Karimnagar

News July 7, 2024

KRM: బాలుడు మృతి.. బంధువుల ఆందోళన

image

వైద్యుల నిర్లక్ష్యంతో బాలుడు మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు. వివరాల్లోకి వెళితే.. ఇల్లంతకుంట మండలం వంతడుపులకి చెందిన అనిల్-శిరీష దంపతులు ఐదేళ్ల బాలుడు అయాన్ష్ జ్వరంతో బాధపడుతుండగా జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యులు బాలుడికి ఇంజక్షన్ ఇవ్వడంతో మృతి చెందాడని కుటుంబీకులు ఆరోపించారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆస్పత్రి ముందు ఆందోళన చేశారు.

News July 7, 2024

కరీంనగర్: ‘కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలులో విఫలం’

image

రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా ఎన్నికల హామీలు పూర్తిగా అమలు కావడం లేదన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపైనే దృష్టి పెట్టిందని ఆరోపించారు. కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.

News July 7, 2024

నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా ఆషాఢం బోనాలు

image

ఉమ్మడి కరీంగనగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నుంచి బోనాల సందడి ప్రారంభం కానుంది. వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో ఉత్సవాలు హోరెత్తనున్నాయి. నగునూరు దుర్గ భవాని ఆలయం, రామేశ్వర ఆలయం, మహా శక్తి ఆలయంలో ప్రత్యేక పూజలతో బోనాల వేడుకలు నిర్వహించనున్నారు. ప్రతి ఆషాఢ మాసంలో కుర్మ కులస్థులు పోచమ్మకు బోనాలు సమర్పిస్తుంటారు. డివిజన్ల వారీగా బోనాల పండగను జిల్లా ప్రజలు కలిసికట్టుగా చేసుకుంటారు.

News July 7, 2024

KNR: ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం పరీక్ష ఫలితాలు విడుదల

image

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరిగిన ఎల్‌ఎల్‌బీ, ఎల్ఎల్ఎం మొదటి సెమిస్టర్ పరీక్ష ఫలితాలు యూనివర్సిటీ అధికారులు శనివారం విడుదల చేశారు. గత జూన్ నెలలో నిర్వహించిన పరీక్ష ఫలితాలను వెబ్ సైట్ https://satavahana.ac.inలో అందుబాటులో ఉంచామని లేదా సమాచారం కోసం యూనివర్సిటీని సంప్రదించాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.

News July 7, 2024

హామీలు అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం విఫలం: బండి

image

రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. శనివారం బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేశవరావుతో కాంగ్రెస్ రాజీనామా చేయించిందని, మరి బీఆర్ఎస్ నుంచి వచ్చిన MLA, MLCలతో ఎందుకు రాజీనామా చేయించడం లేదని ప్రశ్నించారు. ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ఆ పార్టీలోకి ఎలా చేర్చుకుంటున్నారని ప్రశ్నించారు.

News July 6, 2024

ఏపీ సీఎంని కలిసిన మంత్రి పొన్నం ప్రభాకర్

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మక సమావేశంలో హుస్నాబాద్ ఎమ్మెల్యే, రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ సీఎం చంద్రబాబుని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి అనువైన సమావేశమని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

News July 6, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాలు
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శాంప్రసాద్ ముఖర్జీ జయంతి వేడుకలు
@ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే.
@ కాలేశ్వరంలో భక్తుల రద్దీ.
@ అమ్మ ఆదర్శ పాఠశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సిరిసిల్ల కలెక్టర్.
@ బీర్పూర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జగిత్యాల ఎస్పీ.

News July 6, 2024

మంథని: చంద్రబాబును కలిసిన మంత్రి శ్రీధర్ బాబు

image

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న చారిత్రాత్మిక సమావేశంలో మంథని ఎమ్మెల్యే, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర మంత్రులు పాల్గొన్నారు.

News July 6, 2024

రామగుండంలో ఒకరు సస్పెండ్.. మరొకరు సరెండర్

image

అనుమతి లేకుండా దీర్ఘ కాలంగా విధులకు గైర్హాజరవుతున్న రామగుండం కార్పొరేషన్ బిల్ కలెక్టర్ సతీశ్‌ను సస్పెండ్ చేసినట్లు కలెక్టర్ శ్రీ హర్ష నేడు ఉత్తర్వులు జారీ చేశారు. పారిశుద్ధ్య పర్యవేక్షణలో నిర్లక్ష్యం వహిస్తున్న శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. రామగుండం MLA రాజ్ ఠాకూర్ శానిటేషన్ అధికారుల తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

News July 6, 2024

బండి సంజయ్ కుమార్ రేపటి షెడ్యూల్

image

రేపటి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ షెడ్యూల్ కింది విధంగా ఉంది.
✓రేపు ఉదయం కరీంనగర్‌కు చేరుకుంటారు. ✓8:30 గంటలకు మహాశక్తి ఆలయాన్ని సందర్శిస్తారు.
✓11:30 గంటలకు ప్రభుత్వ అధికారులతో సమావేశం.
✓మధ్యాహ్నం 2 నుంచి కరీంనగర్ పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు.
✓సాయంత్రం 7 గంటలకు ఎంపీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు.