India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరోనా మహమ్మారి పిడకలను మరిచిపోకముందే మరో అంటువ్యాధి భయపెడుతోంది. ఆఫ్రికా కేంద్రంగా వ్యాపించిన మంకీపాక్స్ ఇప్పుడు మన పొరుగు రాష్ట్రాలకు చేరింది. దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇప్పటివరకు కేసులు నమోదు కానప్పటికీ ముందస్తు జాగ్రత్తలు చేపట్టింది. కరోనా తరహాలో ఐసోలేషన్, మెడికల్ కిట్లు, మందులు అందుబాటులో ఉంచినట్లు కరీంనగర్ జిల్లా వైద్యాధికారి సుజాత తెలిపారు.
మంత్రి శ్రీధర్ బాబు బుధవారం ప్రారంభించిన జీడికే -5 ఓసీపీ సైట్ ఆఫీస్ భవన ప్రారంభోత్సవ శిలాఫలకంపై పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శిలాఫలకం ప్రారంభించే వరకు అందులో ఎంపీ పేరులేదన్న విషయం ఎవరికీ తెలియలేదు. శిలాఫలకంపై తన పేరు లేకపోవడాన్ని గుర్తించిన ఎంపీ.. సింగరేణి అధికారులను ఆరాతీసినట్లు సమాచారం.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1082.10 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టులో 4,717 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అవుట్ ఫ్లో 4,717 క్యూసెక్కులు కాగా.. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 51.02 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
RTC బస్సు ఢీకొని PDPL జిల్లా ఓదెల మండలంలో <<13918308>>సింగరేణి ఉద్యోగి మృతి<<>> చెందిన విషయం తెలిసిందే. పోత్కపల్లి పోలీసుల ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన రంజిత్‌కుమార్(39)కు 14 ఏళ్ల క్రితం ఓదెల మండలానికి చెందిన రజితతో పెళ్లయింది. వీరికి నెల క్రితమే ఓ బాబు పుట్టాడు. అయితే సుల్తానాబాద్‌లో ఓ శుభకార్యానికి హాజరై.. అత్తగారింటి వద్ద ఉన్న భార్య, కొడుకును చూడటానికి వెళ్తుండగా బస్సును ఎదురుగా ఢీకొని మృతి చెందాడు.
MLA రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ చొరవతో రామగుండం అభివృద్ధికి నిధులు విడుదల అయ్యాయని నగర మేయర్ డా.బంగి అనిల్ కుమార్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిధులు రాక పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయని పేర్కొన్నారు. నగరంలో చేపడుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రచారం చేసుకోవడం సరైంది కాదన్నారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో మండల వ్యవసాయ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. రుణమాఫీపై నిర్వహించే స్పెషల్ డ్రైవ్‌లో రైతుల సందేహాలను నివృత్తి చేయడంతో పాటు ఫిర్యాదులను పరిష్కరిస్తారన్నారు. మండలంలోని అన్ని బ్యాంకుల అధికారులతో వ్యవసాయ అధికారులు సమన్వయం చేసి రుణమాఫీపై స్పష్టమైన నివేదికను తయారు చేయాలన్నారు. రైతులకు సందేహాలు ఉంటే పరిష్కారం చేయాలన్నారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.87,793 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.59,182, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ26,750, అన్నదానం రూ.10,861 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం మహిళలకు ఉచితంగా పంపిణీ చేసే చీరల పంపిణీపై ఇంకా స్పష్టత లేదు. బతుకమ్మ ప్రారంభం కావడానికి 40 రోజుల సమయం మాత్రమే ఉన్న చీరల పంపిణీ గురించి ఎలాంటి హడావిడి లేదు. గతేడాది కరీంనగర్ జిల్లాలో 3,53,707 మంది మహిళలకు పంపిణీ చేశారు. 2017 నుంచి ఏటా 18 ఏళ్లు నిండిన ఆడపడుచులందరికీ గత ప్రభుత్వం ఉచితంగా అందించింది.
పాత సెల్ ఫోన్లను కొనుగోలు చేసి వాటితో సైబర్ మోసాలకు పాల్పడుతున్న బిహార్‌కు చెందిన ముగ్గురిని రామగుండం పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4 వేల పాత సెల్ ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత ఫోన్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి వాటిని ఝార్ఖండ్‌లోని ఓ ముఠాకు అప్పగిస్తుంటారు. వారు వాటిలోని సాఫ్ట్‌వేర్ ఆధారంగా సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు చెప్పారు.
మాజీ హోంగార్డు హత్యకు గురైన ఘటన పెద్దపల్లి జిల్లా ఓదెలా మండలంలో జరిగింది. కొలనూర్ గ్రామానికి చెందిన మాజీ హోంగార్డు మాటూరి విజయ్‌ని అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాగా ఈ హత్యకు భూ వివాదాలు కారణం అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెద్దపల్లి ఏసీపీ కృష్ణ, సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.