Karimnagar

News December 14, 2024

గ్రూప్-2 పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: రామగుండం CP

image

డిసెంబర్ 15, 16 తేదీలలో జరగనున్న గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో పరీక్షా కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 అమలులో ఉంటుందని ఈ రోజు రామగుండం సీపీ శ్రీనివాస్ తెలిపారు. రామగుండం కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 23,969 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని.. అందులో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 18 పరీక్షా కేంద్రాలలో 9018, మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 48 పరీక్షా కేంద్రాలలో 14,951 మంది హాజరు కానున్నారన్నారు.

News December 13, 2024

బంగారం అపహరించిన దొంగలను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు

image

బంగారం అపహరించిన దొంగలను కరీంనగర్ పోలీసులు పట్టుకున్నారు. జగిత్యాల జిల్లా కథలపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ బుధవారం కరీంనగర్‌లో పెళ్లి వేడుకకు హాజరై తిరుగు ప్రయాణంలో 10 తులాల బంగారు ఆభరణాల కలిగిన బ్యాగును పొగొట్టుకుంది. KNR పోలీసులు చాకచక్యంగా దొంగను పట్టుకొని బాధితురాలికి బంగారాన్ని అందజేశారు. ఇన్‌స్పెక్టర్ కోటేశ్వర్, క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్‌లను సిపి అభినందించారు.

News December 13, 2024

కరీంనగర్‌లో పోలీస్ సిబ్బందిని అభినందించిన సీపీ అభిషేక్ మహంతి

image

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్‌లో సిబ్బందిని శుక్రవారం సీపీ అభిషేక్ మహంతి అభినందించారు. జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం బొమ్మన గ్రామానికి చెందిన హేమశ్రీ ఆభరణాలను గుర్తించి పట్టుకుని, బాధితురాలికి అందించిన ఘటనలో కృషి చేసిన కరీంనగర్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ బిల్లా కోటేశ్వర్, అతని సిబ్బంది అయిన క్రైమ్ కానిస్టేబుళ్లు కుమార్, సంపత్‌లను సిపి అభిషేక్ మహంతి ప్రత్యేకంగా అభినందించి ప్రశాంస పత్రాలు అందజేశారు.

News December 13, 2024

మల్యాల: వ్యక్తి సజీవ దహనం.. UPDATE

image

షార్ట్ సర్క్యూట్‌తో నిన్న మల్యాల మండలంలో వ్యక్తి <<14855286>>సజీవ <<>>దహనమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. మ్యాడంపల్లి గ్రామానికి చెందిన తిరుపతి(40) ట్రాక్టర్ డ్రైవర్‌, భార్య సౌందర్య హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్‌తో ఇంట్లో మంటలు చెలరేగాయి. స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అప్పటికే తిరుపతి మంటలకు ఆహుతి అయ్యాడు.

News December 12, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ మల్యాల మండలంలో షార్ట్ సర్క్యూట్‌తో వ్యక్తి సజీవ దహనం.
@ ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ వెల్లుల్ల ఎల్లమ్మ ఆలయాన్ని ఎండోమెంట్ చేయవద్దని మెట్పల్లిలో ధర్నా.
@ లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు అందుకున్న కోరుట్ల చిన్నారి.
@ కోరుట్ల పట్టణంలో జర్నలిస్టుల ధర్నా.

News December 12, 2024

KNR: నూతన డైట్ మెనూ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

image

కరీంనగర్ జిల్లాలోని అన్ని సంక్షేమ హాస్టళ్లలో నూతన డైట్ మెనూ అమలు ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం గురుకుల హాస్టల్ విద్యార్థులకు 40% డైట్ ఛార్జీలను పెంచిందన్నారు.

News December 12, 2024

దత్తాత్రేయ దేవాలయంలో మంత్రి శ్రీధర్ బాబు పూజలు

image

భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని ధన్వాడ గ్రామంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సతీ సమేతంగా, దత్తాత్రేయ దేవాలయంలో దత్త నవరాత్రుల సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలు, పండ్ల రసాలతో అర్చకులు వేదమంత్రాల మధ్య అభిషేకాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు దేవాలయానికి విచ్చేసి దత్తుని సేవలో తరించారు.

News December 12, 2024

ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్ 

image

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. ఏ విధంగా సర్వే చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అయన వెంట ఆర్డీవో జివాకర్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ఇంజినీరింగ్ అధికారి రాజేశ్వర్, తహశీల్దార్ ప్రసాద్, ఎంపీడీవో చంద్రశేఖర్ పాల్గొన్నారు.

News December 12, 2024

మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా?: KTR

image

రేవంత్ మీది ప్రభుత్వమా.. లేక అబద్దాల ఫ్యాక్టరీనా? రూ.50 వేల కోట్లు, రూ.65 వేల కోట్లు వడ్డీలు కడుతున్నామని అవాస్తవాల వల్లింపు ఎవరి కోసం అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆర్బీఐ హ్యాండ్ బుక్ ఆఫ్ ఇండియా స్టేటస్ Xలో షేర్ చేశారు. దీన్ని బట్టి అర్థమవుతోంది ఈ ఏడాది తెలంగాణ కట్టాల్సిన వడ్డీ రూ.22,406 కోట్లు అని ఆర్బీఐ పేర్కొందని అన్నారు. కాకి లెక్కలతో ప్రజలని మోసగించడమే మీ విధానమా అని విమర్శించారు.

News December 12, 2024

కోరుట్ల: 5 నెలల చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్

image

కోరుట్లకు చెందిన 5 నెలల చిన్నారి శీలం శ్రీకృతి అరుదైన రికార్డు సాధించింది. 5 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులు, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. అతి చిన్న వయసులో ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంతో చిన్నారిని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి ఛాంబర్‌లో చిన్నారి తల్లిదండ్రులను పావని – వంశీని అభినందించారు.

error: Content is protected !!