India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
HYD కాప్రా మండలం జవహర్‌నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్‌లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్‌లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.
సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. స్థానికుల వివరాల ప్రకారం.. చందుర్తి మండలం మర్రిగడ్డకు చెందిన అంజలి(53) ఐదు రోజుల క్రితం అనారోగ్యం బారిన పడగా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి డెంగ్యూతో పాటు ఊపిరితిత్తుల్లో నీరు చేరిందని నిర్ధారించారు. దీంతో కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో HYD తరలిస్తుండగా మార్గమధ్యలో గురువారం రాత్రి మృతిచెందింది.
ఎగువ కురుస్తున్న వర్షాలకు శ్రీరామ్ ప్రాజెక్టులో భారీగా నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు ఉండగా.. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 29,960 క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 2,695 క్యూసెక్కులు ఉంది. ప్రస్తుతం ఉదయం 6 గంటల వరకు ప్రాజెక్టులో 38.993 టీఎంసీల నీరు నిల్వ ఉంది. వివిధ అవసరాల కోసం ప్రాజెక్ట్ నుంచి మొత్తం 684 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ASI లక్ష్మినాయణను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. SI, తోటి సిబ్బందితో లక్ష్మినాయణ దురుసుగా ప్రవర్తించడంతో క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయన్నారు.
సిరిసిల్ల జిల్లా బోయినపల్లి, మండలం మన్వాడ వద్ద గల మధ్యమానేరులో నీటి నిల్వ 10.55 టీఎంసీలకు చేరిందని ప్రాజెక్ట్ అధికారులు వెల్లడించారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి ఎల్లంపల్లి జలాలు 14,814 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుందన్నారు. జలాశయం పూర్తి సామర్థ్యం 318 మీటర్లు కాగా.. ప్రస్తుతం 309.45 మీటర్లు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 27.50 టీఎంసీలకుగాను 10:15 టీఎంసీలమేరకు నీరు ఉందని అధికారులు తెలిపారు.
ఇన్నాళ్లు నీరు లేక వేలవేల బోయిన చెరువుల్లో జలకళ సంతరించుకుంటుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులు నిండుకుంటున్నాయి. కరీంనగర్ మండలంలో దాదాపు పెద్ద చెరువులు 33 ఉండగా.. చిన్న చెరువులు, కుంటలు 40 వరకు ఉంటాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు చెరువులోకి నీరు చేరి జలకళ సంతరించుకుంటుంది. ఇన్నాళ్లు వెలవెలబోయిన చెరువులు నీరు చేరడంతో ఆయా గ్రామాల ప్రజలు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ ఈవోగా రామకృష్ణారావును నియమిస్తూ దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ ఈవోగా అదనపు బాధ్యత నిర్వహిస్తున్న చంద్రశేఖర్‌ను మెదక్ అసిస్టెంట్ కమిషనర్‌గా బదలీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధిపై తనవంతు కృషి చేస్తానని, సదుపాయాలు మెరుగు పరుస్తానని రామకృష్ణారావు తెలిపారు.
@ చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా కలెక్టర్లు.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మలు దగ్ధం చేసిన BRS నాయకులు.
@ వేములవాడ మండలంలో అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలన్న జగిత్యాల కలెక్టర్.
@ జగిత్యాల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.
@ దుబాయ్‌లో సిరిసిల్ల జిల్లా వాసి అనారోగ్యంతో మృతి.
ఆగస్టు 5 నుంచి 9 వరకు నిర్వహించే స్వచ్చధనం-పచ్చదనం కార్యక్రమంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కరీంనగర్ కలెక్టర్ పమేల సత్పతి, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
Sorry, no posts matched your criteria.