Karimnagar

News September 2, 2024

భారీ వర్షాలు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 2/4

image

*గొల్లపల్లి: భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలు.
*వేములవాడ: రహదారిపై భారీగా నిలిచిన వాహనాలు.
*శంకరపట్నం: నీటిలో కొట్టుకుపోయిన బైకు.
*KNR: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు.
*ఓదెల: కొమిర గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*గంభీరావుపేట: సింగసముద్రం పెద్ద కాలువకు గండి.
*జగిత్యాల: భారీ వర్షం.. ప్రజావాణి రద్దు చేసిన కలెక్టర్.
*రామగుండం: భారీ వర్షం.. నీట మునిగిన రోడ్లు

News September 2, 2024

భారీ వర్షం.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగిందిదే! 1/4

image

*ధర్మపురి: గోదావరి నదిలో పెరిగిన నీటి వరద.
*జమ్మికుంట: పంట పొలాల్లోకి భారీగా చేరిన వరద నీరు.
*కరీంనగర్: నీట మునిగిన ప్రధాన రహదారులు.
*ఎల్లంపల్లి: ప్రాజెక్టు నుంచి నిలిచిపోయిన రాకపోకలు.
*చిగురుమామిడి: రికార్డు స్థాయి వర్షపాతం నమోదు.
*తంగళ్లపల్లి: మండెపల్లి గ్రామంలో భారీ వర్షానికి కూలిన ఇల్లు.
*మల్యాల: తెగిన రహదారి రాకపోకలు బంద్.
*సిరిసిల్ల: నీట మునిగిన పాత బస్టాండ్ ఏరియా.

News September 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీస్ యాక్ట్ అమలు.
@ జమ్మికుంటలో రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి.
@ బెజ్జంకి మండలంలో చేపల వేటకు వెళ్లి ఒకరు గల్లంతు.
@ ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి మండలాలలో పర్యటించిన జగిత్యాల కలెక్టర్, ఎస్పీ.

News September 2, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.61,932 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.28,817, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.16,340, అన్నదానం రూ.16,775 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.

News September 2, 2024

సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతుంది: కేటీఆర్

image

పదేళ్లపాటు సిరిసంపదలతో కళకళలాడిన సిరిసిల్ల మళ్లీ ఉరిశలగా మారుతోందని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్నల పట్ల అనుసరిస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం కార్మికుల ఉసురుతీస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నేతన్నలను పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. నేతన్నలకు ఉపాధి కల్పించే చర్యలు వెంటనే చేపట్టాలని కోరారు.

News September 2, 2024

వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. సోమవారం ఆయన మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీతో కలిసి పరిశీలించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి కూడా నీరు విడుదలయ్యే అవకాశం ఉన్నందున మంథని పరిసర ముంపు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

News September 2, 2024

నిర్మల ఎగువ మానేరు జలాశయాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ

image

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం
నర్మాల గ్రామంలోని ఎగువ మానేరు జలాశయం పూర్తిగా నిండి మత్తడి దుంకుతోంది. దీంతో సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ సందర్శించారు. ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది.

News September 2, 2024

సీఎం రివ్యూ మీటింగ్‌లో మంత్రి శ్రీధర్ బాబు

image

రాష్ట్రంలో భారీ వర్షాలతో వాటిల్లిన నష్టం, వరద సహాయక చర్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం సమీక్షిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ఈ సమీక్ష సమావేశానికి మంత్రి శ్రీధర్ బాబు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News September 2, 2024

పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బండి

image

ప్రముఖ సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా ఆయనకు కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సంకల్పమే బలంగా, జనహితమే ధ్యేయంగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్‌కు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. కొండగట్టు ఆంజనేయ స్వామి వారి కృపతో ఎల్లప్పుడు ప్రజాసేవలో తరించాలని కోరుకుంటున్నట్లు ట్విట్ చేశారు.

News September 2, 2024

రామగుండం: తగ్గిన రవాణా.. పెరిగిన కొత్తిమీర ధర

image

గత రెండు రోజుల నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా రామగుండం తదితర ప్రధాన ప్రాంతాలలో కొత్తిమీర కిలో రూ.250 పెరిగింది. సాధారణ రోజుల్లో కిలో వంద రూపాయలు ఉండే కొత్తిమీర ధర ఒక్కసారిగా ఆకాశాన్ని అంటుకుంది.