Karimnagar

News January 3, 2025

ధర్మపురి: లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.96,791 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాల టికెట్ల అమ్మకం ద్వారా రూ.51,713, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.36,570, అన్నదానం రూ.8,508 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News January 3, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కథలాపూర్ మండలంలో యువతితో అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరి అరెస్ట్. @ గంభీరావుపేట మండలంలో ఉరివేసుకొని పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య. @ శంకరపట్నం మండలంలో లారీ, పాల వ్యాను డీ.. డ్రైవర్ కు గాయాలు. @ జగిత్యాలలో కొనసాగుతున్న సమగ్ర శిక్షా ఉద్యోగుల నిరసన. @ జగ్గాసాగర్, మేడిపల్లి గ్రామాలలో సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని వినతి. @ కాలేశ్వరంలో భక్తుల సందడి.

News January 2, 2025

ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి పొన్నం

image

చిగురుమామిడి మండల కేంద్రంలోని ప్రైవేట్ గార్డెన్స్‌లో మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

News January 2, 2025

ఎల్లారెడ్డిపేట: యువకుడిపై ఎలుగుబంటి దాడి

image

ఓ యువకుడిపై ఎలుగుబంటి దాడి చేసిన ఘటన దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గుట్టపల్లి చెరువు తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. భూక్య నరేశ్ మేకలు కాయడానికి అడవికి వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడే ఓ చెట్ల పొదల్లో దాగి ఉన్న ఎలుగుబంటి ఒక్కసారిగా నరేశ్‌పై దాడి చేసింది. ఈ ఘటనలో అతడి చేతికి గాయం అయింది. స్థానికులు వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.

News January 2, 2025

కరీంనగర్: వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురి మృతి

image

నూతన సంవత్సరం కొందరి జీవితాల్లో విషాదం నింపింది. వేర్వేరు ప్రమాదాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరుగురు చనిపోయారు. వివరాలిలా.. బావిలో పడి కూలీ చనిపోగా.. బైక్‌ అదుపుతప్పి బ్యాంకు ఉద్యోగి మరణించాడు. కరెంట్ షాక్‌తో మహిళ.. గుండెపోటుతో శ్రీనివాస్ రెడ్డి మృతిచెందారు. రోడ్డు ప్రమాదంలో గాయపడి గట్టుబాబు.. మరో ప్రమాదంలో రమణకుమార్ చనిపోయారు.

News January 2, 2025

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బుధవారం రూ.2,32,985 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,10,864, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.96,610, అన్నదానం రూ.25,511 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలిపారు.

News January 2, 2025

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఓదెల మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి @ ధర్మపురి మండలంలో రోడ్డు ప్రమాదంలో దంపతుల మృతి @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు @ కొండగట్టు అంజన్న ను దర్శించుకున్న ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్ @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న జగిత్యాల డిఎస్పీ @ మెట్పల్లి పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక పూజలు.

News January 1, 2025

సింగరేణి RG-2లో 81% బొగ్గు ఉత్పత్తి: GM

image

రామగుండం సింగరేణి సంస్థ RG-2 81% బొగ్గు ఉత్పత్తి సాధించామని GMవెంకటయ్య అన్నారు. యైటింక్లైన్ కాలనీ GMఆఫీస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ ఆర్థిక సంవత్సరం 3 మాసాలు పూర్తయ్యే నాటికి అధికారుల, ఉద్యోగుల కృషితో 100% టార్గెట్ రీచ్ అవుతామన్నారు. అలాగే సంస్థ ఉద్యోగులకు, పరిసర గ్రామాలలో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. అధికారులు నరసింహారావు, రాముడు, నెహ్రూ, అనిల్ కుమార్ ఉన్నారు.

News January 1, 2025

జగిత్యాల: బాలికలపై అత్యాచారం కేసులో సంచలన తీర్పు

image

అత్యాచారం కేసులో సంచలన తీర్పు వెలువడింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జగిత్యాల జిల్లా గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై గతంలో శివరాత్రి ముత్తయ్య అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. దీనిపై అప్పటి ఎస్‌ఐ నరేశ్ పోక్సో కేసు నమోదు చేయగా తాజాగా నిందితుడిని కోర్టులో హాజరుపర్చారు. విచారణల అనంతరం జిల్లా జడ్జి నీలిమ నిందితుడికి ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున మొత్తం 60 ఏళ్లు జైలు శిక్ష విధించారు.

News January 1, 2025

జగిత్యాల: చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు: ఎస్పీ

image

గొల్లపల్లి PS పరిధికి చెందిన ముగ్గురు బాలికలపై అత్యాచారం చేసిన కేసులో శివరాత్రి ముత్తయ్యకు కోర్టు <<15038521>>60 ఏళ్ల జైలు శిక్ష<<>> విధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. నేరం చేసిన వారు ఎవ్వరూ కూడా చట్టం నుంచి తప్పంచుకోలేరని అన్నారు. ఈ కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పోలీస్ అధికారులను ఎస్పీ అభినందించారు.