Karimnagar

News June 30, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఇండియా వరల్డ్ కప్ గెలవడం పట్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబరాలు. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ ఎల్లారెడ్డిపేట మండలంలో ఆటో బోల్తా పడి మహిళ మృతి. @ సిరిసిల్ల పట్టణంలో బావిలో పడిన పిల్లిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది. @ వెల్గటూర్ మండలంలో భారీ వర్షం. @ మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్న వేములవాడ డీఎస్పీ. @ రేపటినుండి నూతన చట్టాలు: జగిత్యాల ఎస్పీ.

News June 30, 2024

పార్టీ మార్పుపై జగిత్యాల ఎమ్మెల్యే కీలకవ్యాఖ్యలు

image

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ మార్పుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశంతో కాంగ్రెస్ పార్టీలో చేరానని క్లారిటీ ఇచ్చారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం కార్యకర్తలు తనతోపాటు నడవాలని కోరారు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌లో చేరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

News June 30, 2024

వేములవాడ: మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులే: డీఎస్పీ

image

మైనర్లు వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులేనని వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి ఆదివారం తెలిపారు.
నెంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ చేసిన, సగం నెంబర్ ప్లేట్ కలిగి ఉన్న వాహనదారులపై క్రిమినల్ కేసులే తప్పవని హెచ్చరించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే ఇతరుల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఎస్పీ అఖిల్ మహాజన్ స్పెషల్ డ్రైవ్‌లో 1223 కేసులు చేసినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

News June 30, 2024

రాజన్న గోశాలలో 5 కోడెల మృత్యువాత

image

వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలలో 5 కోడెలు శనివారం మృతి చెందాయి. మహాలక్ష్మి ప్రాంతంలోని మూలవాగులో గోశాల సిబ్బంది కోడెలను ట్రాక్టర్‌లో తరలించి పూడ్చి వేశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్న కోడెలు మృతి చెందినట్లు తెలుస్తోంది.

News June 30, 2024

KNR: ఇన్‌స్టాగ్రాం పరిచయం.. బాలికపై అత్యాచారం

image

ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకొని బాలికను ఓ యువకుడు అత్యాచారం చేశాడు. కమలాపూర్ మండలంలో తాతయ్య ఇంటి వద్ద ఉంటున్న ఓ బాలిక (15)తో కామారెడ్డికి చెందిన శంకర్ (23) ఇన్‌స్టాగ్రాంలో పరిచయం చేసుకున్నాడు. ప్రేమిస్తున్నానని చెప్పడంతో నమ్మిన ఆ బాలిక ఈనెల 23న ఇంట్లో నుంచి వెళ్లింది. అయితే శంకర్ తనను నమ్మించి అత్యాచారం చేశాడని బాలిక తన మేనమామకు చెప్పడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు.

News June 30, 2024

రామగిరి: కానిస్టేబుల్ సస్పెన్షన్

image

పోలీసు ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా వ్యవహరించిన రామగిరి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహించే సదానందంను సస్పెండ్ చేస్తూ రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఉత్తర్వులు జారీ చేశారు. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించడంతో ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. కమిషనరేట్ పరిధిలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడినా, విధులలో నిర్లక్ష్యం వహించినా ఉపేక్షించేది లేదని సీపీ హెచ్చరించారు.

News June 30, 2024

సిరిసిల్ల: వలకు చిక్కిన 20 కిలోల చేప

image

సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కొలనూరు చెరువులో శనివారం మత్స్యకారులు చేపలు పట్టారు. ఈ క్రమంలో మత్స్యకారుల వలకు 20 కిలోల భారీ చేప చిక్కింది. దీంతో మత్స్యకారులు చేపను చెరువు గట్టు పైకి తీసుకువచ్చారు. తమ గ్రామ చెరువులో భారీ చేప చిక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

News June 30, 2024

కొండగట్టు: పవన్‌కు అంజన్న ప్రతిమను బహుకరించిన అభిమాని

image

కొండగట్టు అంజన్న దర్శనానికి వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌కు స్థానిక అభిమాని స్వామివారి ఇత్తడి విగ్రహం బహుకరించారు. స్థానిక కొబ్బరికాయల వ్యాపారి అయిన సుదగోని చిరంజీవి పవన్‌కళ్యాణ్‌కు అభిమాని. ఈ సందర్భంగా రూ.11 వేలు వెచ్చించి 9 కేజీల ఇత్తడితో అంజన్న ప్రతిమను తయారుచేయించి పవన్‌కు అందజేశారు. గతంలో కూడా కొండగట్టు వచ్చిన సందర్భంలో పీకేకి వివిధ వస్తువులు అందజేసినట్లు చేసినట్లు తెలిపారు.

News June 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ కొండగట్టులో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. @ పవన్ కళ్యాణ్ పర్యటనలో దొంగల చేతివాటం. @ జగిత్యాల జిల్లాలో చోరీకి పాల్పడుతున్న ముగ్గురి అరెస్ట్. @ మల్యాల మండలంలో ఉరివేసుకొని వృద్ధుడి ఆత్మహత్య. @ వేములవాడ మున్సిపాలిటీలో 101 రూపాయలకే అంతిమ సంస్కారాలు. @ హత్య కేసులో మెట్పల్లి మండల వాసికి జీవిత ఖైదు. @ కలెక్టరేట్ నైట్ వాచ్ మెన్ ను సన్మానించిన సిరిసిల్ల కలెక్టర్.

News June 29, 2024

వేములవాడ మున్సిపాలిటీలో రూ.101కు దహన సంస్కారాలు

image

వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో శనివారం జరిగిన పాలకవర్గ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పట్టణంలో మరణించిన వారి దహన సంస్కారాలను మూలవాగు ప్రాంతంలోని వైకుంఠధామంలో 101 రూపాయలకే నిర్వహించాలని మున్సిపల్ ఛైర్‌పర్సన్ రామతీర్థపు మాధవి అధ్యక్షతన పాలకవర్గం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. వైకుంఠ రథం, కట్టెలు, డీజిల్, నీటిసరఫరాను రూ.101కే అందించనున్నట్లు తెలిపారు.