Khammam

News February 27, 2025

ఖమ్మం: నేడే పోలింగ్.. అంతా రెడీ!

image

నేడు జరగనున్న NLG, KMM, WGL టీచర్ MLC ఎన్నికల పోలింగ్‌కు ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధికార యంత్రాంగం సన్నద్ధమయ్యాయి. 6,111 మంది ఓటర్లకు 47 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావివ్వకుండా BNS యాక్ట్ అమలు చేస్తున్నారు. భద్రతా రీత్యా సమస్యలు ఉంటే 100కు ఫోన్ చేయాలని పోలీసులు సూచించారు. బరిలో 19 మంది ఉండగా.. ఎవరు విజేతగా నిలుస్తారో మార్చి 3వ తేదీ వరకు వేచి ఉండాల్సిందే.

News February 27, 2025

ఖమ్మం: కేంద్ర హోంమంత్రికి పొంగులేటి వినతి

image

సత్తుపల్లి కిష్టారం గ్రామంలో నిర్మించిన సైలో బంకర్ కారణంగా రెండేళ్ల మెయింటినెన్స్ పూర్తికాక ముందే గ్రామ ప్రజలు తీవ్ర అనారోగ్య కారణాలతో ఇబ్బందులు బాధపడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు మాజీ ఎమ్మెల్సీ, బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి వివరించారు. అనంతరం అంబేద్కర్ నగర్‌ వాసుల ఇబ్బందులపై వినతిపత్రం అందించారు. భారీ బంకర్ నాణ్యత లోపించడంతో పగుళ్లు వచ్చాయని విచారణ చేయాలని కోరినట్లు ఆయన తెలిపారు.

News February 26, 2025

ఖమ్మం: అమ్మమ్మ ఊరికి వస్తే.. బైక్ కాల్చేశారు!

image

రాత్రి పడుకునే ముందు ఇంటి ముందు పెట్టిన బైక్.. మరునాడు తెల్లవారుజామున గ్రామ శివారులో గుర్తు తెలియని దుండగులు దగ్ధం చేసిన ఘటన తిరుమాలయపాలెం మండలం బచ్చోడులో జరిగింది. పోలీసుల వివరాలిలా.. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లికి చెందిన నవిల యాకస్వామి తన అమ్మమ్మ ఊరు బచ్చోడకు వచ్చాడు. మరునాడు ఉదయం బైక్ కాల్చివేసినట్లు ఫిర్యాదు చేయడంతో తిరుమలాయపాలెం ఎస్సై జగదీష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 26, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు..

image

> జిల్లా వ్యాప్తంగా మహాశివరాత్రి ఉత్సవాలు
> చింతకాని మండలం నేరడలో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాంరెడ్డి పర్యటన
> వైరా మండలం స్నానాల లక్ష్మీపురానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక
> కల్లూరులో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పర్యటన
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

News February 26, 2025

కూసుమంచి : రూ. 90 లక్షల విలువైన 179 కేజీల గంజాయి పట్టివేత

image

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్ వద్ద పోలీసులు భారీ ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 90 లక్షల విలువైన 179 కేజీల గంజాయితో పాటు 41 గ్రాముల బంగారం కారులో తరలిస్తుండగా వాహన తనిఖీల్లో పట్టుబడింది. గంజాయిని తరలిస్తున్న కారు స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు ఖమ్మం డీసీపీ ప్రసాదరావు తెలిపారు.

News February 26, 2025

ఖమ్మం: మోడల్ స్కూల్ ప్రవేశాలకు గడువు పెంపు

image

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మార్చి 10 వరకు పొడిగించామని జిల్లా విద్యాశాఖ అధికారి సోమశేఖర శర్మ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన విద్యార్థులు http://telanganams.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఓసి విద్యార్థులకు రూ.200, ఎస్సీ, ఎస్టీ, బిసి, పిహెచ్‌సి, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు రూ.125 ఫీజు నిర్ధారించామని పేర్కొన్నారు.

News February 25, 2025

మార్చి 31లోపు LRS దరఖాస్తుల పరిష్కారం: కలెక్టర్ 

image

ఖమ్మం జిల్లాలో LRS (లేఅవుట్ రెగ్యులరైజేషన్) దరఖాస్తులను మార్చి 31లోపు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మంగళవారం అధికారులను ఆదేశించారు. టౌన్ ప్లానింగ్, రెవెన్యూ, నీటిపారుదల శాఖల సమన్వయంతో 14 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, పెండింగ్ దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వ భూములు, కోర్టు కేసులు, బఫర్ జోన్ సమస్యలు లేని దరఖాస్తులను తక్షణమే ఆమోదించాలన్నారు.

News February 25, 2025

 రంజాన్ మాసం ఏర్పాట్లపై కలెక్టర్ సమావేశం

image

పవిత్ర రంజాన్ మాసం ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశంలో పోలీస్ కమిషనర్ సునీల్ దత్, నగరపాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ముస్లిం మత పెద్దలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మసీదుల వద్ద పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి లైట్లు, ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి చర్యలు చేపట్టాలన్నారు.

News February 25, 2025

ఖమ్మం: ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడొద్దు: సీపీ

image

ఖమ్మం కమ్మిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరకూడదని, రోడ్ల వెంట తిరగరాదని హెచ్చరించారు. మైకుల వినియోగం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

News February 25, 2025

ఖమ్మం: మార్కెట్‌కు పోటెత్తిన మిర్చి

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.