Karimnagar

News July 21, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ సైదాపూర్ మండలంలో పాముకాటుతో యువతీ మృతి. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షం. @ వేములవాడ సాయిబాబా ఆలయంలో భక్తుల రద్దీ. @ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల కలెక్టర్. @ సీఎం సహాయనిది చెక్కులను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే. @ కరీంనగర్ లో గోరింటాకు వేడుక.

News July 21, 2024

సౌదీలో బేగంపేట వాసి మృతి

image

బెజ్జంకి మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన రాగి రవి (55) అనే వ్యక్తి సౌదీలో ఈనెల 13న అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. రాగి రవి గత 16 ఏళ్లుగా సౌదీలో ఉంటున్నాడు. అక్కడ గొర్ల కాపరి, వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం స్వగ్రామానికి వచ్చి మళ్లీ తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన అనారోగ్యంతో మృతిచెందినట్లు అక్కడి ఆయన స్నేహితుల ద్వారా తెలిసింది.

News July 21, 2024

హుస్నాబాద్: భూవివాదంలో ఏఆర్ కానిస్టేబుల్‌పై గొడ్డలితో దాడి

image

హుస్నాబాద్ మండలం శ్రీరాములపల్లెలో భూవివాదం జరిగింది. వ్యవసాయ భూమి సరిహద్దుల విషయంలో రెండు వర్గాలకు మధ్య పెద్ద ఘర్షణ చోటుచేసుకుంది. గొడవలో దవీందర్ అనే వ్యక్తిపై గొడ్డలితో దాడి చేయగా.. ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, రవీందర్ కరీంనగర్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.

News July 21, 2024

పెద్దపల్లి: మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

image

పెద్దపల్లి జిల్లా మంథని మండలానికి చెందిన మహిళ మృతదేహాన్ని సంచిలో మూటకట్టి పడేసిన ఘటన ఈనెల 8న పారుపల్లిలో జరిగింది. కాగా, ఈ కేసును మంథని సీఐ వెంకటేశ్వర్లు ఆద్వర్యంలో పోలీసులు ఛేదించారు. అప్పు నుంచి తప్పించుకోవడానికి అమ్ము రజితను ఆమె భర్త తిరుపతి గొంతు నులిమి చంపగా, జేసీబీ డ్రైవర్ రవి సంచిలో మూటకట్టి బావిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు.

News July 21, 2024

కరీంనగర్: భారీ వర్షం.. ఈ నంబర్‌కి కాల్ చేయండి

image

భారీ వర్షం కారణంగా కరీంనగర్ పరిధిలోని ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు బల్దియా అత్యవసర చర్యలు ప్రారంభించింది. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. వరద నీరు నిలవకుండా రెస్క్యూ టీం సభ్యులు పనిచేస్తారు. భారీ గుంతలు ఏర్పడితే తాత్కాలికంగా మట్టితో పూడ్చివేస్తారు. అత్యవసర సేవలకైన 98499 06694 నంబర్ కాల్ చేయలని కమిషనర్ ప్రపుల్ దేశాయ్, నగర్ మేయర్ సునీల్ రావు పేర్కొన్నారు.

News July 21, 2024

ఎస్సారెస్పీకి పెరుగుతున్న వరద

image

శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి 15,100 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 489 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి వదులుతున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కెపాసిటీ 80.5 టీఎంసీలకు ప్రాజెక్టులో 18.443 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సరస్వతి కెనాల్‌కు 10 క్యూసెక్కుల, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

News July 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ సైదాపూర్ మండలంలో పురుగుల మందు తాగి మహిళా ఆత్మహత్య. @ కథలాపూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్. @ ఎండపల్లి మండలంలో 5 డెంగ్యూ కేసులు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం. @ వెల్గటూర్ మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్. @ సిరిసిల్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు సస్పెండ్.

News July 20, 2024

ఉపాధ్యాయుడిగా మారిన సిరిసిల్ల కలెక్టర్

image

సిరిసిల్ల పట్టణంలోని గీతానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం ఈ సందర్భంగా విద్యార్థులకు బోధన చేసి పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను ఆయన పరిశీలించారు. పాఠశాలలోని పలు రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థులను సమస్యలు ఏమైనా ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు.

News July 20, 2024

మంథని: బస్టాండ్‌లో చేపలు పడుతున్న ప్రయాణికులు

image

మంథని మున్సిపాలిటీ పరిధిలోని బస్టాండ్ ప్రయాణ ప్రాంగణం శుక్రవారం రాత్రి కురిసిన వర్షాలకు చిన్న పాటి చెరువును తలపించేలా మారిపోయింది. బస్టాండ్‌లోకి వరద రావడంతో అందులో చేపలు కనబడుతున్నాయని ప్రయాణికులు నీటిలోకి దిగారు. వారు చేపలు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

News July 20, 2024

కరీంనగర్: పదవుల్లో జిల్లా నేతలు.. అభివృద్ధిపై గంపెడాశలు!

image

కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై ఆశలు చిగురిస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో జిల్లా నేతలు కీలక పదవుల్లో కొనసాగుతుండటంతో అభివృద్ధిపై ప్రజలు గంపెడాశలు పెట్టుకున్నారు. కేంద్రమంత్రిగా బండి సంజయ్, రాష్ట్ర మంత్రులుగా శ్రీధర్ బాబు, పొన్నంతో పాటు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్‌కు ప్రభుత్వ విప్ పదవులు దక్కగా జిల్లాకు కలిసి వచ్చే అంశంగా భావిస్తున్నారు.