India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సింగరేణి అంచెలంచలుగా ఎదుగుతూ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. నేడు 135 వసంతాలు పూర్తిచేసుకుని 136వ వసంతంలోకి అడిగెడుతోంది. రామగుండంలో 1937 సంవత్సరంలో బొగ్గు తవ్వకాలు ప్రారంభమయ్యాయి. మొదటగా హైదరాబాద్ దక్కన్ కంపెనీతో ఏర్పాటైన ఈ సంస్థ.. 1920 డిసెంబర్ 23న సింగరేణి కాలరీస్ కంపెనీగా పేరు మార్చారు. అప్పటినుంచి ప్రతియేటా డిసెంబర్ 23న సింగరేణి ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తెలంగాణ మణి కిరీటం సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి, ప్రగతి పథంలో సాగుతూ దేశానికి వెలుగులు నింపుతుండటం రాష్ట్రానికి గర్వకారణమని పేర్కొన్నారు. సింగరేణి మరో శత వసంతాలు ఉజ్వలంగా దేశంలోనే అగ్రగామి సంస్థగా నిలవాలని ఆకాంక్షించారు.
సింగరేణి సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంను అందంగా ముస్తాబు చేశారు. ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు GM లలిత కుమార్ తెలిపారు. సింగరేణి జెండా ఆవిష్కరణ, స్టాల్స్ ఏర్పాట్లను జీఎంతో పాటు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా సింగరేణి కుటుంబాలు, స్థానికులు హాజరు కావాలన్నారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన అస్త్ర కన్వెన్షన్ సెంటర్, ది కాప్ కేఫేలను తెలంగాణ డిజిపి జితేందర్ ప్రారంభించారు. కరీంనగర్ పోలీసుల సంక్షేమం కోసం తీసుకున్న చర్యల్లో భాగంగా వీటిని ఏర్పాటు చేశామని అన్నారు. అత్యాధునిక హక్కులతో తీర్చిదిద్దిన అస్త్ర ఏసీ కన్వెన్షన్ సెంటర్, ది కప్ కేఫ్ అధికారులకు, సిబ్బందికి ఉపయోగపడతాయన్నారు.
@ మెట్ పల్లిలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్.
@ కరీంనగర్ జిల్లాలో భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన డిజిపి జితేందర్.
@ గొల్లపల్లి మండలంలో భక్తులతో పోటెత్తిన దొంగ మల్లన్న ఆలయం.
@ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో కొండచిలువ హతం.
@ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి.
@ జగిత్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.
దళిత స్పీకర్‌పై పేపర్లు విసిరిన ఘనుడు కౌశిక్ రెడ్డి అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. దళితులను మోసం చేసి వారిపై కపట ప్రేమ చూపిస్తున్నాడని మండిపడ్డారు. రైతులు, ప్రజల సమస్యలు పరిష్కరించకుంటే హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు రానున్న రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారని హుజరాబాద్ నియోజకవర్గం పర్యనలో భాగంగా హెచ్చరించారు.
కరీంనగర్లో ఏర్పాటు చేసిన భరోసా కేంద్రంతో మహిళలకు, బాలికలకు మరింత భద్రత కలుగుతుందని డీజీపీ జితేందర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భరోసా కేంద్రం ద్వారా పోలీసు, న్యాయ, వైద్య సేవలు ఒకే గూటి కింద ఉంటాయని, పోక్సో కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూస్తామన్నారు.
డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించనున్నట్లు కరీంనగర్ డిపో -2 మేనేజర్ వి.మల్లయ్య తెలిపారు. కావున కరీంనగర్-2 డిపో పరిధిలోని కరీంనగర్, చొప్పదండి, ధర్మారం, గంగాధర తదితర మండలాల ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలు, సూచనలు సెల్ నంబర్ 9959225921 కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.
వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన బండారి చేరాలు బైక్‌పై జమ్మికుంటకు వెళ్తుండగా వేగంగా వస్తున్న కారు ఢీ కొట్టంది. ఈ ప్రమాదం బేతిగల్ శివారులో జరిగింది. తీవ్ర గాయాలైన చేరాలుని చికిత్స నిమిత్తం హన్మకొండ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. చేరాలు భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తోట తిరుపతి తెలిపారు.
@ జూలపల్లి మండలంలో విద్యుత్ షాక్‌తో 15 గొర్రెలు మేకలు మృతి.
@ కోరుట్ల మండలంలో ఆర్టీసీ బస్సు ఢీకొని వృద్ధుడి మృతి.
@ మల్లాపూర్ మండలంలో ఆర్థిక ఇబ్బందులతో రైతు ఆత్మహత్య.
@ తంగళ్లపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ గొల్లపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకులాన్ని పరిశీలించిన మెట్పల్లి కోర్ట్ మెజిస్ట్రేట్.
Sorry, no posts matched your criteria.