India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
తడి, పొడి చెత్తను వేరు వేరుగా చెత్తబుట్టల్లో వేసేలా పిల్లలు వారి తల్లి తండ్రులను ఒప్పించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. హుజురాబాద్ పట్టణ కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో ఏర్పాటు చేసిన స్వచ్ఛదనం, పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పిల్లలకు ఈకో క్లబ్, మాస్టర్ ట్రైనర్లతో అవగాహన కల్పించాలని తెలిపారు. ఆగస్టు 15లోగా పిల్లలకు 3 జతల సాక్సుల, ఒక షూ జత అందిస్తామని తెలిపారు.
కరీంనగర్ జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పడుతోంది. కొన్ని మాసాలుగా భూముల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. భూములు అమ్ముడుపోక ఆర్థిక అవసరాలకు సదరు భూ పత్రాలతో అధిక వడ్డీకి ఫైనాన్స్ తీసుకుంటున్నారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 14 రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉండగా.. భూ రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.20 కోట్ల ఆదాయం వచ్చేది. ప్రస్తుతం రోజుకు రూ.15 కోట్లు దాటట్లేదని తెలుస్తోంది.
మత్స్యకారులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేప పిల్లలను వదులుతోంది. ఏటా ఆగస్టులో చేపపిల్లలు విడుదల చేయగా.. ఈసారి టెండర్లు కూడా ఖరారు కాలేదు. ఇప్పటికే అదును దాటుతోందని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. కాగా, జిల్లాలోని ఎగువ, మధ్యమానేరు, అన్నపూర్ణ ప్రాజెక్టులతో పాటు 440 చెరువులు ఉన్నాయి. వాటి పరిధిలో 138 మత్స్య పారిశ్రామిక సంఘాలు ఉండగా.. 8,800 మంది మత్స్యకారులు సభ్యులుగా ఉన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి రాజరాజేశ్వర (మధ్యమానేరు) జలాశయంలో గురువారం నాటికి 17.06 టీఎంసీల నీరు చేరిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయానికి ఎల్లంపల్లి నుంచి నంది, గాయత్రి పంపు హౌజ్, వరద కాలువ ద్వారా 6,500 క్యూసెక్కులు, మానేరు, మూల వాగు నుంచి 200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందని తెలిపారు. జలాశయం నుంచి అన్నపూర్ణ జలాశయానికి 6,462 క్యూసెక్కుల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు .
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో నిర్వహించిన బీఫార్మసీ 7,8వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు శాతవాహన విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.శ్రీ రంగ ప్రసాద్ ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాలు www.satavahana.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పరీక్షల నియంత్రణ అధికారి పేర్కొన్నారు.
దాదాపు నాలుగేళ్లుగా నిరీక్షిస్తున్న LRS దరఖాస్తుదారుల కల త్వరలోనే నెరవేరబోతోంది. తమ స్థలంలో సొంతింటి నిర్మాణం చేపట్టేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలల్లో దరఖాస్తులు పరిశీలించి క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. కాగా ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు 14 మున్సిపాలిటీల్లో 1,13,346 దరఖాస్తులు వచ్చాయి.
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో సమస్యలు తాండవిస్తున్నాయి. ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారి కానుకల ద్వారా ఏటా రూ.20 కోట్లకు పైగానే ఆదాయం సమకూరుతుంది. కానీ.. భక్తులకు మాత్రం స్వామివారి దర్శనం సరిగ్గా కావడం లేదు. శానిటేషన్ అంతంతమాత్రంగానే ఉండటం.. నిఘా నేత్రాల పర్యవేక్షణ లేకపోవడం సమస్యగా మారింది. శ్రీరాముని ఆలయంలో అర్చకులు ఉండటం లేదని భక్తులు చెబుతున్నారు.
ఆర్ఎంపీ వైద్యం వికటించి చికిత్స పోందుతున్న శంకరపట్నం మండలం మెట్‌పల్లికి చెందిన ముంజ లక్ష్మయ్య మరణించినట్లు కేశవపట్నం ఎస్సై రవి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. లక్ష్మయ్యకు విరేచనాలు అవుతుండటంతో ఆర్ఎంపీ మధు దగ్గరకు తీసుకెళ్లగా.. వైద్యం వికటించి ఆరోగ్య పరిస్థితి విషమించింది. కుటుంబ సభ్యులు HNKలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బుధవారం రాత్రి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు.
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మల్కాజిగిరి ఎంపీ, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీని నూలు పోగుల దండతో సత్కరించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ప్రధానితో అభివృద్ధి, పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.
@ కమలాపూర్ మండలంలో బైక్ అదుపు తప్పి వ్యక్తి మృతి.
@ సిరిసిల్లలో బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ చేనేత దినోత్సవం.
@ సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన జిల్లా ప్రత్యేక అధికారి.
@ సైబర్ మోసానికి గురైన కథలాపూర్ మండల వాసి.
@ జగిత్యాలలో జర్నలిస్టుల నిరసన దీక్షకు మద్దతు తెలిపిన కోరుట్ల ఎమ్మెల్యే.
Sorry, no posts matched your criteria.