Karimnagar

News December 27, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ధర్మపురిలో భర్తపై జీడి రసంతో దాడి చేసిన భార్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో విద్యుత్ షాక్ తో మహిళ మృతి. @ మెట్పల్లి పట్టణంలో వైభవంగా అయ్యప్ప మహా పడిపూజ. @ సిరిసిల్ల జిల్లాలో లారీ, కారు ఢీ.. ఒకరి మృతి. @ గొల్లపల్లి మండలంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య. @ కరీంనగర్‌లో సైబర్ మోసం.

News December 26, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని క్రైమ్ న్యూస్

image

☞సిరిసిల్ల: లారీని ఢీకొన్న కారు.. ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు ☞ఎల్లారెడ్డిపేట: గుండారంలో విద్యుత్ ఘాతంతో మహిళ మృతి ☞ఎండపల్లి: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ☞చొప్పదండి: తాగి పోలీస్ సిబ్బందిపై దాడి.. కేసు నమోదు ☞ గొల్లపల్లి: ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య ☞ గంభీరావుపేట: పేకాట రాయుళ్ల అరెస్టు ☞మంథని: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు.

News December 26, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి నేటి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలో సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి గురువారం రూ. 2,65,369 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్ల అమ్మకం ద్వారా రూ.1,60, 265, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ. 74,515 , అన్నదానం రూ.30,589 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.

News December 26, 2024

దేనికి బేష్? దేనికి శభాష్?: బండి సంజయ్

image

తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై కరీంనగర్ ఎంపీ, కేంద్రమంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఏం సాధించిందని రాహుల్ గాంధీ ‘ప్రజాపాలన బేష్’ అంటూ వ్యాఖ్యానించారో చెప్పాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి, సంక్షేమం ఊసే లేదన్నారు. గ్యారెంటీలను అమలు చేయని ప్రభుత్వానికి ‘దేనికి బేష్? దేనికి శభాష్?’ అని ప్రశ్నించారు.

News December 26, 2024

ఎర్రోళ్ల అక్రమ అరెస్టు దుర్మార్గమైన చర్య: కేటీఆర్

image

బీఆర్‌ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌ను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య అని సిరిసిల్ల MLA, మాజీ మంత్రి KTR అన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరఫున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్షగట్టి అక్రమ కేసులతో వేధించాలని చూస్తున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.

News December 26, 2024

KNR: ఆన్‌లైన్ మోసాలకు బలవుతున్న అమాయకులు!

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆన్‌లైన్ మోసాలకు అమాయకులు బలవుతున్నారు. బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్, గేమింగ్ లాంటి మోసపూరితమైన ప్రకటన చూసి అందులో అధిక డబ్బులు సంపాదించవచ్చనే ఆశతో మొబైల్‌లో వచ్చిన లింకులను ఓపెన్ చేసి అందులో డబ్బులు పెడుతున్నారు. చివరకు మోసపోయామని తెలిసి మిగతా జీవులుగా మారుతున్నారు. మొబైల్లో వచ్చే లింకులు, యాప్ లపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News December 26, 2024

హుస్నాబాద్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో క్రిస్మస్ వేడుకలు

image

హుస్నాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేక్ కట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. క్రైస్తవుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్ సిరిసిల్ల రాజయ్య, నాయకులు లింగమూర్తి, సత్యనారాయణ గౌడ్ తదితరులున్నారు.

News December 26, 2024

రాహుల్‌ గాంధీకి ధన్యవాదాలు: మంత్రి పొన్నం

image

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పొన్నం ప్రభాకర్‌కు లేఖ రాశారు. ఈ సందర్భంగా లేఖలో రవాణా, బీసీ సంక్షేమ శాఖలో చేపడుతున్న చర్యలు అభినందనీయం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం (ఎక్స్) ద్వారా స్పందించారు. తెలంగాణ ప్రగతిని గుర్తించినందుకు రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలిపారు. మీ మార్గదర్శకత్వం మాకు స్ఫూర్తినిస్తుంది అని ట్వీట్ చేశారు.

News December 25, 2024

KNR: BJP కొత్త సారథులు ఎవరు?

image

ఉమ్మడి KNRజిల్లాలో BJPని బలోపేతం చేసేందుకు అధిష్ఠానం దృష్టిసారించింది. JANలో తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు కొత్త సారథులను నియమించనున్నారు. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపుతూ BJPని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. మరి KNR, JGTL, SRCL, PDPL జిల్లాలకు నూతన అధ్యక్షులు ఎవరు అవుతారో వేచి చూడాలి. దీనిపై మీ కామెంట్?

News December 25, 2024

హుజురాబాద్: ప్రేమ పేరుతో వేధింపులు.. యువతి బలవర్మరణం

image

ప్రేమ పేరిట యువకుడి వేధింపులకు తట్టుకోలేక యువతి బలవర్మరణానికి పాల్పడిన ఘటన KNR జిల్లా HZB మం.లో జరిగింది. CI తిరుమల్ గౌడ్ వివరాలు.. ఇప్పల నర్సింగాపూర్‌కు చెందిన వరుణ్‌ప్రియ(18) అమ్మమ్మ ఊరైన పెద్ద పాపయ్యపల్లికి వచ్చి.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుంది. కాగా, కూతురి మృతికి అదే గ్రామానికి చెందిన అజయ్(19) వేధింపులే కారణమని మృతురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదయింది.