India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కథలాపూర్ మండలం సిరికొండ గ్రామ శివారులో వ్యవసాయ బావిలో తిరుమలేష్ (18) అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. తిరుమలేష్ గత మూడు రోజుల క్రితం గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడగా మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మ హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఎగువ కురుస్తున్న వర్షాలతో ఎస్సారెస్పీకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి భారీగా నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం ఉదయానికి ప్రాజెక్టులోకి 23,555 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో సాగుతోంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 81.5 TMCలు కాగా.. ప్రస్తుతం 31.917 TMCలకు చేరింది. గతేడాది ఈ సమయానికి ప్రాజెక్టులో 72.830TMC నీరు నిల్వ ఉంది.
భీమదేవరపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టాలిన్ బేగ్ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన తాను పాఠాలు చెబుతున్న పాఠశాలలోని తన ఇద్దరు పిల్లల్ని కూడా చదివిస్తున్నారు. ఇటీవలే కుమార్తె టెన్త్ పూర్తిచేయగా.. కుమారుడు తల్వార్ బేగ్ 9వ తరగతి చదువుతున్నాడు.1 నుంచి 10వ తరగతి వరకు తన పిల్లలను ప్రభుత్వ పాఠశాలను చదివిస్తూ ఇతరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
చిగురుమామిడి మండలం రేగొండలో శుక్రవారం గొర్రెల కాపరి బొందయ్య బావిలో పడి మృతిచెందిన విషయం తెలిసిందే. శవపరీక్షకు హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రిలో వైద్యసిబ్బంది రూ.6వేలు డిమాండ్ చేశారని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యడు ఆరోపించారు. బాధిత కుటుంబీకులు రూ.4 వేలు ఇచ్చినా.. ఒప్పుకోకపోలేదని ఆయన తెలిపారు. ఆయన ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేశ్‌రెడ్డితో ఫోన్లో మాట్లాడగా డబ్బులు తిరిగి ఇప్పించారన్నారు.
రామగుండం సింగరేణి సంస్థ 2వ భూగర్భ గనిలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. రెండవ షిఫ్ట్ విధులు నిర్వహించేందుకు వెళ్లిన నోయల్, శంకర్, సంపత్‌లకు పైకప్పు కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే క్షతగాత్రులను చికిత్స కోసం గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాలను పరిశీలించిన జగిత్యాల కలెక్టర్.
@ సిరిసిల్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో వివాహిత ఆత్మహత్య.
@ నంది మేడారం పంప్ హౌస్ నుంచి నీరు విడుదల.
@ ఆయిల్ ఫామ్ సాగు విస్తీర్ణం పెంచాలన్న పెద్దపల్లి కలెక్టర్.
@ పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ సస్పెండ్.
@ సౌదీలో బీర్పూర్ మండల వాసి అదృశ్యం.
విద్యార్థుల పట్ల బాధ్యతారహితంగా వ్యవహరించిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కె.విద్యాసాగర్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్న జరిగిన ఘటనపై విచారణ చేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యతారహితంగా వ్యవహరించినందుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
సుప్రసిద్ధ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,15,625 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.64,428, ప్రసాదం అమ్మకం ద్వారా రూ.25,895, అన్నదానం రూ.25,302 వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలియజేశారు.
పెద్దపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు PDPL మున్సిపాలిటీలోని బంధంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లాపరిషత్ మైనార్టీ పాఠశాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలల ఆవరణాలు మొత్తం జలమయం కావడం, బడుల లోపల గోడలకు తేమ వస్తుండటంతో విద్యార్థులకు ఇక్కట్లు తప్పడంలేదు. బంధంపల్లి పాఠశాల ఆవరణలో వర్షం నీరు చేరడంతో ముత్రశాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈరోజు CM రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ.. కరీంనగర్ జిల్లా ప్రస్తావన తీసుకొచ్చారు. 2009లో కరీంనగర్ జిల్లా ప్రజలు KCRను ఓడగొడతారని భయపడి పాలమూరుకు వలసొచ్చారని, వలసలు పోయే పాలమూరు ప్రజలు KCRను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారన్నారు. పదేళ్లు పాలించిన KCR రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణగా మార్చారని మండిపడ్డారు.
Sorry, no posts matched your criteria.