India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

భద్రాచలం గోదావరిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. అయితే గల్లంతయిన ఇద్దరు యువకులు మృతి చెందారు. వారి మృతదేహాలను గజఈతగాళ్లు వెలికి తీశారు. మృతులు పవన్(20), హరి ప్రసాద్(18) గా పోలీసులు గుర్తించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 1000, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

బర్డ్ ఫ్లూ వైరస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చికెన్ షాపుల నిర్వాహకులపై గుదిబండలా మారింది. కేజీ ధర రూ. 180 ఉన్నా వైరస్ భయంతో చికెన్ కొనుగోళ్లకు మొగ్గు చూపడం లేదు. ప్రత్యామ్నాయంగా మటన్, చేపలకు డిమాండ్ పెరిగింది. రూ. 800 ఉన్న మటన్ రూ. 100, చేపలు రకాన్ని బట్టి కేజీకి రూ. 50-100 ఎక్కువ పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలతో మాంసం ప్రియులు నోటికి తాళం వేస్తున్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్లకు పాల్పడిన 9 మందిపై కేసు నమోదు చేశామని ఖమ్మం జిల్లా కొనిజర్ల ఎస్ఐ సూరజ్ తెలిపారు. ఎస్ఐ వివరాలిలా.. ‘మండల పరిధిలోని ఓ వెంచర్‌లో గత డిసెంబర్ నెలలో వైరా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒకే రోజు 64 రిజిస్ట్రేషన్లు అక్రమంగా జరిగాయి. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డికి ఫిర్యాదు చేయగా, సీఎంవో విచారణకు ఆదేశించింది. దీంతో 9 మందిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

యువతి హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదుతో పాటు రూ.10వేల జరిమానా విధిస్తూ 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి మారగాని శ్రీనివాస్ తీర్పు ఇచ్చారు. 2020లో సత్తుపల్లికి చెందిన బోల్లేడు నితిన్ పెనుబల్లి మండలం కుప్పెనకుంట్లకు చెందిన ఓ యువతిని ప్రేమ పేరుతో లంకపల్లి గుట్టల్లోకి తీసుకెళ్లి హతమార్చాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు విచారించిన కోర్టు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం తీర్థాల సంగమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివయ్య దర్శనానంతరం భక్తులతో మాట్లాడారు. జాతర సందర్భంగా చేసిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశామన్నారు.

ఖమ్మం జిల్లాలో MLC ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 93% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఖమ్మం జిల్లాలో 4089 ఓటర్లు ఉండగా 3805 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లిక్కర్ విక్రయాలు పడిపోతున్నాయి. గత ఏడాది ఫిబ్రవరిలో రూ. 75 కోట్ల అమ్మకాలు జరగగా, ప్రస్తుత ఫిబ్రవరిలో రూ.65 కోట్ల సేల్స్ జరిగాయి. ఏపీలో కొత్త మద్యం పాలసీ రావడంతో సత్తుపల్లి, మధిర, వైరా, ఖమ్మం, అశ్వారావుపేట ఎక్సైజ్ సర్కిళ్లలో ప్రభావం పడింది. పెరిగిన బీర్ల ధరలతో అమ్మకాలు మరింత క్షీణించవచ్చనే అభిప్రాయాలున్నాయి.

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో 24 గంటలపాటు సైలెన్స్ పీరియడ్ అమలులో ఉంటుందని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. ఈ సమయంలో సభలు, సమావేశాలు, రాజకీయ పరమైన సంక్షిప్త సందేశాలు పంపడంపై నిషేధం విధించినట్లు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే సందేశాలను నిశితంగా పర్యవేక్షిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

∆} ఖమ్మం జిల్లాలో నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు ∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన ∆} ఖమ్మం జిల్లాలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పర్యటన ∆} వైరా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు ∆} ఖమ్మం నగరంలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన ∆} ఏన్కూర్ వ్యవసాయ మార్కెట్ మార్కెట్‌కు సెలవు ∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన.
Sorry, no posts matched your criteria.