India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ముగ్గురు వ్యక్తులు మానసికంగా, ఆర్థికంగా వేధించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. తిమ్మాపూర్ మండలం పోరండ్ల గ్రామానికి చెందిన మామిడి మొగిలి చిన్న కూతురు అఖిల(20) ఇంటి వద్ద ఉంటూ MLT చదువుతోంది. అఖిలను భరత్ అనే యువకుడితో పాటు మరో ఇద్దరు వేధించారని సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఎస్సై చేరాలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మూడు నెలల్లో ముగ్గురు కుటుంబీకులు మృతి చెందారు. మల్యాల మండలం రామన్నపేటకు చెందిన వకుళాభరణం శ్రీనివాస్(62) ఆయన భార్య అరుణ(55) సర్పంచిగా పని చేశారు. వీరి పెద్ద కొడుకు 3 నెలల కిందట ఫ్రేమ విఫలమై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శ్రీనివాస్ మూత్రపిండాలు విఫలమై ఈ నెల 5న మృతి చెందారు. 3 నెలల కిందట కొడుకు, 3 రోజుల కిందట భర్త మృతి చెందడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అరుణ అనారోగ్యంతో గురువారం చనిపోయారు.
కమలాపూర్ మండలం మరిపల్లిగూడెం గ్రామానికి చెందిన కంకటి మౌనిక మూడు ఉద్యోగాలు సాధించారు. టీజీపీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఏఈఈ ఫలితాల్లో ప్రతిభ చూపి పీఆర్‌ఆర్‌డీ విభాగంలో గెజిటెడ్ ఇంజినీరుగా ఉద్యోగం సాధించారు. దీంతో పాటు ఇటీవల గ్రూప్-4, గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్లోనూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. భర్త, పిల్లల సహకారంతోనే తాను ఉద్యోగం సాధించానని పేర్కొన్నారు.
తెలంగాణ ఓపెన్ స్కూల్ 2024-25 విద్యా సంవత్సరానికి ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 8 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు తెలిపారు. అడ్మిషన్ ఫీజును అందుబాటులో ఉన్న ఓపెన్ స్కూల్ కేంద్రాలలో ఆన్‌లైన్లో అడ్మిషన్ ఫీజు చెల్లించి ప్రవేశాలు పొందాలని కోరారు.
* ఎల్లారెడ్డిపేట మండలంలో నలుగురు చిన్నారులపై వీధి కుక్కల దాడి.
* కొడిమ్యాల మండలంలో హత్య కేసులో ఇద్దరి అరెస్ట్.
* సిరిసిల్లలో వైభవంగా రాజశ్యామల కుంకుమార్చన.
* జగిత్యాల జిల్లాలో 124 డెంగ్యూ కేసులు నమోదు.
* వేములవాడలో ఎమ్మార్పీఎస్ భారీ బైక్ ర్యాలీ.
* జగిత్యాలలో జర్నలిస్టులు చేస్తున్న నిరసన దీక్షకు మద్దతు తెలిపిన ఎంపీ అరవింద్.
* జగిత్యాల జిల్లా ఇంటర్ బోర్డు అధికారిగా వెంకటేశ్వర్లు బాధ్యతల స్వీకరణ.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ.1,12,370 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.48,248, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.50,000, అన్నదానం రూ.14,122, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వర మక్తేశ్వర స్వామి దేవాలయంలో శ్రావణ మాసం సందర్భంగా ఆలయంలో లక్ష్యపత్రి పూజలను గురువారం నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. లక్ష పత్రి పూజలు చేయడం ద్వారా గురువారం రూ.85,000 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు.
సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో చిన్నారులపై వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబీకుల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన ప్రీతిష, వరుణతేజ, సహస్ర, వర్షిత్‌లు ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. గాయపడిన చిన్నారులను వెంటనే 108లో సిరిసిల్ల ఆసుపత్రికి తరలించారు.
తడి, పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు ఈకో క్లబ్, మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15లోగా పిల్లలకు 3 జతల సాక్సుల, ఒక షూ జత అందిస్తామని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. కొన్ని మాసాలుగా భూముల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భూములు అమ్ముడుపోక ఆర్థిక అవసరాలకు సదరు భూ పత్రాలతో అధిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. భూ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.20 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు రూ.15 కోట్లు దాటట్లేదని తెలుస్తోంది.
Sorry, no posts matched your criteria.