India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
శంకరపట్నం(M) ఇప్పలపల్లె గ్రామానికి చెందిన ఏడీగ మధు(33) అనే ఓ యువరైతు 6రోజుల క్రితం తన ఇంట్లో ఎవరూలేని సమయంలో గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. గమనించిన చుట్టుపక్కల వారు తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.
JGTL(D) పెగడపల్లి(M) మద్దులపల్లి గ్రామానికి చెందిన కంబాల హారిక తన ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి తానూ తాగి <<15470497>>ఆత్మహత్యాయత్నం<<>> చేసుకోగా హారిక శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె కొడుకు కృష్ణంత్(10), కూతురు మయంత లక్ష్మి(8) HYDలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎస్సై రవికిరణ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
KNR, NZB, ADB, MDK టీచర్ MLC స్థానానికి ఈనెల 27న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ కూర రఘోతంరెడ్డి, BJP నుంచి కొమురయ్య, TPTF నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Y.అశోక్ కుమార్, PRTU ఉపాధ్యాయ సంఘం నుంచి వంగ మహేందర్ రెడ్డి, రిటైర్డ్ RJD L.సుహాసినితో పాటు మొత్తం 17 మంది టీచర్ ఎమ్మెల్సీ బరిలో నిలిచారు. మేధావి వర్గంగా బావించే టీచర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
కాటారం సబ్ డివిజన్ పరిధిలోని అడవుల్లో పెద్దపులి సంచారం కలవరపెడుతోంది. వారం రోజులుగా 15 కిలోమీటర్ల రేడియస్‌లోని అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. అటవీ అధికారులు పులి జాడ కోసం అడవి అంతా జల్లెడ పడుతున్నారు. మహాదేవపూర్ మండలం అన్నారం అడవుల్లో పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవిలోకి వెళ్లొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు.
ప్రధాని మోదీ కులం గురించి మాట్లాడే స్థాయి సీఎం రేవంత్ రెడ్డికి లేదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. శనివారం కరీంనగర్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తన పద్ధతి మార్చుకోవాలన్నారు. లేకపోతే మాజీ సీఎంలు కేసీఆర్, కేజ్రీవాల్‌కు పట్టిన గతే పడుతుందన్నారు. బీజేపీ అభ్యర్థులు అంజిరెడ్డి, కొమురయ్యలను మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.
మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి KNR, ఆదిలాబాద్, WGL, NZB రీజియన్లలోని వివిధ డిపోల నుంచి ఈ నెల 25 నుంచి 27 వరకు 778 అదనపు బస్సులు నడుపుతున్నామని KNR RM బి.రాజు ఒక ప్రకటనలో తెలిపారు. వేములవాడతో పాటు ఉమ్మడి KNR జిల్లాలోని వివిధ శైవ క్షేత్రాలకు, భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం శైవ క్షేత్రానికి కూడా అదనపు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు.
కరీంనగర్‌లోని ఆర్ అండ్ బి వసతి గృహంలో గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్‌ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు మొక్కతో స్వాగతం పలికారు. జిల్లాలో ఇసుక యార్డులు, ఇసుక లారీల బుకింగ్‌లు, నిల్వల వివరాలను జిల్లా అధికారులు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ఆయనకు వివరించారు.
శంకరపట్నం మండలంలోని పలు గ్రామాల్లో కోతులు, కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వాటి ధాటిని తట్టుకోలేక పోతున్నారు. గడిచిన 15 రోజుల్లోనే వాటి దాడిలో 39 మంది గాయపడ్డారని వైద్యాధికారి డా.శ్రావణ్ తెలిపారు. జనవరి మాసంలో 42 మంది కుక్క కాటుకు, 46 మంది కోతుల దాడికి గురైనట్లు వెల్లడించారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన మండలంలోని కరీంపేటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గుర్రం వీరాస్వామి శనివారం సాయంత్రం గ్రామ శివారులోని ఓ తాటి చెట్టుపై కల్లు గీసి దిగుతుండగా కిందపడినట్లు స్థానికులు తెలిపారు. అతడు తీవ్రంగా గాయపడటంతో వెంటనే అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు.
ఓ ఉపాధ్యాయురాలు తన పెళ్లి రోజు శుభాకాంక్షల కార్డును వినూత్నరీతిలో తయారుచేశారు. జగిత్యాల(D) మెట్‌పల్లి పట్టణానికి చెందిన ఉపాధ్యాయురాలు రమ్య (శోభారాణి)-మురళి దంపతుల పెళ్లిరోజు ఈనెల 15న ఉంది. పెళ్లిరోజును శుభాకాంక్షల రూపంలో ఇచ్చి ఆప్షన్స్ ఇచ్చారు. ‘choose the correct answer’, ‘true or false’, ‘match the followings’ తో వెరైటీగా క్రియేట్ చేశారు. ఈ పెళ్లిరోజు శుభాకాంక్షల కార్డు పలువురిని ఆకట్టుకుంటుంది.
Sorry, no posts matched your criteria.