Karimnagar

News August 21, 2024

కరీంనగర్: ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎప్పుడు?

image

మూడేళ్లుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా జిల్లాలో బీసీ సంక్షేమ శాఖలోనే రూ.131.35 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. దీంతో కళాశాలల యాజమాన్యాలు ఫీజులు చెల్లించాలని విద్యార్థులపై ఒత్తిడి తేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా BC, SC, ST, మైనార్టీ, EBC విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయకపోవడంతో బకాయిల భారం పెరిగింది.

News August 21, 2024

కరీంనగర్ జిల్లాలో 90కి పైగా డెంగ్యూ కేసులు!

image

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి విష జ్వరాలు వ్యాపిస్తున్నాయి. దీంతో చాలా మంది జ్వరాల బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకునేందుకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

News August 21, 2024

కరీంనగర్: రైతు భరోసా కోసం ఎదురుచూపులు!

image

కరీంనగర్ జిల్లాలోని రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. వానకాలం సాగు మొదలై 2 నెలలు కావొస్తున్నా రైతు భరోసా పథకం అమలు ఊసేలేదు. రైతులు పెట్టుబడుల కోసం అప్పులు చేస్తున్నారు. కాగా జిల్లాలో 3,45,070 ఎకరాల్లో పంటలు సాగు కాగా.. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన విధంగా ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయంగా ఇస్తే జిల్లా రైతులకు రూ.258.8 కోట్ల లబ్ధి చేకూరనుంది.

News August 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

@ కోనరావుపేట మండలంలో ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్. @ సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించిన జగిత్యాల కలెక్టర్. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ జమ్మికుంట మండలంలో బైకును ఢీ కొట్టిన కారు. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి.

News August 20, 2024

కరీంనగర్ కార్పొరేషన్ కమిషనర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌

image

కరీంనగర్ కార్పొరేషన్‌ కొత్త కమిషనర్‌గా చాహత్‌ బాజ్‌పాయ్‌‌ని నియమిస్తూ తెలంగాణ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2019 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన చాహత్‌ బాజ్‌పాయ్‌‌ ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్‌గా, ఉట్నూర్ ఐటీడీఏ పీవోగా విధులు నిర్వర్తించారు.

News August 20, 2024

కరీంనగర్ జిల్లాలో 90 డెంగ్యూ కేసులు

image

కరీంనగర్ జిల్లాలో ఇప్పటి వరకు 90కి పైగా డెంగ్యూ కేసులు నమోదైనట్లు ఆసుపత్రి లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దోమల వ్యాప్తి అధికంగా పెరిగింది. డెంగ్యూ, చికున్ గున్యా లాంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారు.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి చికిత్స తీసుకొని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

News August 20, 2024

పెద్దపల్లి రైల్వేస్టేషన్‌కు పెరగనున్న ప్రాధాన్యత

image

ఒడిశాలోని మల్కాన్ గిరి- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం రైల్వే స్టేషన్ మార్గం మరో ఐదేళ్లలో అందుబాటులోకి రావడంతో పెద్దపల్లి రైల్వే స్టేషన్‌కు ప్రాధాన్యత పెరగనుంది. ఇప్పటికే నిజామాబాద్ ముంబై వరకు రైలు మార్గం ఉంది. రాఘవాపూర్ మణుగూరు మార్గం అటు నుంచి పాండురంగాపురం-మల్కాన్‌గిరి మార్గం ప్రారంభమైతే కోనార్పుట్ మీదుగా జార్ఖండ్ వైపు, మరోవైపు జైపూర్, అరకు, విశాఖ వరకు రైలుమార్గాలు అనుసంధానమవుతాయి.

News August 20, 2024

రికార్డు సృష్టించిన కరీంనగర్ ఆర్టీసీ రీజియన్

image

కరీంనగర్ ఆర్టీసీ రీజియన్ రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ రీజియన్‌లో 5.20 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించారు. 4.40 లక్షల కిలోమీటర్ల మేర బస్సులు తిప్పగా 107 ఓఆర్ వచ్చింది. మూడు రోజుల్లో 450 అదనపు ట్రిప్పుల బస్సులను నడిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ మినహాయిస్తే కరీంనగర్ రీజియన్ మొదటిస్థానంలో నిలిచింది.

News August 20, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి సోమవారం రూ.1,50,293 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.65,775, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.70,900, అన్నదానం రూ.13,618,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 19, 2024

పెద్దపల్లి: అదనపు కలెక్టర్‌కు రాఖీ కట్టిన తబిత ఆశ్రమ చిన్నారులు

image

పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో రాఖీ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్‌లాల్‌కు రామగుండం పట్టణంలోని తబిత అనాథాశ్రమంలో చిన్నారులు కలెక్టర్‌కు రాఖీ కట్టి శుభాకాంక్షలు తెలిపారు. అన్నాచెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీపౌర్ణమి వేడుకలు నిర్వహించుకుంటారన్నారు.