India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 68 వేల నగదు సీజ్ . @ ధర్మారం మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలు. @ వేములవాడలో కుక్కను తప్పించబోయి బోల్తా పడిన కారు. @ లైసెన్సుడ్ గన్ లను సరెండర్ చేయాలన్న రామగుండం పోలీస్ కమిషనర్. @ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ వివాహితను ట్రాప్ చేసిన ఇబ్రహీంపట్నం ఏఎస్ఐ ఎస్పీ ఆఫీస్ కు అటాచ్.

ఇటీవల మల్యాల మండలం మ్యాడంపల్లిలో జరిగిన హత్య మిస్టరీ వీడింది. మాజీ భార్య రెండోపెళ్లిని తట్టుకోలేక ఓ భర్త ఆమెను హతమర్చాడు. సీఐ నీలం రవి తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం అగ్గిమల్లకు చెందిన కొల్లూరి నరేశ్, యదాద్రి చెందిన కరిపే అంజలికి 2020 పెళ్లిచేసుకుని విడిపోయారు. తరచూ ఆమెకు ఫోను చేస్తూ వేధించేవాడు. ఈక్రమంలో ఆమె రెండోపెళ్లి చేసుకుంది. ఇది జీర్ణించుకులేక ఈ నెల 17న రప్పించి ఆమెను హత్య చేశాడు.

ఉత్తర తెలంగాణకు కీలకమైన కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటనపై శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక్కడ BRS, BJP అభ్యర్థులు ప్రచారం చేస్తుండగా కాంగ్రెస్ అభ్యర్థిని ఖరారు చేయలేదు. జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ స్థానాలున్న నిజామాబాద్‌లోనూ ఇదే పరిస్థితి. MP అభ్యర్థిగా ప్రవీణ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి పేర్లు ప్రచారంలో ఉండగా వెలిచాల రాజేందర్‌రావు, తీన్మార్ మల్లన్న పేర్లు తెరపైకి రావడంతో కేడర్‌లో ఆయోమయం నెలకొంది.

ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో లైసెన్సు తుపాకులు కలిగిన వారు వెంటనే ఆయా స్టేషన్‌లలో సరెండర్ చేయాలని CPశ్రీనివాస్ (IPS) ఆదేశాలు జారీచేశారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం జూన్ 7న తిరిగి తీసుకోవచ్చున్నారు . జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే సిబ్బంది, గార్డు డ్యూటీలో ఉన్నవారికి మినహాయింపు ఉంటుందన్నారు. నిబంధనలు పాటించాలన్నారు.

జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో సోమవారం హోలీ సందర్భంగా రెండు కుటుంబాల మధ్య జరిగిన <<12927777>>ఘర్షణ<<>> ఓ మహిళ ప్రాణాలను బలి తీసుకుంది. ప్రకాష్ అనే యువకుడు హోలీ ఆడుతుండగా పక్కింటి పైకి గుడ్డు విసిరాడు. దీంతో పక్కింటి రిషి, ఆయన తల్లి రమ అడగడంతో ప్రకాష్ కొడవలితో దాడిచేయగా రమకు తీవ్రగాయాలయ్యాయి. కరీంనగర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, మంగళవారం ఉదయం మృతిచెందింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ASI రామయ్యను SP ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. భర్త వేధిస్తున్నాడని న్యాయం చేయాలని వెళ్లిన వివాహితను కాపాడాల్సిన పోలీసే ట్రాప్ చేశాడని మండలంలో చర్చనీయాంశంగా మారింది. ఆమెతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని ఎస్పీ చెప్పారు.

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడిని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

హోలీ వేడుకలు రెండు కుటుంబాల మధ్య తీవ్ర ఘర్షణకు దారి తీశాయి. జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామంలో హోలీ వేడుకలో యువకుడు విసిరిన కోడిగుడ్డు పక్కింటిపై పడటంతో వివాదం జరిగింది. కోడిగుడ్డు విసిరిన ప్రకాష్ అనే యువకుడుని పక్కింట్లో ఉండే రమ ప్రశ్నించడంతో ప్రకాష్ కొడవలితో దాడికి దిగాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన రమను స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించారు.

లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సరిహద్దులో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లు ఉండటంతో మావోయిస్టు కార్యకలాపాలపై దృష్టిసారించిన సీపీ.. ఆయా ప్రాంతాల్లో మరింత బందోబస్తు ఏర్పాటుకు ప్లాన్ చేస్తున్నారు.

మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో ఎస్టీ సామాజికవర్గ మహిళలపై జరిగిన దాడిని ఎంపీ బండి సంజయ్ ఖండించారు. సోమవారం ఆయన కరీంనగర్లో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో రజాకార్ల అరాచకాలను చూపిస్తే, కాంగ్రెస్ పాలనలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరమ్మ పాలన ఎలా ఉందో చూపించాలని అనుకుంటున్నారా..? అని ధ్వజమెత్తారు. హిందువులపై దాడులు చేసిన వారిని వదిలేసి దారులకు గురైన వారిపైనే లాఠీ చార్జి చేస్తారా..? అని ప్రశ్నించారు.
Sorry, no posts matched your criteria.