India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
హుజూరాబాద్ మండలం పోతిరెడ్డి పేట గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సారెస్పీ కెనాల్ కాలువలో ఈతకు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గ్రామస్థుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఒకరి మృతదేహం లభించింది. పోలీసులు గజఈత గాళ్ల సాయంతో మరొకరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
జిల్లాలోని చిగురుమామిడి మండలం రేకొండ గ్రామానికి చెందిన రైతు చెంచల సంపత్ (35) మంగళవారం చింతచెట్టు పైనుంచి పడి మృతి చెందినట్లుగా గ్రామస్థులు తెలిపారు. మృతుడు సంపత్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతి పట్ల గ్రామస్థులు, బంధువులు విచారం వ్యక్తం చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే మార్గదర్శకమని బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎవరి లెక్క ఏంటో తేలాలని రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలోనే స్పష్టం చేశారన్నారు. బీఆర్ఎస్, బీజేపీ దొందు దొందే, రాంగ్ డైరెక్షన్‌లో పోయేలాగా ఈ రెండు పార్టీలు ప్రవర్తిస్తున్నాయన్నారు.
కాల్వశ్రీరాంపూర్, మల్యాలలో మేకలు దొంగతనం చేసిన చొప్పదండికి చెందిన మనుపతి సంజీవ్‌కుమార్, కమాన్‌పూర్ మండలం పెంచకల్‌పేటకు చెందిన శివరాత్రి రమేశ్‌లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్‌ఐ వెంకటేశ్ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటుపడి దొంగతనాలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నెల 2న కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన టీ.కొమురయ్య 3, మల్యాలకు చెందిన బీ.రాజయ్య 2 మేకలను దొంగతనం చేశారని ఎస్‌ఐ తెలిపారు.
కోనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కదిరే శ్రీనివాస్ గౌడ్ (45) కాశీలో మృతి చెందాడు. కుటుంబసభ్యులు వివరాల ప్రకారం.. 4 రోజుల క్రితం మిత్రులతో కలిసి ప్రయాగ్ రాజ్ లోని కుంభమేళాకు వెళ్లారు. తరువాత అయోధ్య రామమందిరాన్ని దర్శించుకొని ఆదివారం కాశీకి వెళ్లారు. కాశీలో దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉండగా స్పృహతప్పి కిందపడ్డాడు. స్నేహితులు హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మృతి చెందినట్లు తెలిపారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మినీ జాతరకు ఒక్క రోజే మిగిలి ఉంది. రేపటి నుంచి 15 వరకు జాతర వైభవంగా జరగనుంది. ఇప్పటికే వేల సంఖ్యలో భక్తులు అమ్మవార్లకు ముందస్తు మొక్కులు చెల్లిస్తున్నారు. TG నుంచి మాత్రమే కాకుండా.. AP, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి సైతం భక్తులు ఇక్కడికి వస్తుండటం విశేషం. భక్తులకు ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మీరూ వనదేవతల జాతరకు వెళ్తున్నట్లైతే కామెంట్‌లో తెలపండి.
కరీంనగర్ జిల్లా ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు శుభవార్త తెలిపారు. 11 రోజులు రద్దు కావాల్సిన భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 11 నుంచి 14 వరకు పునరుద్ధరించినట్లు రైల్వే అధికారి శ్రీధర్ ఉత్తర్వులు జారీచేశారు. నేడు SECలో బయల్దేరి కాజీపేట మీదుగా కాగజ్‌నగర్(ఈనెల11 నుంచి 14)కు వెళ్తుందని, మళ్లీ 12న కాగజ్‌నగర్ నుంచి SEC(ఈనెల 12-15)వరకు నడపనున్నట్లు అధికారులు ఉత్తర్వులో పేర్కొన్నారు.
కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల శాసనమండలి ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఘట్టం నిన్నటితో ముగిసింది. సోమవారం పోటాపోటీగా ర్యాలీలు నిర్వహించి నామినేషన్లు వేశారు. మొత్తం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి 100 మంది, ఉపాధ్యాయుల స్థానానికి 17 మంది నామినేషన్లు వేశారు. నేడు నామినేషన్లను పరిశీలిస్తారు. ఉపసంహరణకు ఈనెల 13న మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అమృత్ మిత్ర పథకాన్ని మహిళా స్వయం సహాయక సంఘాలు విజయవంతం చేయాలని కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సోమవారం మహిళా సంఘ సభ్యులతో సమీక్షించారు. ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం అమృత్ 2.0 పథకం కింద ప్రారంభించిన అమృత్ మిత్ర ప్రాజెక్టు మార్గదర్శకాలపై చర్చించారు.
నేషనల్ హైవే రోడ్డు పనులను వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి నేషనల్ హైవే అధికారులను, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో నేషనల్ హైవే ఇంజినీర్, కాంట్రాక్టర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. టౌన్ లో వాటర్ పైప్ లైన్, సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలన్నారు. పందిళ్ళ టోల్ గేట్ నిర్మాణానికి భూసేకరణ చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.