Khammam

News February 25, 2025

ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యాంశాలు

image

✓ గుడ్ న్యూస్…రేపు ఖమ్మంలో జాబ్ మేళా✓ ఏన్కూరు: వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు✓ మధిర:డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి✓ఖమ్మం నారాయణ కాలేజ్ వద్ద పీడీఎస్యూ ఆందోళన✓ కల్లూరు: తాగునీటి కోసం రోడ్డెక్కిన మహిళలు✓ ఖమ్మం: మత సామరస్యానికి ప్రతి ఒక్కరూ పాటుపడాలి: సీపీ✓ఖమ్మం: ప్రజావాణిలో వినతులు స్వీకరించిన కేఎంసీ కమిషనర్✓ స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్

News February 24, 2025

స్టూడెంట్‌గా మారిన ఖమ్మం జిల్లా కలెక్టర్ 

image

పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ పాఠశాలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థిగా మారి వారి పక్కన కూర్చొని టీచర్ చెప్పిన క్లాస్‌ను విన్నారు. అనంతరం ఆయన కూడా క్లాస్ చెప్పారు. పరీక్షల్లో మెరుగైన ఫలితాలకు ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని సూచించారు. రాబోయే నెల రోజుల పాటు ఫోన్, టీవీలకు దూరంగా ఉండాలన్నారు. అనంతరం పాఠశాలలో వసతులను పరిశీలించారు.

News February 24, 2025

ఖమ్మం: పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలి: అదనపు కలెక్టర్

image

రాబోయే పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మార్చి 5 నుంచి 25 వరకు ఇంటర్, మార్చి 21-ఏప్రిల్ 4 వరకు పదో పరీక్షలు జరుగనున్నాయి. జిల్లాలో 72 ఇంటర్, 97 పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల భద్రత, ట్రాన్స్‌పోర్ట్, పారా మెడికల్ సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.

News February 24, 2025

ఖమ్మం: శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రి నివాళి 

image

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వ్యక్తిగత సహాయకుడు తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో సోమవారం ఆకస్మికంగా మృతిచెందడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మంలోని ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి తుమ్మల వెంట పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

News February 24, 2025

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా మూడు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈనెల 26, 27న మహాశివరాత్రి సందర్భంగా సెలవు, 28న అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. మార్చి 1న శనివారం మార్కెట్‌లో మిర్చి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించి సహకరించాలని కోరారు.

News February 24, 2025

డిప్యూటీ సీఎం పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏ శ్రీనివాస్ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు. ఐసీడీఎస్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌ అయిన ఆయన భట్టి దగ్గర విధులు నిర్వహిస్తున్నారు. దీనిపై డిప్యూటీ భట్టి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

News February 24, 2025

గుడ్ న్యూస్.. రేపు ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం SR&BGNR డిగ్రీ కళాశాలలో ప్లేస్ మెంట్ సెల్, తెలంగాణ స్కిల్స్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో 25న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డా.మహ్మద్ జాకిరుల్లా తెలిపారు. టెక్ మహీంద్రా, జెన్ ప్యాక్ట్, ముత్తూట్ ఫైనాన్స్, హెచ్డీఎఫ్సీ, క్యూస్ కారప్స్ లిమిటెడ్, హెల్త్ కేర్ కంపెనీలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు అర్హులన్నారు.

News February 24, 2025

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} వైరా నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
∆} పైనంపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} మధిర లో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News February 24, 2025

ఖమ్మం: మందుబాబులకు బ్యాడ్ న్యూస్

image

టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మూడు రోజులు మద్యం అమ్మకాలు నిలిపేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు మద్యం షాపులు బంద్ కానున్నాయి. దీంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు క్లోజ్ అవుతాయి.

News February 24, 2025

ఖమ్మం: పోక్సో కేసు నిందితుడు అరెస్ట్:సీఐ 

image

రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నాలుగు రోజులు కిందట నమోదైన పోక్సో కేసులో ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెంకు చెందిన వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.