరలించారు. గ్రామంలో కుక్కల బెడదను నివారించాలని స్థానికులు కోరుతున్నారు.
రాష్ట్రంలో ముదిరాజుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు పట్టణంలోని మానేరు డ్యాంలో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను పేద ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, నగర మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.
బతుకమ్మ ఉత్సవాలు నిన్నటి నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. అయితే నేడు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజు పిల్లలకు అత్యంత ఇష్టమైన అటుకులు, బెల్లాన్ని బతుకమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు అటుకుల బతుకమ్మను జరుపుకుంటారు. ఈ రోజున ప్రధానంగా నివేదించేవి అటుకులు కాబట్టి ఆ పేరుతో పిలుస్తారు. ఈరోజు మహిళలు వివిధ రకాల పూలతో రెండు ఎత్తులలో గౌరమ్మను పేరుస్తారు.
గుండెపోటుతో ప్రభుత్వ టీచర్ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. కుటుంబీకుల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం జగ్గాసాగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల LFL ప్రధానోపాధ్యాయుడు కోగుల రవిబాబు బుధవారం సాయంత్రం ఆకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందాడు. ఆయన మృతి పట్ల మండలంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘం నేతలు ప్రగాఢ సంతాపం తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో విషాదం నెలకొంది. ఎస్సై తోట తిరుపతి వివరాల ప్రకారం.. వీణవంక మండలం గంగారం గ్రామానికి చెందిన దేవేందర్ రెడ్డి(27) ఉద్యోగం వచ్చినప్పటికీ పెళ్లి కావట్లేదనే మనస్తాపంతో గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. గత నాలుగేళ్లుగా హుజురాబాద్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నారు. మృతుడి తండ్రి సంపత్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
కరీంనగర్ జిల్లాలోని పలు మండలాల బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా బీజేపీ అధ్యక్షులు కృష్ణారెడ్డితో కలిసి సమావేశమై చర్చించారు. అధిక బీజేపీ సభ్యత్వ నమోదులపై దృష్టి సారించాలని పార్టీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు.
మహాత్మా గాంధీ 155వ జయంతి సందర్భంగా హుస్నాబాద్‌లో వికలాంగులకు మంత్రి పొన్నం ప్రభాకర్ స్కూటీలు పంపిణీ చేశారు. ముందుగా హుస్నాబాద్ పట్టణంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. వికలాంగులై ఉండి రానివారికి మరొక విడుతలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి, మునిసిపల్ చైర్మన్ ఆకుల లలిత, వైస్ చైర్మన్ అనిత పాల్గొన్నారు.
@ ఓదెల మండలంలో పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గాంధీ జయంతి వేడుకలు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు.
@ వీణవంక మండలానికి చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ పురుగు మందు తాగిఆత్మహత్య.
@ హుస్నాబాద్ మండలంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
@ కోరుట్లలో గుండెపోటుతో బిజెపి నేత మృతి.
తెలంగాణ అస్తిత్వానికి, సాంస్కృతిక జీవనానికి బతుకమ్మ ప్రతీక అని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని మహాశక్తి ఆలయంలో బుధవారం సాయంత్రం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కాగా.. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,02,748 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.54,363, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.24,920, అన్నదానం రూ.23,465 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
Sorry, no posts matched your criteria.