India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
స్కాలర్షిప్లు విడుదల చేయాలని కోరుట్ల డిగ్రీ కళాశాల విద్యార్థులు సీఎంకు పోస్ట్ కార్డు ద్వారా విన్నవించారు. మూడేళ్లుగా స్కాలర్‌షిప్‌లు రాకపోవడం వల్ల పరీక్ష ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు కొనుక్కోవడానికి ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. బస్ పాసుల కోసం డబ్బులు లేక కళాశాలకు రెగ్యులర్‌గా రాలేక చాలా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్కాలర్‌షిప్‌ను విడుదల చేయాలని కోరారు.
సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచ గ్రామానికి చెందిన మానువాడ నర్సయ్య పాస్‌పోర్ట్ పోగొట్టుకొని బహ్రయిన్ జైలులో చిక్కుకున్నాడు. ఈ మేరకు నర్సయ్యను స్వదేశానికి క్షేమంగా వచ్చేలా చూడాలని వేములవాడ MLA ఆది శ్రీనివాస్ ఎంబసీ అధికారులను కోరారు. 28 ఏళ్ల కిందట నర్సయ్య బతుకుదెరువు నిమిత్తం బహ్రయిన్‌కు వెళ్లి మూడేళ్ల పాటు తాపీమేస్త్రీగా పని చేసి వర్క్ పర్మిట్ ముగియడంతో జైలు జీవితం అనుభవిస్తున్నాడు.
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో ఈనెల 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ప్రణాళికలు చేసింది. ఈమేరకు ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం నిర్వహించే ఈ వేడుకలకు అవసరమైన జెండాల్లో సింహభాగం సిరిసిల్ల పట్టణంలో తయారు చేస్తున్నారు. కాగా, వివిధ రాష్ట్రాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చాయి.
గుండెపోటుతో టెన్త్ క్లాస్ విద్యార్థి మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికుల ప్రకారం.. రామగుండానికి చెందిన సాహితి(15) NTPC సెయింట్ క్లేర్ స్కూల్‌లో టెన్త్ క్లాస్ చదువుతోంది. నిన్నరాత్రి హార్ట్ ఎటాక్ రావడంతో చికిత్స కోసం కుటుంబీకులు KNR ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా, NTPC షిఫ్ట్ ఆపరేషన్ డిపార్ట్‌మెంట్‌లో సాహితీ తండ్రి విధులు నిర్వహిస్తున్నారు.
ఎస్సారెస్పీకి ఇన్ ఫ్లో తగ్గింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో వరద తగ్గుముఖం పట్టింది. 3,583 క్యూసెక్కుల ప్రవాహం మాత్రమే వస్తోంది. ప్రాజెక్టు నీటిమట్టం 1091 అడుగులకు ప్రస్తుతం 1080.8 అడుగులుగా ఉంది. 80.5 టీఎంసీలకు ప్రస్తుతం 47.25 టీఎంసీలుగా ఉంది. ఈ మేరకు ప్రాజెక్టు అధికారులు తెలిపారు.
శ్రావణమాసం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. దీంతో భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత, అన్న పూజల సేవలను రద్దు చేశారు. ఈ సందర్భంగా స్వామివారికి మహాన్యాస పూర్వ ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు నిర్వహించారు. కాగా, స్వామివారి దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతు భరోసా పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం అందే అవకాశాలు కనబడటం లేదు. ఈ పథకం ద్వారా పెద్దపల్లి జిల్లాలో లక్షా 46వేల మంది రైతులకు రూ.136 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తోంది. వానాకాలం సీజన్ ప్రారంభమై రెండు నెలలు కావడంతో రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్, ఓదెల మండలాలతో పాటు పలు గ్రామాల ప్రజలు జ్వరాలతో బాధపడుతున్నారు. గత నెల రోజుల నుంచి మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మరోవైపు జ్వరాలు తగ్గినా.. కీళ్ల నొప్పులతో రోగులు సతమతం అవుతున్నారు. కాగా, రోగులతో పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రభుత్వ ఆసుపత్రిలోని పడకలు మొత్తం నిండిపోయాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు గ్రామాల్లో బెల్టు దుకాణాల్లో మద్యం ఏరులై పారుతోంది. లైసెన్స్‌డ్ దుకాణాల నిర్వాహకులు విక్రయాలను పెంచుకునేందుకే బెల్టు దుకాణాలను పోత్సహిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. 60శాతం మద్యం వీటి ద్వారానే అమ్ముడుపోతోందని పలువురు చెబుతున్నారు. ఒక్కో సీసాపై వ్యాపారులు రూ.10, వీటికి బెల్టు షాపుల్లో అదనంగా రూ.20 వసూలు చేస్తుండటంతో మద్యం ప్రియులపై రూ.30 వరకు అదనపు భారం పడుతోంది.
జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.3,39,377 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.1,66,512, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.1,38,000, అన్నదానం రూ.34,865, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Sorry, no posts matched your criteria.