Karimnagar

News December 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లా పెయింటింగ్ సంఘం జేఏసీ చైర్మన్‌గా ఆనంద్

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ చైర్మన్‌గా ఆనంద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ నూతన కార్యవర్గం సమావేశాన్ని KNR సర్కస్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఉమ్మడి KNR జిల్లాతో పాటు హుస్నాబాద్ జోన్ల నుంచి సమావేశానికి హాజరైన బిల్డింగ్ పెయింటర్స్ ఆమోదంతో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏర్పాటయింది. జేసి చైర్మన్‌గా చాడ ఆనంద్, అధ్యక్షుడిగా ప్రభాకర్‌ను ఎన్నుకున్నారు.

News December 31, 2024

2024లో విజయాలతోనే రవాణా శాఖ ముగింపు: మంత్రి

image

2024 సంవత్సరం రవాణా శాఖ విజయాలతోనే ముగుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, స్క్రాప్ పాలసీ లాంటి సంస్కరణను తీసుకొచ్చినట్లు తెలిపారు. రోడ్డు నిబంధనలు పాటించకపోతే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు వంటి కఠిన చర్యలు చేపట్టామని తెలిపారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో మహిళా సాధికారత సాధించినట్లు తెలిపారు.

News December 31, 2024

NEW YEAR వేడుకలకు సిద్ధమైన కరీంనగర్!

image

కొత్త సంవత్సరం వేడుకలకు కరీంనగర్ సిద్ధమయింది. నేటితో 2024 సంవత్సరం ముగియనుండటంతో ఇప్పటికే నగరంతో పాటు.. గ్రామాల్లో వేడుకలు మొదలయ్యాయి. రంగురంగుల లైట్లతో నగరం మెరిసిపోతుండగా.. ఇళ్ల ముందు ముగ్గులతో పల్లెలు కళకళలాడుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పండగ వాతావారణం కనిపిస్తోంది. మరి ఈరోజు న్యూ ఇయర్ వేడుకలు మీరెలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి.

News December 31, 2024

WOW.. వెల్గటూర్: Way2News కెమెరాకు చిక్కిన ప్రకృతి అందాలు

image

జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని ముంపునకు గురైన తాళ్ల కొత్తపేట గ్రామంలోని ప్రకృతి అందాలు “Way2News” కెమెరాకు చిక్కాయి. గ్రామంలోని గోదావరి నది తీరంలో అరుదైన కొంగలు కనువిందు చేశాయి. ఇలాంటి ప్రకృతి అందాలు చూసిన గ్రామస్థులు అద్భుతంగా ఉన్నాయని తెలిపారు. ప్రకృతి అందాలు ఆస్వాదించడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రకృతి ప్రేమికులు అంటున్నారు.

News December 31, 2024

ధర్మపురి ఆలయ ఆదాయ వివరాలు రూ.62,01,156 

image

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.62,01,156 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్లు అమ్మకం ద్వారా రూ.62,720, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.43,380, అన్నదానం రూ.7,458, హుండీ లెక్కింపు ద్వారా రూ.60,87,598 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News December 31, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ జగిత్యాల ప్రజావాణిలో 32, సిరిసిల్ల ప్రజావాణిలో 141 ఫిర్యాదులు.
@ రాయికల్ మండలంలో బావిలో దూకి వ్యక్తి ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో ఆత్మహత్యకు పాల్పడిన ఐటిఐ విద్యార్థి.
@ రామడుగు మండలంలో తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడికి తీవ్రగాయాలు.
@ జగిత్యాల టౌన్ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ అశోక్ కుమార్.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్న పోలీసులు

News December 30, 2024

వేములవాడ: రాజన్న ఆలయానికి అమావాస్య ఎఫెక్ట్

image

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో సోమవారం అమావాస్య కారణంగా భక్తుల రద్దీ తక్కువైంది. నిత్యం వేలాది మందిగా వచ్చి ఆలయ ధర్మగుండంలో స్థానమాచరించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సారి అమావాస్య సోమవారం కారణంగా బోసిపోయింది. జనం ఎక్కువగా లేకపోవడంతో ఆలయ సిబ్బంది, అర్చకులు ఖాళీగా కనిపించారు.

News December 30, 2024

KNR: ఆస్పత్రిలో కరెంట్ కోతపై TGNPDCL వివరణ

image

కరీంనగర్ ఆస్పత్రిలో కరెంట్ కోతపై BRS నేత RS ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్‌కు TGNPDCL వివరణ ఇచ్చింది. ఆసుపత్రికి సరఫరా చేసే సబ్‌స్టేషన్‌లోని 33 కేవీ ఫీడర్‌ 17:52 గంటలకు ట్రిప్‌ అయింది, సిబ్బంది వెంటనే అప్రమత్తమై 17:57 గంటలకు తిరిగి ఛార్జ్ చేయడంతో ఫీడర్‌పై 5 నిమిషాల అంతరాయం ఏర్పడిందని రీట్వీట్ చేసింది. ఆసుపత్రిలో జనరేటర్ ఉందని పేర్కొంది.

News December 30, 2024

REWIND: కరీంనగర్ జిల్లాను వణికించిన భూకంపం

image

కరీంనగర్ జిల్లాలో ఈ నెల 4న ఉదయం 7:28 నిమిషాలకు భూకంపం సంభవించింది. దీంతో జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురయ్యారు. ఏం జరుగుతుందో అని తెలుసుకునే లోపే మళ్లీ సాధారణ స్థితికి వచ్చింది. గోదావరి నది తీరా ప్రాంతాల్లో ఈ భూకంప తీవ్రత ఎక్కువగా ఉన్నా.. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. 2024లో సంభవించిన భూకంపం ఉమ్మడి జిల్లా ప్రజలను ఒక్కసారిగా వణికించిందని చెప్పవచ్చు.

News December 30, 2024

REWIND: KNR: అనూహ్యంగా పుంజుకున్న బీజేపీ!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని BJP లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. కరీంనగర్ లోక్‌సభ పరిధి నుంచి బండి సంజయ్ 2,25,209 ఓట్లు భారీ మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు పెద్దపల్లి లోక్‌సభ పరిధి నుంచి పోటీ చేసిన గొమాసే శ్రీనివాస్‌ 3,44,223 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో BJPకి భారీగా ఓట్లు రావడం రాజకీయపరంగా చర్చనీయాంశంగా మారింది.

error: Content is protected !!