Karimnagar

News June 21, 2024

సిరిసిల్ల: ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలి: కలెక్టర్

image

రహదారులు, భవనాలశాఖ ఆధ్వర్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం రహదారులు భవనశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి పెండింగ్‌లో ఉన్న పనుల పురోగతిపై చర్చించారు. వర్షాకాలం నేపథ్యంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా క్షేత్రస్థాయిలో ఎక్కడైనా మరమ్మతుల అవసరముంటే వెంటనే చేపట్టాలన్నారు.

News June 21, 2024

కరీంనగర్: డిగ్రీ పరీక్షల్లో ముగ్గురు విద్యార్థుల డిబార్

image

శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ రెండో, నాలుగో సెమిస్టర్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. కాగా రెండో రోజు గురువారం జరిగిన పరీక్షల్లో ముగ్గురు విద్యార్థులు డిబార్ అయినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎన్వీ శ్రీరంగ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు సక్రమంగా పరీక్షలకు హాజరుకావాలని సూచించారు.

News June 21, 2024

GDK: 26 నుంచి ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలు

image

ఈనెల 26 నుంచి బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ దూరవిద్య డిగ్రీ పరీక్షలు నిర్వహించనున్నట్లు గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్ తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ తృతీయ సంవత్సరం విద్యార్థులకు సెమిస్టర్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జులై 3 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.

News June 21, 2024

జగిత్యాల: న్యూట్రీషన్‌ కిట్ల పంపిణీ బందు!

image

గర్భిణుల్లో రక్తహీనత, పోషకాహార లోపం ఉండొద్దన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన న్యూట్రీషన్‌ కిట్ల పంపిణీ ప్రస్తుతం జరగడం లేదు. జగిత్యాల జిల్లాలో నాలుగు నెలలుగా గర్భిణులకు ఇవ్వాల్సిన కిట్లు అందడం లేదు. గత ఫిబ్రవరి వరకు సజావుగా సాగగా ప్రస్తుతం వాటి ఊసే లేకుండా పోయింది. గతంలో ఇచ్చిన కేసీఆర్‌ కిట్లను ఎంసీహెచ్‌ కిట్లుగా పేరు మార్చిన ప్రభుత్వం వాటిని కూడా అందించకపోవడంతో నిరాశతో ఉన్నారు.

News June 21, 2024

మెట్‌పల్లి: బాలికను వేధించిన యువకుడు అరెస్టు

image

మెట్‌పల్లి పట్టణానికి చెందిన బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బత్తిని నవదీప్ అనే యువకుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. బాలికను నవదీప్ కొన్ని రోజులుగా వేధిస్తుండడంతో ఈనెల 12న బాలిక తల్లి ఫిర్యాదు చేయగా, అతనిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. దీంతో గురువారం అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు.

News June 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఎల్లారెడ్డిపేట మండలంలో బైకు, కంటైనర్ ఢీ.. యువకుడి మృతి.
@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జాతీయ నులిపురుగు నివారణ దినోత్సవం.
@ జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్ సత్యప్రసాద్.
@ చందుర్తి మండలంలో ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్.
@ రేపు సిరిసిల్లలో పర్యటించనున్న కేటీఆర్.
@ జగిత్యాల జిల్లా జడ్జిని కలిసిన జగిత్యాల ఎస్పి.

News June 20, 2024

ధర్మపురి క్షేత్రం ఆదాయ వివరాలు

image

జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి గురువారం రూ.90,402 ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇందులో టికెట్ల ద్వారా రూ.43,864, ప్రసాదాల ద్వారా రూ.28,050, అన్నదానం కోసం రూ.18,488 ఆదాయం వచ్చినట్లు దేవస్థానం ఈవో సంకటాల శ్రీనివాస్ తెలిపారు.

News June 20, 2024

పెద్దపల్లి: పల్లె దవాఖాన వద్దనే క్షుద్ర పూజలు!

image

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరులో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల ప్రకారం.. గ్రామంలోని పల్లె దవాఖాన వద్ద గత కొద్ది రోజులుగా గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఆకులపై కుంకుమ, పసుపు, కోడిగుడ్డు, మిరపకాయలు, నిమ్మకాయలు పెట్టి వెళ్తున్నారు. దీనిని చూసిన స్థానికులు, పల్లె దవాఖానకు వెళ్లే పేషెంట్లు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.

News June 20, 2024

ధర్మపురి దేవస్థానంలో భక్తుల రద్దీ

image

ధర్మపురి ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో గురువారం భక్తుల రద్దీ పెరిగింది. వేకువ జామునే సుదూర ప్రాంతాల నుంచి క్షేత్రానికి వచ్చిన భక్తులు గోదావరి నదిలో స్నానమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం దేవస్థానానికి అనుబంధంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

News June 20, 2024

ప్రజావాణిలోనే కాదు మిగిలిన రోజుల్లోనూ కలవొచ్చు: కలెక్టర్

image

పెద్దపల్లి జిల్లా ప్రజలు ప్రజావాణి కార్యక్రమంలోనే కాకుండా మిగిలిన పని దినాల్లో కూడా తనను కలవొచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. మంగళవారం నుంచి శనివారం వరకు పని దినాల్లో సమీకృత జిల్లా కలెక్టరేట్‌లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు తాను అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజలు నేరుగా వారి సమస్యలను తెలుపవచ్చని కలెక్టర్ తెలిపారు.