India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
జిల్లాలో పెండింగ్ ఉన్న ధరణి దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. పెండింగ్ ధరణి దరఖాస్తులపై జిల్లాలోని తహసీల్దార్లతో బుధవారం రివ్యూ నిర్వహించారు. ప్రతి మండలంలో పెండింగ్ ఉన్న సమస్యలు వాటికి గల కారణాలు, పరిష్కరించేందుకు సిద్ధం చేసుకున్న ప్రణాళిక వివరాలను కలెక్టర్ తెలుసుకొని అధికారులకు పలు సూచనలు చేశారు.
మైనర్‌పై అత్యాచారం చేసిన నిందితునికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ వివరాల ప్రకారం.. పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వెంగలాయిపేట గ్రామానికి చెందిన కొలిపాక అంజయ్య అదే గ్రామానికి చెందిన ఓ బాలికను అత్యాచారం చేశాడు. కేసు నిరూపణ కావడంతో 25 ఏళ్ల జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షలు ఇవ్వాలని న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చారు.
వర్షాభావ పరిస్థితులతో ఆందోళన చెందిన రైతన్నలు ఇప్పుడిప్పుడే వానాకాలం సాగుపై ఆశలు పెంచుకున్నారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరగా నాట్లు వేయడం ముమ్మరం చేశారు. ఈ వానాకాలం జిల్లాలో 2.75 లక్షల ఎకరాలలో వరిసాగు జరుగుతుందని అంచనా వేసిన జిల్లా వ్యవసాయశాఖ అందుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు మందులను అందుబాటులో ఉంచేలా కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తోంది.
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో ఆగస్టు 9 నుంచి పీజీ (ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంఏ) 2వ సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. విద్యార్థులు పరీక్షల టైం టేబుల్ కోసం విశ్వవిద్యాలయం వెబ్ సైట్ www.satavahana.ac.inను సందర్శించాలని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. కాగా ఇప్పటి వరకు 6.35 కోట్ల మంది మహిళలు ప్రయాణించగా.. రూ.230.72 కోట్ల ఆదాయం వచ్చినట్లు కరీంనగర్ ఆర్ఎం సుచరిత తెలిపారు. ఆక్యుపెన్సీ రేషియో సైతం 85.33కు పెరిగినట్లు చెప్పారు. ప్రయాణికుల సంఖ్య పెరగడంతో రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతున్నట్లు పేర్కొన్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులు జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. కొద్దిరోజుల పాటు కురిసిన వర్షాలకు ఖాళీ స్థలాల్లో నీరు నిలిచి దోమలు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో సాధారణ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు సైతం ప్రబలుతున్నాయి. జనవరి నుంచి జులై వరకు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఉమ్మడి జిల్లాలో 190 డెంగీ కేసులు నమోదయ్యాయి. ఇందులో ఎక్కువ కేసులు కరీంనగర్, జగిత్యాలలోనే ఉన్నాయి.
కరీంనగర్‌లోని ఎల్ఎండీ డ్యాం వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేస్తుండగా పోలీసులు రక్షించారు. పోలీసులు తెలిపిన వివరాలు.. అశోక్ నగర్‌కు చెందిన మాడూరి రవీందర్ సోమవారం అర్ధరాత్రి ఎల్ఎండీ డ్యాం వద్ద ఆత్మహత్యాయత్నం చేస్తున్న క్రమంలో గస్తీలో ఉన్న లేక్ అవుట్ పోస్టు పోలీసులు గమనించారు. వెంటనే అక్కడి చేరుకుని అతడిని కాపాడారు. పోలీసులు రవీందర్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పజెప్పారు.
@ ముత్తారం మండలంలో తండ్రి మందలించాడని కొడుకు ఆత్మహత్య.
@ కాల్వ శ్రీరాంపూర్ మండలంలో జ్వరంతో బాలుడి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్.
@ ఆశ వర్కర్ల వేతనాలు పెంచాలన్న కోరుట్ల ఎమ్మెల్యే.
@ పెద్దపల్లి కలెక్టరేట్ ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా.
@ బోయిన్పల్లి మండలంలో బైక్ ఢీకొని అంగన్వాడి ఆయాకు గాయాలు.
@ జగిత్యాల కలెక్టరేట్లో రెండో విడత రైతు రుణమాఫీ వేడుక
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మంగళవారం రూ.71,003 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.43,412, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.18,650, అన్నదానం రూ.8,941,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేశారు.
రాహుల్ గాంధీ వరంగల్ డిక్లరేషన్ సభలో రైతులకు ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో రూ.1 లక్ష 50 వేల వరకు 9211 మంది రైతులు రుణమాఫీ పొందారని పేర్కొన్నారు. రుణమాఫీ కింద హుస్నాబాద్ నియోజకవర్గానికి 93 కోట్ల 89 లక్షల ఆర్థిక సాయం అందిందని తెలిపారు.
Sorry, no posts matched your criteria.