Khammam

News July 1, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు సోమవారం ఉదయం వెల్లడించారు. ఏసీ మిర్చి ధర రూ.20,000 జండా పాట పలుకగా పత్తి రూ.7,300 జెండా పాట పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర మొన్నటి కంటే 50 రూపాయలు పెరగగా ఏసీ మిర్చి ధర నిలకడగా కొనసాగుతోంది. పత్తికి రేటు పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 1, 2024

రోడ్డుప్రమాదం, డీఏఓ పరీక్షలకు దూరమైన అభ్యర్థులు

image

సత్తుపల్లిలోని డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పరీక్ష రాసేందుకు దాదాపు 20 మంది అభ్యర్థులు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడంతో కొందరు గాయాలపాలయ్యారు. చికిత్స కోసం వారిని పీహెచ్సీకి తరలించగా పరీక్ష సమయం దాటిపోవడంతో పలువురు అభ్యర్థులు పరీక్షకు దూరం అయ్యారు. మరి కొందరిరి గాయాలైనా పరీక్షా కేంద్రాలకు వెళ్లారు. 3 సంవత్సరాలుగా పరీక్షలకి ప్రిపేర్ అయ్యామని మధ్యలో ఇలా జరిగిందని వారు వాపోతున్నారు.

News July 1, 2024

ఖమ్మం: చింత చిగురు కోస్తుండగా పాము కాటు, మహిళ మృతి

image

కుమార్తెను చూసేందుకు వచ్చిన తల్లి
పాముకాటుతో మృతిచెందిన ఘటన నేలకొండపల్లి మండలంలో ఆదివారం జరిగింది. చింతకాని మండలం నేరడకు చెందిన కోట ఆదెమ్మ(56) శనివారం నేలకొండపల్లి మండలం సదాశివపురంలో ఉంటున్న తన కూతురు గోవిందమ్మ ఇంటికి వచ్చింది. మధ్యాహ్నం చింతచిగురు కోస్తుండగా ఆదెమ్మ కాలిపై పాము కాటు వేసింది. ఆమెను ఖమ్మం తరలించే క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందింది.

News July 1, 2024

గతంలో పనిచేసిన లెక్చరర్లకు ఆహ్వానం

image

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో
వివిధ సబ్జెక్టులు బోధించే అధ్యాపకుల కొరత ఉండడంతో కాంట్రాక్ట్, గెస్ట్, పార్ట్ టైం, లెక్చరర్లను నియమిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్ట్ టైం, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఈ ఏడాది కూడా బోధన ప్రారంభించగా, గెస్ట్ లెక్చరర్లను సైతం విధుల్లో చేరాలని అధికారులు సమాచారం ఇచ్చారు. కాగా, జిల్లాలోని 20 కళాశాలల్లో 58 గెస్ట్ లెక్చరర్లు, 8మంది పార్ట్ టైం, 29మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు ఉన్నారు.

News July 1, 2024

జూన్లో సాధారణానికి మించి వాన

image

ఖమ్మం జిల్లాలో జూన్ నెలలో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. ఈ నెల సాధారణ వర్షపాతం 124.6 మి.మీ.లు కాగా ఆదివారం రాత్రి వరకు 198.8 మి.మీ.గా నమోదైందని అధికారులు తెలిపారు. ఇందులో శనివారం కురిసిన వర్షమే ఎక్కువ. జిల్లాలోని 16 మండలాల్లో సాధారణానికి మించి, కారేపల్లి, కామేపలి , తల్లాడ, ఏన్కూరు, ఎర్రుపాలెం మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. గత ఏడాది జూన్లో కేవలం 49.5 మి.మీ.ల వర్షపాతమే నమోదైంది.

News July 1, 2024

BREAKING.. అశ్వారావుపేట ఎస్సై సూసైడ్ అటెంప్ట్

image

భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట SI శ్రీరాములు(34) MHBD జిల్లా కేంద్రంలో పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. WGL జిల్లా నల్లబెల్లి మండలం నారక్కపేటకు చెందిన శ్రీను అశ్వారావుపేటలో 5 నెలలుగా SIగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఉదయం స్టేషన్ నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో గాలింపు చర్యలు చేపట్టగా విషయం బయటపడింది. వరంగల్ ఆస్పత్రికి తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

News July 1, 2024

ఖమ్మం: స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు

image

రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఖమ్మం జిల్లాస్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలకు సరైన స్పందన రాకపోవడంతో మరోమారు పోటీలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. నాలుగో తరగతిలో ప్రవేశాలకు గత శుక్ర, శనివారాల్లో నిర్వహించిన పోటీలకు జిల్లావ్యాప్తంగా కేవలం 51 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ఈనెల 2వ తేదీన కూడా ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో పోటీలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.

News July 1, 2024

ఖమ్మం: రైళ్లకు మరో రెండు బోగీలు.. వారికి ఊరట

image

ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్‌ రైళ్లల్లో అదనంగా మరో రెండు జనరల్‌ బోగీలను పెంచనున్నట్లు కేంద్ర మంత్రి ఇటీవల ప్రకటించారు. దీని పల్ల ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 17 రైల్వే స్టేషన్ల నుంచి ప్రయాణిస్తున్న సుమారు 6 వేల మంది ప్రయాణికులకు ఊరట లభించనుంది. ప్రయాణికుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, వ్యాపారులు, రోజువారీ కార్మికులే ఉన్నారు. కాకతీయ, సింగరేణి, మణుగూరు, బెళగావి రైళ్లను రెండు బోగీలు తగిలించనున్నారు.

News July 1, 2024

రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రజా ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం

image

తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం చింతకాని, మధిర మండలంలోని పలు గ్రామాల్లో బీటీ రోడ్డు
పనులకు శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను
తమ ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు.

News June 30, 2024

కిషన్ రెడ్డి అబద్ధాలలో మోదీని మించిపోయారు: MLA కూనంనేని

image

కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు చేశారు. కిషన్ రెడ్డి అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిపోయారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు తలమానికమైన సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ సంస్థలకు విక్రయించడం సరికాదన్నారు. తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి నేతృత్వంలోనే సింగరేణి బొగ్గు గనులు వేలం జరగడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.