Khammam

News July 4, 2024

ఆర్టీసీలో తగ్గనున్న పని భారం

image

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్మికులపై ఎట్టకేలకు పని భారం తగ్గనుంది. ఆర్టీసీలో ఖాళీ పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రీజియన్ పరిధిలో ఖాళీలను అధికారులు గుర్తించారు. మొత్తం 2000 వరకు ఖాళీలు ఉన్నట్లు తేల్చగా అందులో ఎక్కువగా కండక్టర్లు, డ్రైవర్ పోస్టులే ఉన్నాయి. ఏదేమైనా ఇన్నాళ్ల తర్వాత ప్రభుత్వ ప్రకటనతో కార్మికుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

News July 4, 2024

ఖమ్మం జిల్లాలో పెరిగిన విద్యుత్ వినియోగం

image

ఖమ్మం జిల్లాలో 2019 మార్చి 31 నాటికి 5,92,041 విద్యుత్తు సర్వీసులుండగా , 2024 మే 31 నాటికి ఈ సంఖ్య 6,82,268కి చేరింది. రెండు నెలల్లోనే 847 సర్వీసులు పెరగటం గమనార్హం. 2021-22లో త్రీఫేజ్, సింగిల్ ఫేజ్ నియంత్రికలు 28,252 ఉన్నాయి. 2024-25 మే 31 నాటికి వీటి సంఖ్య 30,622కి పెరిగాయి.

News July 4, 2024

ఇంజనీరింగ్లో ప్రవేశాలకు నేటి నుంచి కౌన్సెలింగ్

image

ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఖమ్మంలోని ఎస్ఆర్అండ్ బీజీఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో గురువారం నుంచి కౌన్సెలింగ్ మొదలవుతుందని ప్రిన్సిపాల్ డాక్టర్ మొహ్మద్ జకీరుల్లా, కౌన్సెలింగ్ సెంటర్ కోఆర్డినేటర్ ఎం.సుబ్రహ్మణ్యం తెలిపారు. మొదటి విడతలో గురువారం నుంచి 12వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే అవకావం ఉండగా, 6వ తేదీ నుంచి 13 వరకు సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని వెల్లడించారు.

News July 4, 2024

కొత్తగూడెం: టీమిండియాలో చోటే లక్ష్యం

image

దమ్మపేట మం. సుధాపల్లికి చెందిన రామకృష్ణ, సునీత దంపతుల కుమార్తె తుష్మరేఖ క్రికెట్‌లో రాణిస్తున్నారు. చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా తల్లి సహకారంతో అదరగొడుతున్నారు. 13ఏళ్ల వయసులో వనపర్తి స్పోర్ట్స్ అకాడమీలో చోటు సంపాదించారు. ప్రస్తుతం అండర్-19 క్రీడాకారిణిగా ఉన్న రేఖ ధోనిని స్ఫూర్తిగా తీసుకుని టీమిండియాలో చోటు సంపాదిస్తానని చెబుతున్నారు. బీఏ సెకండ్ ఇయర్ చదువుతున్న రేఖ చదువులోనూ రాణిస్తున్నారు.

News July 4, 2024

కొత్తగూడెం ఓఎస్డీగా బాధ్యతలు స్వీకరించిన పరితోష్ పంకజ్

image

ఇటీవల తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు మేరకు జరిగిన బదిలీల ప్రక్రియలో భాగంగా భద్రాచలం ఏఎస్పీగా పని చేస్తున్న పరితోష్ పంకజ్ పదోన్నతి పొంది కొత్తగూడెం ఓఎస్డీగా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. జనగాం ఏఎస్పీగా పని చేస్తున్న అంకిత్ కుమార్ సంక్వార్ బదిలీపై భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అధికారులు భద్రాద్రి జిల్లా ఎస్పీని కలిసి పూలమొక్కలను అందజేశారు.

News July 3, 2024

లంచం తీసుకున్న అధికారిని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

నివాస ధ్రువీకరణ పత్రం జారీ విషయంలో నాగుపల్లికి చెందిన లక్ష్మీనారాయణ రెడ్డి నుంచి రూ.10 వేలు లంచం తీసుకుని పట్టుబడిన ఆర్ఐ జబ్బా ఎర్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు. నివాస ధ్రువీకరణ పత్రం కోసం ఆర్ఐ రూ.10 వేలు లంచం అడగగా బాధితుడు ఫోన్ పే ద్వారా చెల్లించాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టిన అనంతరం వాస్తవమని తేలడంతో RIని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News July 3, 2024

ఖమ్మం జిల్లాలో పర్యాటకం అభివృద్ధి

image

అటవీ ప్రాంతాలు, జలవనరులు ఉన్న పరిసరాలను ప్రకృతి పర్యాటకంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అధికారులు ఇప్పటికే 12 ప్రాంతాలను గుర్తించారు. కనకగిరి అటవీప్రాంతంలో సఫారీ, బర్డ్‌వాచ్‌, ట్రెక్కింగ్, బోటింగ్ ఉండనుంది. కిన్నెరసాని ప్రాంతంలో వసతి, డ్యాంలో బోటింగ్, పాల్వంచలో సఫారీ, ట్రెక్కింగ్, రంగాపురం క్యాంప్‌ సందర్శన, జంగాలపల్లి అటవీప్రాంత సందర్శనకు అవకాశం కల్పించనున్నారు.

News July 3, 2024

కొత్తగూడెం: చెట్టు కింద చదువు.. 54 మందికి ఒక్కరే టీచర్

image

తెలంగాణ ఏర్పడి పదేళ్లు దాటుతున్నా ఇంకా చెట్ల కింద చదువుకుంటున్న పరిస్థితి వెంకటాపురం మండలంలో బోధపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో వెలుగు చూసింది. 54 మంది పైగా చదువుకుంటున్న ఈ పాఠశాలలో ఒక్కరే టీచర్ ఉన్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్పారు. శిథిలావస్థకు చేరుకున్న పాఠశాలలో ఉండేందుకు ఇబ్బందులు పడుతున్నామని.. నూతన భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

News July 3, 2024

సీఎంకు తుమ్మల లేఖ

image

భద్రాచలం మండలంలోని ఆంధ్రాలో కలిపిన 5గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలిపే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. 6న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు, విభజన చట్టంలోని హామీలు, ఇతర సమస్యలపై చర్చించనున్నారు. ఈ క్రమంలో 5గ్రామ పంచాయతీలను కలపాలని లేఖ ద్వారా తుమ్మల సీఎంను కోరారు.

News July 3, 2024

డీలక్స్ బస్సులో లక్కీ డ్రా బాక్స్ లు ఏర్పాటు: RM KMM

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజయన్ పరిధిలో భద్రాచలం-ఖమ్మం, ఖమ్మం-భద్రాచలం, సత్తుపల్లి-విజయవాడ, మణుగూరు-హైదరాబాద్, మధిర-హైదరాబాద్ రూట్లలో ప్రయాణించే మహిళా ప్రయాణికులు కోసం లక్కీ డ్రా బాక్స్‌లను ఏర్పాటు చేసినట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ప్రతీ నెల రెండుసార్లు లక్కీ డ్రా తీసి 24మంది మహిళా విజేతలకు బహుమతులు ఇస్తామన్నారు. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోగలరని కోరారు.