India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కాకులు కొట్లాడుకుంటూ కరెంట్ తీగలకు తగలడంతో కరెంట్ సరఫరా నిలిచిపోయిన ఘటన KNR పట్టణంలో జరిగింది. అధికారుల ప్రకారం.. మంకమ్మతోటలోని లేబర్ అడ్డా హన్‌మాన్ ఆలయం సమీపంలో సా.4:21కు రెండు కాకులు కొట్లాడుకుంటూ సమీపంలోని 11KV గీతా భవన్ ఫీడర్‌పై పడ్డాయి. దీంతో కాకులు అక్కడికక్కడే మృతి చెందగా.. పద్మనగర్ 33KV విద్యుత్ ఉపకేంద్రం పరిధిలోని ప్రాంతాలకు కరెంట్ నిలిచిపోయింది. అధికారులు కరెంట్ సరఫరాను పునరుద్ధరించారు.
విదేశీ పర్యటన ముగించుకొని రాష్ట్రానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులను వేములవాడ MLA, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేరువేరుగా బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు తీసుకురావడానికి ఎంతో దోహదపడుతుందని ఆది శ్రీనివాస్ అన్నారు. పర్యటన పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.
@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
@ జగిత్యాల కలెక్టర్‌తో ఎంపీ ధర్మపురి అరవింద్ భేటీ
@ ముస్తాబాద్ మండలంలో ఉరివేసుకొని వ్యక్తి ఆత్మహత్య
@ సిరిసిల్లలో ఇంట్లో దూరిన నెమలి.. పట్టుకున్న ఫారెస్ట్ అధికారులు
@ మెట్పల్లిలో బాలుడి కిడ్నాప్ కు పాల్పడిన పడిన వ్యక్తి అరెస్ట్
@ స్వాతంత్ర దినోత్సవానికి ముస్తాబైన ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లు
పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో స్వాతంత్ర దినోత్సవం ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, రెవిన్యూ డివిజనల్ అధికారి మహేశ్వర్ కలిసి పరిశీలించారు. మైదానంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. రేపు ఉ.9 గంటలకు మంత్రి శ్రీధర్ బాబు జెండా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. అధికారులు తమ కార్యాలయంలో వేడుకల అనంతరం పరేడ్ గ్రౌండ్‌కు రావాలని సూచించారు. మైదానంలో అన్ని సదుపాయాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.1,23,427 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.50,261, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.59,930, అన్నదానం రూ.13,236, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో మరో 10 నూతన గ్రామపంచాయతీలు ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం జిల్లాలో 313 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రజలకు మెరుగైన వసతులు, పాలనా సౌలభ్యం చేరువ కావడానికి రాష్ట్ర సర్కార్ కొత్త పంచాయతీలు ఏర్పాటు చేయనుంది. నిబంధనల మేరకు జిల్లాలో 10 చోట్ల అవకాశముందని గెజిట్‌ను విడుదల చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 313 ఉండగా కొత్తగా పది నూతన గ్రామపంచాయతీల ఏర్పాటుతో వాటి సంఖ్య 323 కానుంది.
కరీంనగర్ ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రత చర్యలపై పలు శాఖల అధికారులతో కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి సమావేశం నిర్వహించారు. కరీంనగర్‌లోని ట్రాఫిక్ నియంత్రణ కొరకు ప్రధాన కూడళ్ల వద్ద సిగ్నల్ వ్యవస్థను మరింత మెరుగుపరచాలన్నారు. సీసీ కెమెరాలను సంఖ్యను పెంచి వాటి పనితీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. అవసరమైన చోట్ల మాత్రమే యూ టర్న్‌ల ఏర్పాటు చేయాలని తెలిపారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ బాలికల పాఠశాలను కలెక్టర్ పమేల, మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, ప్రిన్సిపల్‌తో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నాణ్యమైన భోజనం అందుతుందా అని విద్యార్థులను అడిగారు.
మహిళల ఆర్థిక క్రమశిక్షణతోనే కుటుంబాలలో వెలుగులు నిండుతాయని, అందుకే ప్రతి మహిళ సాధికారత వైపు ప్రయాణించి కుటుంబాలను బాగు చేసుకుంటూ స్వశక్తితో ఎదగాలని మానకొండూరు MLA కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. రేగులపల్లి గ్రామంలోని ఓ మహిళా గ్రూపుకు చెందిన మాతంగి భారతి అనే మహిళ స్వయం సహాయక నిధి నుంచి రూ.5లక్షల అప్పు తీసుకుని ఏర్పాటు చేసుకున్న పిండి గిర్నిని బుధవారం MLA ప్రారంభించారు.
జగిత్యాల పట్టణంలోని 46వ వార్డులో నేడు ఏర్పాటు చేసిన ఆర్యవైశ్య భవనాన్ని జగిత్యాల MLA డా.సంజయ్ కుమార్, MLC జీవన్ రెడ్డి, MP ధర్మపురి అరవింద్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఒకే వేదికపై వేర్వేరు పార్టీల MLA, MLC, MLC పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ జ్యోతి తదితరులు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.