India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
@ రాయికల్ ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ గోదావరిఖనిలో పర్యటించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
@ కొండగట్టు అంజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో బోల్తా పడిన మినీ వ్యాన్.
@ గోదావరిఖనిలో కారును ఢీ కొట్టిన లారీ.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో కురిసిన వర్షం.
@ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
కరీంనగర్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1న ఉమ్మడి జిల్లా సైక్లింగ్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చైర్మన్ నరేందర్రెడ్డి తెలిపారు. నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఆవరణలో అండర్-14, 16, 18, 23, 23పై సంవత్సరాల విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు. అందులో ప్రతిభ చూపిన వారిని ప్రాంతీయ స్థాయి ఖేలో ఇండియా, రాష్ట్ర స్థాయి రోడ్డు సైక్లింగ్ పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
భారీ వర్షాల దృష్ట్యా జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని అధికారులతో శనివారం అయన టెలి కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. చెరువులు, కుంటల పైపు పిల్లలు, యువత జాలర్లు వెళ్లకుండా చూడాలన్నారు. వాగుల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ప్రజలు నివసించకుండా చూడాలన్నారు. ఎస్పీ, అడిషనల్ కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
రామగుండంను అనేక రకాలుగా అభివృద్ధి చేయాలని స్థానిక MLA మక్కాన్ సింగ్ ఠాగూర్ పనిచేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ గోదావరిఖని బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాగూర్ రామగుండంకు బస్సులు కావాలని అడిగడంతో.. వారి కోరిక మేరకు బస్సులు పంపిస్తానని హామీ ఇచ్చారు.
శ్రావణ మాసం సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. నిత్యం వేలాది మంది భక్తులతో రాజన్న ఆలయం రద్దీగా మారింది. అయితే దర్శనానికి వచ్చిన భక్తులు ధర్మగుండంలో స్నానాలు చేయడంతో నీళ్లు మురికిగా మారాయి. నీరు పచ్చబడినట్లు భక్తులకు కనిపించడంతో స్నానాలు చేసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఆలయ అధికారులు స్పందించి పచ్చబడ్డ నీళ్లు తొలగించాలని కోరుతున్నారు.
రామగుండంలో ఏర్పాటు చేయనున్న 800 మెగావాట్ల విద్యుత్ కేంద్ర స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పరిశీలించారు. అనంతరం ఉద్యోగులతో సమావేశమై కొన్ని విషయాలను సుదీర్ఘంగా చర్చించారు. కార్యక్రమంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారులు హార్కార వేణుగోపాల్ రావు, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఉన్నారు.
గోదావరిఖని గంగానగర్ పెట్రోల్ బంక్ నుంచి బయటికి వెళ్తున్న లారీ రాజీవ్ రహదారిపై వెళ్తున్న కారును ఢీకొంది. ఈ ఘటనలో ఒక్కసారిగా కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ఉన్నవారికి ప్రాణాపాయం తప్పింది. ఘటనా స్థలానికి ట్రాఫిక్ పోలీసులు వెళ్లి పరిశీలించారు. ఓ బ్యాంకు మేనేజర్‌కు చెందిన కారుగా గుర్తించారు.
కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
WGL-హసన్‌పర్తి-కాజీపేట ‘F’ క్యాబిన్ మధ్యలో ప్రస్తుతం ఉన్న 2 లైన్ల మార్గాన్ని, 4 లైన్లుగా అందుబాటులోకి తీసుకువచ్చే పనుల నేపథ్యంలో పలు రైళ్ల రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ SEP 23 నుంచి OCT 7, కాజీపేట-సిర్పూర్‌టౌన్ SEP 26 నుంచి OCT 7 వరకు రద్దయ్యాయి. భద్రాచలం రోడ్-బళ్లార్ష, బళ్లార్ష-కాజీపేట వరకు SEP 29 నుంచి OCT 8 వరకు అంతరాయం కలగనుంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సైబర్ నేరగాళ్ల వలలో పడి చాలా మంది డబ్బు నష్టపోతున్నారు. దీంతో పోలీసులు విలువైన సమాచారాన్ని అందించారు. నష్టం జరిగిన మొదటి గంటలోపు ఫిర్యాదు చేసినా (డైమండ్ అవర్), నిమిషంలోపు ఫిర్యాదు చేసినా (గోల్డెన్ అవర్) సంబంధిత సొమ్మును రికవరీ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో రూ.2.75 కోట్లు రికవరీ చేశారు. గంటలోపే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Sorry, no posts matched your criteria.