India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

రామగుండంకు చెందిన బాధితుడు బాదావత్ మోహన్ కొన్ని నెలల నుంచి ఖమ్మం పెద్దతండాలో చికెన్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ఇక్కడ ట్రాన్స్‌జెండర్‌తో పరిచయం కాస్త ప్రేమగా మారింది. రాత్రి ఇరువురు మధ్య ఘర్షణ ఏర్పడటంతో కోపోద్రిక్తంలో ట్రాన్స్ జెండర్, మోహన్‌ను కత్తితో ఐదు చోట్ల పొడిచింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ట్రాన్స్‌జెండర్ పరారీలో ఉంది.

ఖమ్మం జిల్లాలోని లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రతి దశలో తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. శుక్రవారం జరిగిన శిక్షణా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. అనర్హులకు ఇళ్లు మంజూరు చేయకూడదని, గ్రామ సభల ద్వారా అర్హులను ఖరారు చేయాలని సూచించారు. ప్రతి మండలంలో ఇసుక డంప్ ఏర్పాటు చేసి, తక్కువ ధరకు సిమెంట్ అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు పలు సూచనలు చేశారు.

ఖమ్మం జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, సీపీ సునీల్ దత్ పాల్గొన్నారు. జిల్లాలో 24 పోలింగ్ కేంద్రాలు సిద్ధంగా ఉండగా, బ్యాలెట్ బాక్సుల తరలింపు, బందోబస్తు, వెబ్‌కాస్టింగ్ ఏర్పాట్లు పూర్తయినట్లు తెలిపారు.

ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్‌లో గల శ్రీచైతన్య జూనియర్ కాలేజీ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని డేగల యోగనందిని (17) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని స్థానికులు తెలిపారు. ఉదయం స్టడీ అవర్‌కు హాజరైన ఆమె హాస్టల్‌కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పారు. మృతురాలు ఏపీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక వాసి సత్యరాజ్ కుమార్తెగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు దర్యాప్తు చేపట్టామన్నారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు గురువారం మిర్చి పోటెత్తింది. దాదాపు 90 వేల బస్తాల మిర్చి మార్కెట్‌కు వచ్చింది. క్వింటాకు రూ.14,050 ధర పలికింది. ధర తగ్గుముఖం పట్టడంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. హమాలీలు దిగుమతి పేరుతో బస్తాకు రూ. 5 నుంచి రూ. 7, కాంటా వేసినందుకు బస్తకు మరో రూ. 3 , కమీషన్ దార్లు కటింగ్ పేరుతో ఇంకో రూ. 3 నుంచి రూ. 5 వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

√ పలు శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
√ మధిరలో విద్యుత్ సరఫరాల అంతరాయం
√ కొనిజర్ల మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
√ అమ్మపాలెం లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు
√ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద పర్యటన
√ మధిరలో కొనసాగుతున్న కుల గణన సర్వే
√ ఖమ్మం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరికి జీవితకాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 2.10లక్షల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి ఉమాదేవి తీర్పునిచ్చారు. ఖమ్మంలోని ఓ ప్రాంతానికి చెందిన బాలిక 2021 FEB 7న ఇంటి బయట ఆడుకుంటుండగా సంపత్, నవీన్‌లు మాయమాటలు చెప్పి బైక్‌పై తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. కేసు విచారణ అనంతరం నిందితులకు జైలు శిక్ష విధించారు.

ఖమ్మం జిల్లాలో మొదటిసారి జాతీయస్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 22వ తేదీ నుంచి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. గురువారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 145 ఎంట్రీలు వచ్చాయని చెప్పారు. ఈ పోటీలు మార్చి 1వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.

క్షణికావేశంలో భార్యపై భర్త దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం కారేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలిలా.. మధ్యప్రదేశ్‌కు చెందిన పింకీ మాధవి(30), కమలేష్ దంపతులు మిర్చి పనుల కోసం జైత్రాం తండాకు వచ్చారు. కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్యను కడుపులో తన్నడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజారాం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులు బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ స్థానిక శాంతినగర్ ఏ.ఎస్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 47 మందికి పోటీ పరీక్షల్లో శిక్షణ, పుస్తకాలు ఇచ్చేందుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ వారు నగదు ప్రోత్సాహంగా రూ.3.80 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.
Sorry, no posts matched your criteria.