India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్‌లో వరల్డ్ ఫోటోగ్రఫీ డే వేడుకలను ఫోటో& వీడియో జర్నలిస్ట్‌ల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్స్ తినిపించి ఫోటోగ్రాఫర్లకు శుభాకాంక్షలు తెలిపారు. సంఘంలో ఫోటోగ్రాఫర్ల సేవలు మరువ లేనిదని ఆయన అన్నారు.
మల్కాజిగిరి ఎంపీ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు బ్రహ్మకుమారీలు హైదరాబాదులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపి రాఖీ కట్టారు. రక్త బంధానికి ప్రతీకగా దేశ ప్రజలు రాఖీ పౌర్ణమి ఘనంగా నిర్వహించుకుంటారని అన్నారు. ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్సులో గర్భిణీకి పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో బస్సులోనే కండక్టర్ భారతి నార్మల్ డెలివరీ చేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి బస్సులోనే సకాలంలో పురుడు పోయడంతో తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారతిని అభినందించారు. ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూనే సేవాతత్పరతను చాటుతుండడం అభినందనీయమన్నారు.
ఆత్మీయ బంధానికి ప్రతిరూపం ఈ అన్నాచెల్లెళ్లు. చొప్పదండి(M) వెదురుగట్టకు చెందిన జక్కుల రవళి అన్నయ్యను స్ఫూర్తిగా తీసుకొని ఎస్సై ఉద్యోగం సాధించింది. అన్నయ్య రాకేశ్ 2009లో కానిస్టేబుల్‌గా ఎంపిక కాగా.. ఎస్సై ఉద్యోగానికి ప్రయత్నించి త్రుటిలో కోల్పోయారు. తన చెల్లెను బాగా చదివించి సూచనలు ఇస్తూ ఎస్సై పరీక్షకు సన్నద్ధం చేశారు. అన్న ప్రోత్సాహంతో మొదటి ప్రయత్నంలోనే 2020లో ఎస్సైగా ఎంపికైంది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి స్వల్పంగా వరద ప్రవాహం పెరిగింది. ఎగువ ప్రాంతాలలో వర్షాలు కురుస్తుండడంతో వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో శుక్రవారం 1,57,690 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ప్రస్తుతం 2,12,030 క్యూసెక్కులకు పెరిగింది. అధికారులు 85 గేట్లు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లే దిగువకు వదులుతున్నారు.
పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి దారుణం జరిగింది. గ్రామానికి చెందిన కనకయ్య తన అల్లుడైన అశోక్ తలపై బండరాయితో కొట్టి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రేమ వేధింపులు తట్టుకోలేక ఓ యువతి మనస్తాపంతో సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామానికి చెందిన గీసి శిరీష(20) సూసైడ్ చేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శిరీష డిగ్రీ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటోంది. ఆదివారం పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కాగా, శిరీష అన్నయ్య తన చెల్లిని ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధిస్తున్నట్లు వేములవాడ రూరల్ SI మారుతికి ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది.
మల్యాల మండలం రామన్నపేట మాజీ సర్పంచ్ వకుళాభరణం శ్రీనివాస్, భార్య అరుణ ఇటీవల మరణించగా వారి కుమారుడిని కేంద్ర మంత్రి బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం మల్యాలకు చెందిన గుండేటి గంగారాం భార్య ఇటీవల సూసైడ్ చేసుకోగా ఆయనను పరామర్శించి ఓదార్చారు. మద్దుట్ల గ్రామానికి చెందిన నరేందర్ చనిపోగా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, వేణు, శ్రవణ్ ఉన్నారు
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలు.
@ వేములవాడ రాజన్న, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
@ జగిత్యాల జిల్లాలో 165 డెంగ్యూ కేసులు నమోదు.
@ మెట్పల్లి మండలంలో పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు.
@ జగిత్యాలలో గుర్తుతెలియని మహిళా మృతదేహం లభ్యం.
@ మల్యాల మండలంలో రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొన్నిరోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తున్నాయి. ఓ వైపు వర్షాలు.. మరోవైపు ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాతావరణంలో మార్పుల వల్ల రోగనిరోధక శక్తి దెబ్బతిని, జ్వరాల బారిన పడుతున్నారు. కాగా ఈ నెల 19, 20, 21, 22వ తేదీల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణం నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ ఇప్పటికే తెలిపింది.
Sorry, no posts matched your criteria.