Karimnagar

News July 27, 2024

కరీంనగర్‌లో KCRను ఓడగొడతారని భయపడ్డారు: CM

image

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. 2009లో కరీంనగర్‌ జిల్లా ప్రజలు KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొచ్చారని, వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. పదేళ్లు పాలించిన KCR రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.

News July 27, 2024

ఎల్లంపల్లికి కొనసాగుతున్న వరద

image

ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. కడెం ప్రాజెక్టు, పరివాహక ప్రాంతాల నుంచి వరద వస్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.17 టీఎంసీలు కాగా.. 16.91 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం 14,349 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగగా.. 331 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉంది.

News July 27, 2024

KNR: మన మహిళలు.. ఇక సూపర్ క్వీన్స్

image

మహిళా సంఘాల రుణాల ద్వారా పెద్దగా ఉపయోగం లేదని గమనించిన ప్రభుత్వం వారి ఆర్థిక బలోపేతానికి ‘ఇందిరా మహిళా శక్తి’ అనే కొత్త స్కీమ్ తీసుకొచ్చింది. ఆగస్టు 15 వరకు వ్యాపారాలను ప్రారంభించేలా ఆదేశిలిచ్చింది. క్యాంటీన్, ఈవెంట్ మేనేజ్ మెంట్, పెరటి కోళ్లు, మొబైల్ ఫిష్ అవుట్‌లెట్, మిల్క్ పార్లర్, మీ సేవా, ఆహార కేంద్రాలు, కుట్టు మెషీన్ కేంద్రాలు తదితర వ్యాపారాల్లో మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించనుంది.

News July 27, 2024

నీరు లేక బోసిపోతున్న LMD

image

ఏఎండీలో 24 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి కేవలం 5 టీఎంసీల నీటి నిల్వే ఉంది. గతేడాది ఇదే నెలలో ఎల్ఎండీ పరిధిలో భారీ వర్షాలు పడ్డాయి. ఎగువ ప్రాంతాల నుంచి మిడ్ మానేరు ప్రాజెక్టుకు కూడా భారీగా వరద రావడంతో మిడ్ మానేరు నుంచి 1.10 లక్షల క్యూసెక్కులు, నదీ పరివాహక ప్రాంతం నుంచి దాదాపు 90 వేల క్యూసెక్కుల నీరు చేరింది. ప్రస్తుతం డ్యాంలో నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు.

News July 27, 2024

100% గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలి: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య పెరిగే విధంగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెద్దపల్లి పట్టణంలో ఉన్న 100 పడకల మాతా శిశు సంరక్షణ ఆరోగ్య కేంద్రం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరగాలని సూచించారు. 100% ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చేయాలని తెలిపారు.

News July 26, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శుక్రవారం రూ.54,703 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.29,682, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.15,510, అన్నదానం రూ.9,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News July 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరి అరెస్ట్.
@ గంభీరావుపేట మండలంలో కుక్క దాడిలో వృద్ధుడికి తీవ్ర గాయాలు.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల విద్యార్థి మృతి.
@ ఇబ్రహీంపట్నం మండలంలో మోడల్ స్కూల్‌ను తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలను పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.

News July 26, 2024

BREAKING.. KNR: గురుకులంలో విద్యార్థులకు అస్వస్థత

image

పెద్దాపూర్ <<13712552>>గురుకుల విద్యార్థి<<>> నేడు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే పాఠశాలలో ఒకే రూంలో పడుకున్న ముగ్గురు విద్యార్థులకు పాము కాటు వేసిందని కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక విద్యార్థి గుణాధిత్య మృతి చెందగా.. మరో ఇద్దరు గణేశ్, హర్ష వర్ధన్‌లు అస్వస్థతకుగురై పరిస్థితి విషమించడంతో NZB ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయాన్ని దాచిపెట్టారంటూ స్కూల్ ప్రిన్సిపల్‌పై పలువురు విమర్శిస్తున్నారు.

News July 26, 2024

మా మీద కోపం రైతుల మీద చూపించకండి: కౌశిక్ రెడ్డి

image

కాంగ్రెస్ ప్రభుత్వానికి కేసిఆర్, కేటీఆర్, మా అందరిపై కోపం ఉంటే మా మీదే చూపించాలి తప్ప.. రైతుల మీద కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీని ఎమ్మెల్యే సందర్శించి మాట్లాడారు. కాళేశ్వరంలోని లక్ష్మి పంప్ హౌస్ ఆన్ చేసి రైతులకు నీళ్లు అందించాలని.. లేనట్లయితే రైతులతో కలిసివచ్చి మేమే ఆన్ చేస్తామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

News July 26, 2024

సిరిసిల్ల: వీటీడీఏ పనుల్లో వేగం పెంచాలి: కలెక్టర్

image

వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ(వీటీడీఏ) పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. వీటీడీఏ పనులపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీటీడీఏ పనులు ఎప్పుడు మొదలు పెట్టారు? ఎక్కడి వరకు పూర్తి అయ్యాయో వివరాలు అడిగి తెలుసుకున్నారు.