Karimnagar

News March 30, 2024

ఉమ్మడి KNR జిల్లాలో భానుడి భగభగ

image

ఉదయం తొమ్మిది దాటితే భానుడు భగ్గుమంటున్నాడు. మధ్యాహ్నం వేళ తీవ్రరూపం దాల్చుతున్నాడు. రోజు రోజుకూ ప్రతాపం చూపిస్తున్నాడు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం అత్యధికంగా జగిత్యాల జిల్లాలో ఉష్ణోగ్రత 42.5℃గా నమోదైంది. దీంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మధ్యాహ్నం ఇళ్ల నుంచి బయటికి వెళ్లేందుకు ఇబ్బంది పడ్డారు.

News March 30, 2024

KNR: వడదెబ్బతో ఆశా వర్కర్ మృతి

image

వడదెబ్బతో ఓ ఆశా వర్కర్ కరీంగనర్ జిల్లాలో మృతి చెందింది. స్థానికుల వివరాల ప్రకారం.. తిమ్మాపూర్ మండలం నేదునూర్ గ్రామానికి చెందిన రాజేశ్వరి(50) ఆశా కార్యకర్తగా పని చేస్తున్నారు. అయితే ప్రభుత్వం చేపట్టిన సర్వేలో భాగంగా గురువారం ఎండలో ఇంటింటికి తిరుగుతుండగా ఎండకు అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ అదేరోజు సాయంత్రం మృతి చెందారు.

News March 30, 2024

KNRలో బీజేపీకి షాక్.. కాంగ్రెస్‌లోకి మాజీ MLA

image

KNRలో BJPకి బిగ్ షాక్ తగిలింది. మానకొండూర్ మాజీ MLA ఆరెపల్లి మోహన్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈమేరకు కాంగ్రెస్‌లో చేరారు. అయితే గతంలో కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన ఆయన.. శాసనసభ ఎన్నికల్లో BJPలో చేరి, పోటీ చేసి ఓడిపోయారు. శుక్రవారం HYDలోని కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం సమక్షంలో ఆయన కాంగ్రెస్‌లో చేరారు. MP టికెట్ ఆయనకు కేటాయించనందుకే పార్టీ మారినట్లు సమాచారం.

News March 30, 2024

ఎంపీ ఎన్నికల్లో జీవన్ రెడ్డిని గెలిపించుకుందాం: సీఎం

image

రాబోయే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని టిపిసిసి చీఫ్ సిఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నిజామాబాదు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని గెలిపించాలని అందుకు కార్యాచరణ పై చర్చించారు. సమావేశంలో ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, జీవన్ రెడ్డి, నిజామాబాద్ నేతలు పాల్గొన్నారు.

News March 29, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

*సిరిసిల్ల నేత కార్మికుల బకాయిలు చెల్లించాలని సీఎంకు బండి సంజయ్ లేఖ.
*ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ.
*రాయికల్‌లో పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని యువకుడి ఆత్మహత్య.
*జగిత్యాల ఎమ్మెల్యేకు పితృవియోగం.
*సోషల్ మీడియాపై పోలీస్ నజర్: ఎస్పి అఖిల్ మహాజన్.
*జగిత్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభం.
*మల్లాపూర్ మండలంలోని చెక్ పోస్ట్ వద్ద గంజాయి పట్టివేత.

News March 29, 2024

ధర్మపురి: భక్తులతో కిటకిటలాడుతున్న లక్ష్మీ నరసింహుడి ఆలయం

image

ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో శుక్రవారం ఆలయం కిటకిటలాడింది. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు గోదావరిలో పుణ్య స్నానాలు ఆచరించి, స్వామి వారిని దర్శించుకుని, మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అనుబంధ ఆలయాలలో పూజలు నిర్వహించారు. భక్తుల గోవింద నామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారు మోగింది.

News March 29, 2024

ఉమ్మడి KNR జిల్లాలో జోరుగా బెట్టింగ్

image

ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల యవత బెట్టింగులకు అలవాటు పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం IPL సీజన్ కావడంతో కాటారం సహా.. పలు చోట్ల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్లో భారీగా బెట్టింగ్ పెడుతున్నారు. వచ్చిన లాభాలను సైతం బెట్టింగ్‌కు మళ్లిస్తున్నారు. ఇటీవల కాటారం మండలంలో ఓ వ్యక్తి బెట్టింగ్, ఆన్లైన్ గేమ్స్‌కు అలవాటు పడి రూ.లక్షల్లో నష్టపోయాడు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

News March 29, 2024

ప్రతిపక్ష పార్టీపై కొప్పుల హాట్ కామెంట్స్

image

ప్రతిపక్ష పార్టీపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. “పెద్ద షాక్, వాడు పోయిండు, వీడు పోయిండు అనే ఒకటే ఊదరగొడుతుండ్రు. ఇది శిశిర ఋతువు.. పనికిరాని ఆకులన్నీ చెత్తకుప్పలోకి పోతయ్. మూలం మాత్రం స్థిరంగా ఉంటుంది” అని ట్వీట్ చేశారు. మళ్ళీ చైత్రం వస్తది, కొత్త ఆకులు చిగురిస్తాయని, మూలం నుంచి శక్తిని అందుకొని విజృంభిస్థాయన్నారు. ఇది ప్రకృతి సహజం, ప్రతిదానికి షాకైతే ఎలా అని అన్నారు.

News March 29, 2024

KNR: BJPకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

image

మానకొండూరు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకులు ఆరెపల్లి మోహన్ ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర, కేంద్ర నాయకులు విన్నవించిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు కార్య చరణ పై త్వరలోనే వెల్లడిస్తానని ఆరేపల్లి మోహన్ తెలిపారు.

News March 29, 2024

NTPCలో యువకుని అనుమానాస్పద మృతి

image

రామగుండం NTPC పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జీ వద్ద దర్శన్ సింగ్ అనే యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించాడు. నిన్న మధ్యాహ్నం లాడ్జింగ్‌కు వచ్చిన సదరు యువకుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా? లేక మరేదైనా జరిగిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చత్తీస్ ఘడ్‌లో ఉన్న మృతుని కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.