Karimnagar

News August 5, 2024

మల్లాపూర్: ప్రారంభమైన కనక సోమేశ్వర స్వామి శ్రావణమాస ఉత్సవాలు

image

మల్లాపూర్ మండల కేంద్రంలోని కనక సోమశ్వర స్వామి కొండ పై నేటి నుంచి శ్రావణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కొండ పైన కనక సోమేశ్వరస్వామిని మండల ప్రజలతో పాటు నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లా వాసులు వచ్చి దర్శించుకున్నారు. శ్రావణమాసంలో ప్రతి సోమవారం ఐదు వారాలు కనక సోమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటారు. భక్తులకు కొండ కింద అన్నదాన కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు.

News August 5, 2024

జగిత్యాల: కనుమరుగైన 2వేల ఏళ్లనాటి రాజన్న ఆలయం

image

సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం గురించి అందరికీ తెలిసిందే . కానీ, జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం చెగ్యాంలో ఉన్న మరో ఆలయం గురించి ఎంతమందికి తెలుసు. గ్రామంలో ఉన్న మగ్గాలగడ్డ సమీపంలోని రాజేశ్వరస్వామి ఆలయం ఇది. ఈ ఆలయం సుప్రసిద్ధ చరిత్రను కలిగి ఉంది. ఇది దాదాపు 2000 ఏళ్ల క్రితం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. ఆలయ శిఖరం చాణిక్య/కాకతీయ నిర్మాణం శైలిలో ఉంటుంది. SHARE

News August 5, 2024

KNR: నేటి నుంచి శుభకార్యాలు షురూ

image

మూడంతో 3 నెలలు నిలిచిన శుభకార్యాలు నేటి నుంచి మళ్లీ షురూ కానున్నాయి. నేటి నుంచి శ్రావణమాసం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఉమ్మడి వరంగల్‌లో వివాహాది కార్యక్రమాలు జోరందుకోనున్నాయి. ఈ నెల రోజుల పాటు ఎటుచూసినా సందడి వాతావరణమే నెలకొననుంది. ఇప్పటికే పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వారు నిశ్చయ తాంబూలాలు మార్చుకొని వివాహానికి సిద్ధమవుతున్నారు. వివాహాలు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో కల్యాణ మండపాలు ముస్తాబుకానున్నాయి.

News August 5, 2024

KNR: లక్ష్యం చేరని పంట రుణాలు

image

నాలుగేళ్లుగా పంట రుణాలు 72శాతానికి మించటం లేదు. ఉమ్మడి జిల్లాలో వానాకాలంలో 12.40 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేస్తారని అంచనా. ఈ మేరకు 2024-25 వార్షికానికి కరీంనగర్ జిల్లాకు రూ.2,357.80, జగిత్యాల రూ.2,292.60, పెద్దపల్లి రూ.1,864.83, సిరిసిల్ల రూ.1,519.03 కోట్ల రుణాలివ్వాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు KNR 1750.12, JGTL 1520.30, PDPL 1250.40, SRCL 982.01 కోట్ల రుణాలు మంజూరు చేశారు.

News August 5, 2024

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం రూ.1,46,430 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.80,532, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.42,830, అన్నదానం రూ.23,068, వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News August 4, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ వేములవాడ ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. @ ధర్మపురి ఉపాధ్యాయురాలికి రాష్ట్రపతి అవార్డు. @ బలగం వేణుకు సీఎం రేవంత్ రెడ్డి, మాజీమంత్రి కేటీఆర్ అభినందన. @ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఫ్రెండ్షిప్ డే వేడుకలు. @ రామడుగు మండలంలో పర్యటించిన దర్శకుడు బోయపాటి శ్రీను. @ జగిత్యాలలో కొనసాగుతున్న జర్నలిస్టుల నిరవధిక నిరసన.

News August 4, 2024

రాజన్న ఆలయంలో రేపటి నుంచి బ్రేక్ దర్శనాలు

image

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మొట్టమొదటిసారి బ్రేక్ దర్శనాలను ఈనెల 5 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఈవో వినోద్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు రెండు సార్లు ఉ.10:15 నుంచి 11:15 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు బ్రేక్ దర్శనాలు కొనసాగుతాయని, ఒక్కొ టికెట్‌పై రూ.300 ఛార్జీ, ఒక లడ్డు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

News August 4, 2024

గోపాల్‌రావుపేటలో దర్శకుడు బోయపాటి శ్రీను

image

రామడుగు మండలం గోపాల్‌రావుపేటలోని శివాలయంలో ఆదివారం ప్రముఖ సినీ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోపాలరావుపేట గ్రామానికి విచ్చేసిన బోయపాటి శ్రీనును జాతీయ యువజన అవార్డ్ గ్రహీత అలువాల విష్ణు సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

News August 4, 2024

ఫిలింఫేర్ అవార్డ్స్‌లో మెరిసిన ‘కరీంనగర్’

image

సినీ పరిశ్రమలో ప్రతిభ కనబర్చిన దర్శకులు, నటీనటులకు 2024 ఫిలింఫేర్ అవార్డ్స్ ప్రదానం చేసిన విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన దర్శకులు వేణు ఎల్దండి, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన బలగం, దసరా సినిమాలకు ఈ అవార్డులు రావడం విశేషం. ఉత్తమ దర్శకులుగా వారు ఈ అవార్డులు అందుకోగా.. ఉత్తమ నటీనటులుగా నాని, కీర్తి సురేశ్‌లకు ఈ అవార్డులు దక్కాయి.

News August 4, 2024

మూడేళ్లలో బెంగళూరును అధిగమిస్తాం: మంత్రి

image

సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల ఎగుమతిలో రూ.7లక్షల కోట్లతో బెంగళూరు మొదటి స్థానంలో ఉండగా, హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో తాము బెంగళూరును అధిగమించి ముందుకెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు వెల్లడించారు. కాగా, రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు నేటి నుంచి ఈనెల 13 వరకు మంత్రి అమెరికా, సౌత్ కొరియాలో పర్యటిస్తున్నారు.