India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం కమ్మిషనరేట్ పరిధిలో మంగళవారం సాయంత్రం 6 గంటల నుంచి గురువారం సాయంత్రం 6 గంటల వరకు బీఎన్ఎస్ యాక్ట్ అమలులో ఉంటుందని సీపీ సునీల్ దత్ తెలిపారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గుంపులుగా చేరకూడదని, రోడ్ల వెంట తిరగరాదని హెచ్చరించారు. మైకుల వినియోగం, ప్రజలను ఉద్దేశించి ప్రసంగాలు నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సోమవారం మిర్చి పోటెత్తింది. ఏకంగా 1.20 లక్షల బస్తాల మిర్చి వచ్చింది. బుధవారం నుంచి ఆదివారం వరకు శివరాత్రి సెలవులు ఉండటం.. మంగళవారం ఒక్క రోజే మార్కెట్ ఓపెన్ ఉండటంతో రైతులు పెద్ద ఎత్తున తీసుకువచ్చారు. ఉమ్మడి ఖమ్మం నుంచే కాక నల్గొండ, మహబూబాబాద్, ఏపీలోని కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి తీసుకువస్తున్నారు. క్వింటాకు ధర రూ.14,125 పలికింది.

√ ఖమ్మం నగరంలో జాబ్ మేళా √ ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన √ పెనుబల్లి: ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు √ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష √ వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన √ సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం √ మధిరలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన √ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన.

ఉమ్మడి జిల్లాలో మిర్చికి మద్దతు ధర లభించక రైతుల కంట కన్నీరు ఉబికివస్తోంది. గతేడాది రూ.20వేలు ఉన్న ధర ఈయేడు రూ.14వేలకు పడిపోయింది. ఈసారి తెగుళ్లకు తోడు కూలీల ధరలతో రైతులు దిగాలు చెందుతున్నారు. ధరలు పడిపోతుండటంతో పోయిన యేడు 1.50 లక్షలకు ఉన్న మిర్చి సాగు ఈసారి 95 వేలకు తగ్గింది. జిల్లాలో మిర్చి బోర్డు ఏర్పాటు చేసి రూ.25వేల మద్దతు చెల్లించాలని జిల్లా రైతాంగం కోరుతోంది.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మద్యం విక్రయాలు రెండు రోజుల పాటు నిలిపివేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఫిబ్రవరి 25 సాయంత్రం 4 గంటల నుంచి ఫిబ్రవరి 27 సాయంత్రం 4 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

> ఖమ్మం పట్టణం వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు దానవాయిగూడెం, రామన్నపేట, కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జ్ రోడ్డుకి ఇరువైపులా పార్కింగ్ చేయాలి.> ఇక ట్రాక్టర్లు, లారీలు కామంచికల్, పటివారిగూడెం నుంచి జాన్బాద్ తండా వెళ్లే దారిలోని కామంచికల్ బ్రిడ్జి దగ్గర పార్కింగ్ చేయాలి.

మనం చాలా చోట్ల కార్పొరేట్ స్కూళ్లకు చెందిన ఫ్లెక్సీలు, నేమ్ బోర్డులు చూస్తుంటాం.. కానీ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తమ విద్యార్థులు ప్రభంజనం సృష్టించారంటూ ఉపాధ్యాయులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువులో రాణించడంతోపాటు ఏ పోటీల్లో పాల్గొన్నా బహుమతి కచ్చితమంటూ ఫ్లెక్సీ ద్వారా ఆ టీచర్లు ప్రచారం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పెనుబల్లి మండలం టేకులపల్లిలో సోమవారం రైతులతో సమావేశమై సాగు నీటి విడుదల షెడ్యూల్‌పై ముందుగా సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. టెయిల్ ఎండ్ ప్రాంతాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గ్రామంలో తాగునీటి సరఫరా, విద్య, వైద్యం అంశాలను పరిశీలించారు. అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

మధుర నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాసరావు గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్‌తో కలిసి భట్టి విక్రమార్క శ్రీనివాసరావు పార్థివదేహానికి నివాళులర్పించారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు.

ఖమ్మం కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమంలో సోమవారం అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అర్జీలు స్వీకరించారు. సమస్యలను పరిగణనలోకి తీసుకుని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ భవనాల నివేదికను సమర్పించాలని సూచించారు. విద్యా ఫీజు రీఫండ్, బర్త్ సర్టిఫికెట్, పోడు భూముల పాసుపుస్తకాల సమస్యలపై చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.