India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. కుటుంబీకుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన శిరీష(30) అనే గర్భిణీ ప్రసవం కోసం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. అక్కడ వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ప్రసవం చేశారు. అయితే ప్రసవించిన కొద్ది గంటల్లోనే తల్లీ కుమార్తెలు మరణించారు. డెంగ్యూ లక్షణాలతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు.
పెద్దపల్లి కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన స్వాతంత్రం దినోత్సవ వేడుకలలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకావిష్కరణ చేశారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 140 మందికి ఉద్యోగులకు ప్రశంస పత్రాలను కలెక్టర్ కోయ శ్రీహర్ష, MLA విజయరమణారావుతో కలిసి అందజేశారు.
KNR జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కరీంనగర్లో నేడు జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను చేపట్టిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200లోపు యూనిట్ల వారికి ఉచిత విద్యుత్, తదితర సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేశామన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ మరింత పకడ్బందీగా అమలు చేస్తామన్నారు.
కరీంనగర్ పరేడ్ గ్రౌండ్స్‌లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ అభిషేక్ తదితరులు ఉన్నారు.
ప్రధాని మోదీ పిలుపునిచ్చిన హర్ ఘర్ తీరంగా కార్యక్రమంతో దేశం త్రివర్ణ శోభితమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. యావత్ భారతదేశం ఒక్క తాటిపైకి వచ్చి, జాతి మొత్తం సగర్వంగా త్రివర్ణ పతాకం వైపు చూసేలా చేసిందని తెలిపారు. స్వాతంత్ర్య వీరుల త్యాగాలను స్మరించుకుంటూ గురువారం న్యూఢిల్లీలోని అధికారిక నివాసంలో ఆయన జాతీయ పతాకావిష్కరణ చేశారు.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 20.175 టీఎంసీలకు 477.51 అడుగులకు గాను ప్రస్తుతం 13.87 టిఎంసిలు నీరు నిల్వ ఉంది ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులోకి 2,518 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుంది. అదేవిధంగా 3,810 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడుదల చేస్తున్నారు.
గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సంజయ్ నగర్‌కు చెందిన లింగమ్మ(63) అనే మహిళకు కీలు మార్పిడి ఆపరేషన్ చేసి సక్సెస్ చేశారు. డాక్టర్లు రాజు, యాకూబ్ ఆమెకు పరీక్షలు నిర్వహించి, మోకాలులోని కీలును తొలగించారు. మూడు రోజుల అనంతరం ఆమె యథాస్థితికి వచ్చి నడుస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ హిమబిందు, ఆసుపత్రి సూపరిండెంటెండ్ దయాల్ సింగ్ వైద్యులను అభినందించారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామానికి చెందిన బాలుడు అఖిల్(9) పాముకాటు గురై మృతి చెందాడు. అయితే తండ్రి లేకపోగా.. అఖిల్ తల్లి నిరుపేద కుటుంబానికి చెందినవారు కావడంతో వరంగల్ MGMకు తరలించారు. ఈ క్రమంలో బాలుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతు బుధవారం మృతి చెందాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అగ్గిపుల్ల సబ్బుబిళ్ల కాదేది కళకు అనర్హం అన్నట్టు సూక్ష్మకళలో రాణిస్తున్నాడు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడకకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆడెపు రజనీకాంత్. బ్లాక్ బోర్డుపై రాసేందుకు మాత్రమే ఉపయోగించే చాక్ పీస్‌పై 78 జాతీయ పతాకాలు చెక్కి ఆకట్టుకుంటున్నారు. ఇదివరకు కూడా రెండు బియ్యపు గింజలపై, 8 సెంటీమీటర్ల చాక్ పీస్‌పై 284 ఇంగ్లిష్ అక్షరాలతో జాతీయ గీతాన్ని చెక్కి ప్రశంసలు అందుకున్నారు.
కాకులు కొట్లాడుకుంటూ కరెంట్ తీగలకు తగలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయిన ఘటన KNR పట్టణంలో జరిగింది. అధికారుల ప్రకారం.. మంకమ్మతోటలోని లేబర్ అడ్డా హన్మాన్ ఆలయం సమీపంలో సా.4:21కు రెండు కాకులు కొట్లాడుకుంటూ సమీపంలోని 11KV గీతా భవన్ ఫీడర్పై పడ్డాయి. దీంతో కాకులు అక్కడికక్కడే మృతి చెందగా.. పద్మనగర్ 33KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాలకు కరెంట్ నిలిచిపోయింది. అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
Sorry, no posts matched your criteria.