Karimnagar

News December 2, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో తాటి చెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి గాయాలు. @ జగిత్యాల ప్రజావాణిలో 33 ఫిర్యాదులు. @ సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లా కేంద్రాలలో ట్రాన్స్ జెండర్ ల క్లినిక్‌లు ప్రారంభం. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్‌పల్లి పట్టణంలో ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్, ఎమ్మెల్యే సమీక్ష.

News December 2, 2024

రాజన్న ఆలయంలో మొక్కలు చెల్లించుకుంటున్న భక్తులు

image

వేములవాడ రాజన్న ఆలయంలో సోమవారం మార్గశిర మాసం మొదటి సోమవారం అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. చాలా మంది భక్తులు కొత్తగా పెళ్లయిన భక్తులు కోడలెక్కులు చెల్లించుకుంటూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శించుకున్నారు. ఆలయం ముంగట గజ స్థంభ వద్ద అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు.

News December 2, 2024

కోనరావుపేట: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

image

ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కేంద్రాలకు అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.

News December 2, 2024

ములుగులో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి..!

image

ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.

News December 2, 2024

KNR: కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 25 ఏండ్లు

image

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొయ్యూరు ఎన్‌కౌంటర్‌ జరిగి నేటికి 25 ఏండ్లు గడిచింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ఈ ఎన్‌కౌంటర్‌‌లో మృతి చెందారు. దీనికి గుర్తుగా మావోయిస్టులు బేగంపేటలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

News December 2, 2024

రికార్డు స్థాయిలో 1.53కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి: మంత్రి ఉత్తమ్

image

రాష్ట్రంలో అత్యధికంగా1.53 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం మన రైతులు పండించారని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈనెల 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి కి వచ్చారు. గతంలో ఎక్కడా లేని విధంగా సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 రూపాయల బోనస్ చెల్లిస్తుందన్నారు. రైతులకు ఎక్కడా తరుగు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు.

News December 1, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన స్టేట్ ఎడ్యుకేషన్ కమిషన్ చైర్మన్.@ ఎల్లారెడ్డిపేట మండలంలో గంజాయి విక్రత అరెస్ట్. @ జగిత్యాల లో ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీ. @ పెద్దపల్లిలో సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు. @ వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న, ధర్మపురి నరసన్నా ఆలయాలను దర్శించుకున్న సినీ నటుడు శ్రీకాంత్.

News December 1, 2024

పెద్దపల్లి: పాఠశాల భోజనాలను తరచుగా తనిఖీ చేయాలి: మంత్రి పొన్నం 

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ధాన్యం సేకరణ సజావుగా జరుగుతుందని మంత్రి పొన్నం అన్నారు. రైస్ మిల్లర్లు కూడా ప్రభుత్వ పాలసీ అనుసరిస్తూ సహకారం అందిస్తున్నారన్నారు. జిల్లాలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలలు, గురుకులాలు, సంక్షేమ హాస్టల్స్ ను కలెక్టర్, ఉన్నతాధికారులు నిరంతరం తనిఖీ చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చూడాలన్నారు. మెస్ ఛార్జీల బిల్లులను గ్రీన్ చానల్స్ ద్వారా సరఫరా చేస్తామన్నారు.

News December 1, 2024

సీఎం పర్యటన నేపథ్యంలో పెద్దపల్లిలో పర్యటించిన మంత్రులు

image

డిసెంబర్ 4న సీఎం పర్యటన సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌ పెద్దపల్లికి చేరుకున్నారు. కలెక్టరేట్ ఆవరణలోని వెల్ఫేర్ వద్ద కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్పగుచ్ఛంతో వారికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో MLAలు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విజయరమణారావు, మక్కాన్ సింగ్ ఉన్నారు.

News December 1, 2024

డిసెంబర్ 4వ తేదీన ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలి: కలెక్టర్

image

ప్రజా పాలన విజయోత్సవాల సాంస్కృతిక కార్యక్రమం డిసెంబర్ 4వ తేదీన సిరిసిల్ల పట్టణంలోని సి నారాయణ రెడ్డి కళాక్షేత్రంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించినున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. పట్టణంలోని కలెక్టరేట్లో ఆదివారం ఆయన మాట్లాడారు. జరగబోయే ఈ కార్యక్రమాలకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

error: Content is protected !!