India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
బడుగు బలహీన వర్గాలు సర్దార్ సర్వాయి పాపన్న పోరాట పటిమను ఆదర్శంగా తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్‌లో సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలను వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. బహుజన రాజ్యాన్ని స్థాపించిన మొట్ట మొదటి వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్నారు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పోరాటం చేసిన మహాయోధుడని కొనియాడారు.
రైతు రుణమాఫీ అమలుపై కొడంగల్‌కు వస్తావా.. సిరిసిల్లకు వస్తావా KTR అని TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సవాల్ విసిరారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడుతూ.. చర్చకు రావాలని సీఎం రేవంత్ రెడ్డికి KTR విసిరిన సవాల్‌ను తాను స్వీకరిస్తున్నట్లు జగ్గారెడ్డి తెలిపారు. రైతులకు పదేళ్లలో BRS నేతలు చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేసి చూపించే సరికి ఎటూ పాలుపోక వింతగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
డయల్ 100 కాల్స్‌తో వచ్చిన ప్రతి ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ సీపీ అభిషేక్ మొహంతి అన్నారు. కమిషనరేట్ కేంద్రంలో నేర సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. గంజాయి రవాణాపై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి NDPS చట్టం ద్వారా కేసులు నమోదు చేయాలని సీపీ ఆదేశించారు.
రైతులకు రుణమాఫీ చేయడం KTR, హరీశ్‌రావుకు ఇష్టం లేదా? అని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు, ధరణి కమిటీ సభ్యుడు కోదండరెడ్డి ప్రశ్నించారు. HYD గాంధీభవన్‌లో శనివారం ఆయన మాట్లాడారు. KTRకు రాజకీయ నాలెడ్జ్ లేక ప్రజలను రెచ్చగొడుతున్నారని, హరీశ్‌రావు సీనియరై కూడా చిల్లరగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు రుణాలపై బ్యాంకుల నుంచి వివరాలు తెప్పించుకున్నామని, రుణమాఫీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోందన్నారు.
కాళేశ్వరంలోని రెండు లింగాల వెనుక ఒక కథ ఉంది. యమధర్మరాజు శివుడి కోసం తపస్సు చేసి వరం పొంది స్వర్గానికి మించిన పట్టణం నిర్మించాలని విశ్వకర్మ వద్దకు వెళ్లాడట. గోదావరి- ప్రాణహిత నదుల సంగమ తీరంలో ఇంద్రలోకాన్ని మించిన పురాన్ని నిర్మించారని అదే కాళేశ్వరక్షేత్రం అని చెబుతారు. అలా శివుడి వరంతో ఈ క్షేత్రంలో(యముడు) ఈశ్వరుడు(శివుడు) ఒకే పానపట్టంపై కొలువయ్యారని కాళేశ్వర ఖండం చెబుతోంది.
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ ప్రవేశాల గడువును ఆగస్టు 31 వరకు పొడిగించినట్లు మంథని డిగ్రీ కళాశాల ఓపెన్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ సమన్వయకర్త కృష్ణ ప్రకటనలో తెలిపారు. అడ్మిషన్లు కావలసినవారు వివరాలకు 73829 29649 ఫోన్ నంబర్‌కు సంప్రదించాలన్నారు.
కుమారుడి బారసాల చూడకుండానే తండ్రి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. శంకరపట్నం మండలం ముత్తారానికి చెందిన నాగిని వినోద్‌కుమార్ (34)కు నాలుగేళ్ల క్రితం పచ్చునూర్‌కు చెందిన లిఖితతో వివాహం జరిగింది. వీరికి ఇటీవల కుమారుడు జన్మించాడు. మరో 4 రోజుల్లో బారసాల ఉండగా.. తన మామయ్య సమ్మయ్య పొలం వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం నిర్మాణంలో కీలక భూమిక పోషించిన అప్పటి ప్రజాప్రతినిధులకు సమన్లు జారీ చేయాలని జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంజినీర్లు, మేధావులు, ఐఏఎస్‌లు, మాజీ ఐఏఎస్‌ల నుంచి వాంగ్మూలాలు సేకరించడంతో పాటు వారి నుంచి అఫిడవిట్లు స్వీకరించిన కమిషన్.. ఆ అఫిడవిట్లలో ఉన్న సమాచారం ఆధారంగా కొందరికి సమన్లు జారీ చేయనున్నట్లు సమాచారం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన. @ తంగళ్ళపల్లి మండలంలో గురుకులాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్. @ మెట్పల్లి మండలం లో బ్యాంక్ ఎదుట రైతుల ధర్నా. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్పల్లి మండలంలో గురుకుల పాఠశాల ఎదుట తల్లిదండ్రుల నిరసన. @ కోరుట్ల ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన జగిత్యాల కలెక్టర్.
హైదరాబాద్ సిటీలో గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని అధికారులను హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ వివిధ విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వారం రోజుల్లో ప్రజాప్రతినిధులతో గణేష్ ఉత్సవ కమిటీతో మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ సెంటర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Sorry, no posts matched your criteria.