India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మహాత్మా నగర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఇటీవల విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన విషయం తెలిసిందే. కాగా, ఈ ఘటనలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ వి.రేవను కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఫుడ్ పాయిజన్ ఘటనపై సమాచారం ఇవ్వకుండా విద్యార్థినుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేఖలో పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ అమలులో రాష్ట్ర ప్రభుత్వం తీరు ‘నోటితో పొగిడి – నొసటితో వెక్కిరించినట్లు ఉందన్నారు. ఆరోగ్య శ్రీ రూ.10లక్షలకు పెంచి ఆచరణకు వచ్చే సరికి అసలు బిల్లులే చెల్లించకుండా నెట్ వర్క్ హాస్పిటల్స్‌ను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు కనుల పండుగగా జరిగాయి. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తెల్లవారుజామునే గోదావరి స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ వీపీ లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్, ఆలయ ఈఓ శ్రీనివాస్, ఇతర అధికారులు ముక్కోటి ఏకాదశి వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
తెలంగాణ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్ సీల్ ఫలితాలలో కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రానికి చెందిన బంగారి సింధుజ సత్తా చాటింది. గతేడాది జులైలో రాత పరీక్ష జరగగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. ఇందులో భాగంగా బంగారి సింధుజ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైంది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.
సంక్రాంతి పండుగకి ఊరికెళ్లే వారు జాగ్రత్తగా ఉండాలని సీపీ శ్రీనివాస్ పలు సూచనలు చేశారు. లొకేషన్, ట్రావెల్స్ ప్లాన్స్, ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అనే విషయాలను సోషల్ మీడియాలో అప్డేట్ చేయవద్దని చెప్పారు. స్వీయ రక్షణకు ఇంట్లో సీసీ కెమెరా అమర్చుకుంటే మంచిదన్నారు. ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే వెంటనే స్థానిక పోలీసులకి, డయల్ 100కి సమాచారం అందించాలని సూచించారు.
ప్రభుత్వ వసతి గృహాలను ప్రత్యేక అధికారులు నిత్యం క్షేత్రస్థాయి సందర్శించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన అధికారుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎంఈవోలు కూడా హాస్టల్లో భోజనాల తయారీ తీరును పరిశీలించాలన్నారు. నూతన కామన్ మెనూ అమలు కోసం ఇంకా ఏమైనా వంట పాత్రలు వంటివి కావాలంటే అందిస్తామని తెలిపారు. హాస్టల్లో మరమ్మతులు పూర్తి చేయాలన్నారు.
@ రేపటినుండి కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు. @ జగిత్యాల జిల్లాలో బిజెపి మండల నూతన అధ్యక్షుల నియామకం. @ పెగడపల్లి మండలంలో మెగా పశువైద్య శిబిరం. @ మల్లాపూర్ మండలంలో బావిలో పడి బాలుడి మృతి. @ కోరుట్ల మండలంలో సంపులో పడి యువకుడి మృతి. @ మానకొండూరు మండలంలో లారీ ఢీకొని యువకుడి మృతి. @ బాలుడికి ఆర్థిక సహాయం అందించిన సిరిసిల్ల కలెక్టర్.
సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లేవారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం ఆయన ప్రకటన విడుదల చేశారు. పండుగకి ఊరు వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. ఊరికి వెళ్లేవారు తప్పనిసరిగా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లేదా గ్రామ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
కొత్తకొండ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. 10న స్వామి వారి కళ్యాణం, 11న త్రిశూలార్చన, 12న లక్షబిల్వర్చన, 13న భోగి పండుగ, 14న సంక్రాంతి పండుగ సందర్భంగా బండ్లు తిరుగుట,15న కనుమ ఉత్సవం,16న పుష్పయాగం, నాగవళ్లి, 17న త్రిశూల స్నానం కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈఓ కిషన్ రావు తెలిపారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ప్రాణాలు కోల్పోయిన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే గాయపడ్డ భక్తులు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు Xలో పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.