Khammam

News June 30, 2024

ఖమ్మం: GREAT.. ఆల్ ఇండియా 35వ ర్యాంకు

image

ఖమ్మం రూరల్ పెద్ద తండాకు చెందిన బానోతు వీరన్న-జ్యోతి పెద్ద కుమారుడు బానోత్ అమిత్ రాథోడ్ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో సీటు సాధించాడు. HYDలో ఇంటిగ్రేటెడ్ సివిల్స్ అకాడమీలో డిగ్రీ పూర్తి చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ-పీజీ)ను ఇటీవల రాశాడు. ఎస్టీ కేటగిరీలో ఆల్ ఇండియా 35వ ర్యాంకు సాధించి సీటు పొందాడు. అమిత్ రాథోడ్‌ను పలువురు అభినందించారు.

News June 30, 2024

MP అభ్యర్థులు అకౌంట్ వివరాలివ్వాలి: కలెక్టర్ జితేశ్ వి పాటిల్  

image

ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులు బ్యాంక్ అకౌంట్ వివరాలను వ్యయ పరిశీలకులకు అందజేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాద్  కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఖమ్మం కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. 

News June 30, 2024

కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేసిన డిప్యూటీ సీఎం

image

మధిర మండలం మర్లపాడులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామానికి చెందిన లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గతంలో అనర్హులు కూడా పథకాలు అందజేశారని, తాము అర్హులైన వారికి మాత్రమే పథకాలు అందజేస్తామని తెలిపారు.

News June 30, 2024

అమెరికాలో ఖమ్మం విద్యార్థి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి శ్రీనాథరాజు కిరణ్‌ (20) శనివారం అమెరికాలో మృతి చెందాడు. కల్లూరు మండలంలోని చిన్నకోరుకొండి గ్రామానికి చెందిన కిరణ్‌ అమెరికాలో మిస్సోరీ స్టేట్‌లో ఉన్న శ్యాండిల్‌ ఎస్‌ టౌన్‌లో ఉంటూ ఎంఎస్‌ చదువుతున్నాడు. గతేడాది నవంబర్‌లో అమెరికా వెళ్లిన కిరణ్‌ తాను నివసిస్తున్న ప్రదేశానికి సమీపంలో ఈత కొట్టేందుకు ముగ్గురు మిత్రులతో కలిసి వెళ్లాడు. ఈ క్రమంలో మునిగి చనిపోయాడు.

News June 30, 2024

KMM: ఊరూ వాడా వన మహోత్సవం…..

image

తెలంగాణలో హరితహారం గత ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు తొమ్మిది విడతలుగా మొక్కలు నాటించింది. ప్రస్తుత ప్రభుత్వం ‘వన మహోత్సవం’ పేరిట ఈకార్యక్రమాన్ని కొనసాగించాలని నిర్ణయించింది. ఐతే పచ్చదనం పెంపుదలకు 1950లో కాంగ్రెస్ సర్కారు ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఈ ఏడాదితో 75 వసంతాలు పూర్తికానున్న నేపథ్యంలో ‘వజ్రోత్సవ వన మహోత్సవం’గా నామకరణం చేశారు.

News June 30, 2024

రేపటి నుండి కొత్త చట్టాలు!

image

రేపటి నుండి అమలయ్యే కొత్త చట్టాలపై జిల్లాలోని పోలీసులతో పాటు న్యాయవాదులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ఖమ్మం పోలీసు కమిషనరేట్ పరిధిలోని ఉద్యోగులకు ఇటీవల కొత్త చట్టాలపై అవగాహన కల్పించారు. జిల్లాలోని 25 పోలీస్ స్టేషన్లతోపాటు ట్రాఫిక్, మహిళ, సీసీఎస్, సైబర్ క్రైమ్, టాస్క్ ఫోర్స్, సీసీఆర్పీ, ఐటీ కోర్ టీమ్లకు సంబంధించి 888 మంది సిబ్బందికి విడతల వారీగా, బ్యాచ్‌కు నాలుగు రోజుల పాటు శిక్షణ ఇచ్చారు.

News June 30, 2024

రెండున్నర గంటలు ఆలస్యంగా పరీక్ష

image

వసతిగృహ సంక్షేమాధికారుల ఉద్యోగ నియామకాలకు నిర్వహిస్తున్న పరీక్ష ఖమ్మం జిల్లాలోని ఓ పరీక్ష కేంద్రంలో శనివారం రెండున్నర గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. ఖమ్మంలో ఉన్న ప్రియదర్శిని యంత్రవిద్య మహిళా కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. మధ్యాహ్నం 2.30 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష 80 మంది అభ్యర్థులకు సాయంత్రం 5గంటలకు ప్రారంభమైంది. సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆలస్యమైనట్లు నోడల్‌ అధికారి శ్రీరాం తెలిపారు.

News June 30, 2024

ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

image

హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.

News June 30, 2024

ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు: తుమ్మల

image

హైదరాబాద్ తరహాలో ఖమ్మం అభివృద్ధి చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారు రూ.655 కోట్లతో ఈ ఏడాది 6 రోడ్లు మంజూరు చేశామన్నారు. ఖమ్మం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని చెప్పారు. గతంలో R&B మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారుల గురించి ప్రతిపాదన చేశానన్నారు. కొత్తగూడెం పాల్వంచ బైపాస్, మిస్సింగ్ లింక్ కలపడానికి 6km రోడ్డు రూ.125 కోట్లకు ఆమోదముద్ర పడిందన్నారు.

News June 30, 2024

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 13 మంది పదవీ విరమణ

image

TGSRTC ఉమ్మడి ఖమ్మం జిల్లా రీజనల్ వ్యాప్తంగా శనివారం 13 మంది పదవీ విరమణ పొందారు. కండక్టర్, డ్రైవర్, ADC, DCగా ఆర్టీసీకి సేవ చేసినందుకు రీజనల్ మేనేజర్ వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. రిటైర్మెంట్ తర్వాత జీవితాన్ని సంతోషంగా గడపాలని వారందరికీ పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేశారు.