India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
వేసవి నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గురువారం జిల్లాలో సరాసరి గరిష్ఠ ఉష్ణోగ్రత 33.0℃ గా నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు చలి తీవ్రత కూడా తగ్గడంతో 19.0℃ సరాసరి కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇప్పటికే జిల్లా ప్రజలు ఉక్కుపోతతో ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం సమయంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటోంది.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులను కేంద్రమంత్రి బండి సంజయ్ దండుపాళ్యం ముఠాతో పోల్చారంటూ 2023లో నల్గొండ జిల్లా మర్రిగూడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. ఈ కేసుపై గురువారం నాంపల్లి ప్రజాప్రతినిధుల న్యాయస్థానం తుది విచారణ జరిపి బండి సంజయ్‌ని నిర్దోషిగా ప్రకటించి, కేసు కొట్టి వేసింది.
కరీంనగర్, గోదావరిఖని డిపో నుంచి బెంగళూరుకు నడిచే ఆర్టీసీ బస్సు సర్వీసులలో ప్రయాణించే ప్రయాణీకులకు వారి బస్ ఛార్జీలో 10% రాయితీ కల్పించినట్లు కరీంనగర్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరుకు ప్రయాణించే ప్రయాణీకులు 10% రాయితీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
మార్చి 5 నుంచి 22 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయని జిల్లా విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. బుధవారం 10 ఇంటర్ పరీక్షల నిర్వహణపై ఇంటర్ ప్రథమ సంవత్సరం 17799, ద్వితీయ సంవత్సరానికి 17763 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. మొత్తం 58 సెంటర్లు ఏర్పాటు చేశామని కరీంనగర్లో 37 సెంటర్లు ఉన్నాయన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రతి బీరు 30 రూపాయలు పెంచింది. అయితే కరీంనగర్ పట్టణంలో మాత్రం ఎమ్మార్పీ ధర పాత రేట్లే ఉండగా కొత్త ధరలకు అమ్ముతున్నారు. బడ్ వైజర్ బీరు 210 ఉండగా బార్ ఓపెన్ సిట్టింగుల్లో 260 రూపాయలను తీసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం పెంచిన ధరకు అమ్మే రేట్లలో వ్యత్యాసం ఉండటంతో మందుబాబులు ఆందోళన వ్యక్తం చేశారు. బీర్ బాటిల్ పైన ఉన్న రేట్లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పదవ తరగతి, ఇంటర్ పరీక్షల నేపథ్యంలో పరీక్షలు జరిగే తేదీల్లో ప్రత్యేక బస్సులను నడపాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. బుధవారం అధికార సమావేశంలో పరీక్ష వేళల్లో విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు. సమయానికి పరీక్ష కేంద్రానికి చేరేలా ట్రాఫిక్ ఇబ్బందులు రాకుండా చూడాలని పోలీసులను కోరారు. వైద్యశాఖ అధికారులు పరీక్షా కేంద్రాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని రాయికల్ గ్రామంలో నైజాంల కాలంలో 1931లో నిర్మించిన చిత్రహింసల ఠాణ అది. పీడిత, శ్రామిక, సామాన్య ప్రజల కంట నీరు పెట్టించిన కర్కశ చెరశాల అది. ప్రజల స్వేచ్ఛ జీవితాలను హరింపజేసి పీడించి పాలించిన పీడ కళలకు ఆకోట సజీవ సాక్ష్యం. ఏ పేరు చెబితే ప్రజల గుండెల్లో గుబులు పుట్టుద్దో.. ఏ పేరు చెబితే ప్రజలు పరుగు లగాంచి పారిపోయేదో అదే ఈ నైజం లో పోలీస్ స్టేషన్.
వీణవంక మండల కేంద్రానికి చెందిన మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆనందం రాజమల్లు అనే వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బీఆర్ఎస్లో క్రియాశీలక నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆనందం రాయమల్లు ఆత్మహత్య చేసుకోవడంతో మండల కేంద్రంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఆత్మహత్యకి గల కారణాలు ఇంకా తెలియలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని వృద్ధురాలు చనిపోయిన ఘటన వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాల ప్రకారం.. ఈనెల 12న ఉదయం చలిమంట కాగుతుండగా చీర కొంగుకి ప్రమాదవశాత్తు మంటలంటుకున్నాయి. పొట్టపై భాగాన కింది భాగాన పూర్తిగా కాలిపోవడంతో KNR ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వీరమ్మ చనిపోయిందని కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తోట తిరుపతి తెలిపారు.
శంకరపట్నం మండలం కొత్తగట్టు జాతీయ రహదారిపై బైకును లారీ ఢీకొట్టడంతో ఓ వ్యక్తి పరిస్థితి తీవ్ర విషమంగా మారింది. స్థానికుల తెలిపిన వివరాలిలా.. హుజురాబాద్ నుంచి కొత్తగట్టు వెళ్తున్న బైకర్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైకర్ కిందపడి తీవ్రగాయాల పాలయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Sorry, no posts matched your criteria.