India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్‌కు నిర్వహించిన రివ్యూ సమావేశం ఢిల్లీలో కరీంనగర్ ఎంపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్‌తో కలిసి రివ్యూ సమావేశంలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నాయకత్వంలో సెంట్రల్ ఆర్మూడ్ పోలీస్ ఫోర్స్ అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడారు. సీఏపీఎఫ్ వారి పనితనం గర్వించదగ్గ విషయమని అన్నారు.
జగిత్యాల జిల్లాలో బీసీ నిరుద్యోగ యువతకు ఉపాధి నైపుణ్య శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సాయిబాబా ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు వెబ్ సైట్ tgbestudycircle.cgg.gov.inలో ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10th, ఇంటర్ పాసైన 18 నుంచి 25 ఏళ్ల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 0878-2268686 నెంబర్ ను సంప్రదించాలన్నారు
పెద్దపల్లి జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ సోషల్ మీడియా అకౌంట్ హాకింగ్‌కు గురైంది. ఈ విషయాన్ని ఆయన ఒక ప్రకటనలో స్వయంగా వెల్లడించారు. తన అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్లకు ప్రజలు, అధికారులు, తనకు తెలిసిన వారెవరు స్పందించవద్దని సూచించారు. ఫేక్ మెసేజ్ ల పట్ల అప్రమత్తంగా ఉండాలని శ్యాం ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.
జగిత్యాల జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం 141 డెంగ్యూ కేసులు నమోదైనట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ డా.శ్రీనివాస్ ‘Way2News’ ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. వర్షాకాలం వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజల జాగ్రత్తగా ఉండాలని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాలి అని సూచించారు.
సింగరేణిలో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే క్రమశిక్షణ చర్యల కింద కార్మికులకు, ఉద్యోగులకు కలర్ కార్డుల విధానాన్ని యాజమాన్యం గత కొన్ని నెలల క్రితం ప్రవేశ పెట్టిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ AITUC RG -1 బ్రాంచి కార్యదర్శి పోషం అన్నారు. దీంతో కార్మికులు ఆందోళనకు గురవుతున్నారని కలర్ కార్డుల విధానం రద్దు చేయాలని AITUC గత నెలలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా యాజమాన్యం నేడు రద్దుచేసినట్లు తెలిపారు.
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను సందర్శించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థులు తల్లిదండ్రులతో సమావేశాన్ని నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు సంజయ్, సత్యనారాయణ, సత్యం తదితరులున్నారు.
వైద్యం కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన, పారదర్శకమైన వైద్య సేవలు అందించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.
మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సిరిసిల్ల పీఎస్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా చేసి, ఔట్ పేషెంట్ రిజిష్టర్, ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ బెడ్స్, తదితర వాటిని పరిశీలించారు.
రాజీవ్ రహదారి ప్రమాదాలకు నిలయంగా మారింది. వాహనదారుల నుంచి ముక్కు పిండి టోల్ వసూలు చేస్తున్నా ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు. రాజీవ్ రహదారిపై బసంత్ నగర్ నుంచి మంచిర్యాల జిల్లా ఇందారం క్రాస్ రోడ్డు వరకు ఇసుక మేటలు వేయడం, సర్వీస్ రోడ్లు అధ్వానంగా మారినా తమకేం సంబంధం లేనట్టుగా రోడ్డు నిర్వహణ సంస్థ (HKR) వ్యవహరిస్తోంది.
మెట్‌పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల సంక్షేమ హాస్టల్‌కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం డిప్యూటీ సీఎం హాస్టల్‌ను పరిశీలించారు. ఆయన వెంట మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్‌లు లక్ష్మణ్ కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
కరీంనగర్ ఆర్టీసీ బస్సు డిపో నుంచి ఎలక్ట్రిక్ వాహనాలు వెళ్లే మార్గాలను ఖరారు చేసినట్లు డిపో అధికారులు తెలిపారు. మొత్తం 60 బస్సుల్లో జేబీఎస్‌కు 30, గోదావరిఖని 9, మంథని 4, కామారెడ్డి 6, జగిత్యాల 6, రాజన్న సిరిసిల్లకు వెళ్లేందుకు 6 బస్సులు కేటాయించినట్లు పేర్కొన్నారు. కాగా అద్దె ప్రాతిపదికన వీటిని నడపనున్నారు. త్వరలోనే ఈ బస్సులు రోడ్డెక్కనున్నాయి.
Sorry, no posts matched your criteria.