India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రఘునాథపాలెం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను కిడ్నాప్ చేసి లైంగికదాడికి పాల్పడిన ఘటనలో నిందితుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. నాలుగు రోజులు కిందట నమోదైన పోక్సో కేసులో ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టిగూడెంకు చెందిన వంశీని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

కారేపల్లి: తలసేమియాతో బాధపడుతున్న చిన్నారులకు సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. తలసేమియా చిన్నారులకు రక్తం అందించడానికి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యువకులు స్వచ్ఛంధంగా రక్తదానం చేశారు. తలసేమియా చిన్నారుల జీవితాలను కాపాడటానికి ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని సంస్థ ప్రతినిధులు తెలిపారు.

అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్తం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 14,236 పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలో ఒక సూపర్‌వైజర్‌తోపాటు 123 అంగన్వాడీ టీచర్, 603 హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ల కొరత కారణంగా ఒక్కొక్కరికి రెండు నుంచి మూడు సెంటర్ల బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయనుండడంతో టీచర్ల కొరత తీరనుంది.

వారం రోజుల వ్యవధిలో అత్తా, కోడలు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. మద్దివారిగూడెంకు చెందిన వీరవెంకటమ్మ కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతూ 4రోజుల క్రితం మృతి చెందింది. ఆమె అంత్యక్రియలు పూర్తికాగా, అప్పటికే క్యాన్సర్‌తో బాధపడుతున్న వీరవెంకటమ్మ కోడలు కృష్ణవేణి సైతం శనివారం మృతి చెందింది. వారం వ్యవధిలోనే అత్తాకోడళ్లు మృతి చెందడంతో విషాద ఛాయలు అమ్ముకున్నాయి.

మహాశివరాత్రి వేడుకలకు ఖమ్మం జిల్లాలోని పలు దేవాలయాలు సిద్ధమవుతున్నాయి. ఖమ్మం రూరల్‌లోని తీర్థాల సంగమేశ్వరాలయం, పెనుబల్లి నీలాద్రీశ్వరాలయం, కల్లూరులోని కాశ్మీర మహాదేవ క్షేత్రాలయం(అప్పయ్యస్వామి) ఆలయం, కూసుమంచి గణపేశ్వరాలయం దేవాలయాలు జాగారం ఉన్న భక్తులతో కిటకిటలాడుతాయి. రాత్రంతా భక్తుల భజనలు, కీర్తనలతో దేవాలయాలు దద్దరిల్లుతాయి. మీరు ఏ గుడికి వెళ్తున్నారో కామెంట్ చేయండి.

ఓటమి అంచు వరకు వెళ్లి కూడా పట్టుదలతో ప్రయత్నిస్తే చివరికి విజయం సాధించవచ్చనే స్ఫూర్తి మనకు టెన్నిస్ క్రీడా ఇస్తుందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా టెన్నిస్ అసోసియేషన్ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌ను శనివారం కలెక్టర్ టాస్ వేసి ప్రారంభించారు. టెన్నిస్ తనకు చాలా ఇష్టమని పేర్కొన్నారు.

కామేపల్లి: ఇసుక అక్రమ రవాణా నియంత్రణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అధికారులను ఆదేశించారు. లింగాల క్రాస్ రోడ్డు చెక్ పోస్ట్ ను పోలీస్ కమిషనర్ శనివారం సందర్శించి తనిఖీ చేశారు. వాగులు, నది పరివాహక ఇసుక తవ్వకాల ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని సూచించారు. ఇసుక అక్రమంగా రవాణా చేసినా, నిల్వ ఉంచినా వెంటనే చట్ట ప్రకారం జరిమానాలు విధించి కేసులు నమోదు చేయాలన్నారు.

ఖమ్మంలో శనివారం పుష్ప మూవీ నటుడు జగదీశ్ (కేశవ) సందడి చేశారు. బోనకల్ క్రాస్ రోడ్‌లో ఓ షాప్ ఓపెనింగ్‌కు వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో పలువురు సెల్ఫీలు దిగడానికి ఎగబడ్డారు. నటుడు జగదీశ్ ‘తగ్గేదేలే’ అంటూ అభిమానులను అలరించారు.

తల్లాడ మండలం రంగంబంజరలో<< 15531420>> రోడ్డు ప్రమాదం<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం.. పెనుబల్లి మండలం ముత్తగూడెంకి చెందిన నాగిరెడ్డి టీవీఎస్‌పై తల్లాడ మం.నారాయణపురంలో తన అక్కను చూసేందుకు వచ్చాడు. తిరిగి వెళ్తుండగా రంగంబంజర వద్ద వెనక నుంచి కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నాగిరెడ్డి టైర్ల కిందపడి మృతి చెందాడు. కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు SHO వెంకటేశ్వర్లు తెలిపారు.

ఖమ్మం శ్రీచైతన్యలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎటపాకకు చెందిన యోగా నందిని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. సంక్రాంతి సెలవులకు వెళ్లి చాలా రోజుల తరువాత వచ్చినట్లు తెలుస్తోంది. శుక్రవారం ఉదయం క్లాస్‌లకు వెళ్లిన నందిని ఆరోగ్యం బాగలేదని మధ్యలోనే హస్టల్‌కి వెళ్లింది. ఎంతసేపటికి తిరిగి రాకపోవడంతో హస్టల్ సిబ్బంది వెళ్లి చూడగా బలవన్మరణానికి పాల్పడింది.
Sorry, no posts matched your criteria.