India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జగిత్యాల పట్టణానికి చెందిన ఓ ఇంట్లో ఉద్యోగాల పంట పండింది. గ్రూప్-4 ఫలితాల్లో పట్టణానికి చెందిన గుర్రం జయంతి వార్డ్ ఆఫీసర్ ఉద్యోగం సాధించింది. అయితే జయంతి అన్న స్కూల్ అసిస్టెంట్, ఒక సోదరి ఎల్ఐసీ ఏఏవో, మరో సోదరి గురుకుల లైబ్రేరియన్ ఉద్యోగాలు చేస్తున్నారు. కాగా నాన్న రిటైర్డ్ ఉపాధ్యాయులని జయంతి పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యులు తనను ఎంతగానో ప్రోత్సహించారని, వారికి రుణపడి ఉంటానని జయంతి పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని ప్రయాణికులకు శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ ఆర్ఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు RM సుచరిత తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రయాణికులు తెలిపిన సమయంలో తమ సమస్యలను లేదా ఫీడ్ బ్యాక్‌ను 9063403511 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయానికి ఈనెల 20న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆలయ మాస్టర్ ప్లాన్ పై అధికారులతో చర్చిస్తారు. అనంతరం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ లో గల్ఫ్ బాధిత కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మోహంతి సూచించారు. గురువారం కరీంనగర్ పోలీస్ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో యాక్సిడెంట్ జోన్‌లు, బ్లాక్ స్పాట్‌లను గుర్తించాలన్నారు. ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాల్లో ట్రాఫిక్ సిబ్బందిని కేటాయించాలన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ కేసులు, పోక్సో కేసులపై పోలీసు అధికారులతో సమీక్షించారు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బాలల దినోత్సవం. @ గన్నేరువరం మండలంలో ట్రాక్టర్ రోటవేటర్ లో ఇరుక్కుని వ్యక్తి మృతి. @ మానకొండూరు మండలంలో తాటి చెట్టు పైనుండి పడి గీత కార్మికుడి మృతి. @ భీమారం మండలంలో నృత్యం చేస్తుండగా కుప్పకూలి మృతి చెందిన యువకుడు. @ ముగ్గురు సైబర్ క్రిమినల్స్ ను అరెస్ట్ చేసిన మెట్పల్లి పోలీసులు. @ జగిత్యాలలో దిశా సమావేశంలో పాల్గొన్న ఎంపీ అరవింద్.
గ్రూప్-3 పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు, ఇతర మెటీరియల్‌ను కట్టుదిట్టమైన బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్‌లలో భద్రపరిచినట్లు అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. కరీంనగర్లోని స్ట్రాంగ్ రూములను పరిశీలించారు. ఎక్కువ సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా సిబ్బందిని నియమిస్తామన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేలా విస్తృత ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
పిల్లలు దైవానికి ప్రతిరూపమని, వారిని సన్మార్గంలో నడిపిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జాతీయ బాలల దినోత్సవం పురస్కరించుకొని.. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఆడిటోరియంలో బాలల దినోత్సవం వేడుకలను గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. 80 శాతం పిల్లల భవిత ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని అన్నారు.
కరీంనగర్ నియోజకవర్గంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చల్ల హరి శంకర్, కరీంనగర్ ఫ్యాక్ట్ ఛైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, చెర్లబూత్కూర్ మాజీ ఎంపీటీసీ బుర్ర తిరుపతి గౌడ్ తదితరులున్నారు.
వేములవాడ దేవాలయం మాస్టర్ ప్లాన్, అభివృద్ధి కార్యకలాపాలపై దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతోంది. మంత్రి పొన్నం ప్రభాకర్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్, పలువురు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేస్తూనే యువకుడు కుప్పకూలిన ఘటన జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం మోత్కూరావుపేట గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చేటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. మండలంలోని కమ్మరిపేటకు చెందిన సంజీవ్(23) తన మేనమామ కొడుకు పెళ్లి బరాత్‌లో డాన్స్ చేస్తున్న క్రమంలో గుండెపోటుకు గురై కుప్పకూలాడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. యువకుడి మృతితో పెళ్లింట విషాదం నెలకొంది.
Sorry, no posts matched your criteria.