India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో మొదటిసారి జాతీయస్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది. ఈనెల 22వ తేదీ నుంచి పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సునీల్ రెడ్డి తెలిపారు. గురువారం ఖమ్మం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు జాతీయ స్థాయిలో 145 ఎంట్రీలు వచ్చాయని చెప్పారు. ఈ పోటీలు మార్చి 1వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించారు.

క్షణికావేశంలో భార్యపై భర్త దాడి చేయడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందిన ఘటన గురువారం కారేపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు వివరాలిలా.. మధ్యప్రదేశ్‌కు చెందిన పింకీ మాధవి(30), కమలేష్ దంపతులు మిర్చి పనుల కోసం జైత్రాం తండాకు వచ్చారు. కుటుంబ కలహాలతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. క్షణికావేశంలో భార్యను కడుపులో తన్నడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఎస్ఐ రాజారాం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థులు బాగా చదివి సమాజంలో గొప్ప స్థాయికి ఎదిగి, నలుగురి ఎదుగుదలకు తోడ్పాటు అందించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ స్థానిక శాంతినగర్ ఏ.ఎస్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 47 మందికి పోటీ పరీక్షల్లో శిక్షణ, పుస్తకాలు ఇచ్చేందుకు మలబార్ గోల్డ్ చారిటబుల్ సంస్థ వారు నగదు ప్రోత్సాహంగా రూ.3.80 లక్షల చెక్కును జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు.

ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి పట్టుబడ్డ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలు.. మండల వ్యవసాయ శాఖ అధికారి సాయి శంతన్ కుమార్ రైతుకు పత్తి అమ్ముకునేందుకు కూపన్ ఇవ్వడానికి రూ.30 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధిత రైతు ఏసీబీని ఆశ్రయించడంతో సాయి శాంతన్ కుమార్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఖమ్మం జిల్లా మధిర తహశీల్దార్ కార్యాలయం ఎదుట దెందుకూరు గ్రామానికి చెందిన వృద్ధురాలు కనకపూడి కరుణమ్మ(85) ఈరోజు నిరసన దీక్ష చేపట్టారు. ‘ఆక్రమణకు గురైన నా స్థలామైనా ఇప్పించండి.. లేదా నేను చనిపోవడానికి అనుమతైనా ఇవ్వండి’ అని రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఆఫీస్ ముందు బైఠాయించారు. ఆమె మాట్లాడుతూ.. తన స్థలం కోసం తహశీల్దార్ ఆఫీస్ చుట్టూ తిరిగి విసిగిపోయానన్నారు. మల్లు నందిని అడ్డుపడుతున్నారని ఆమె ఆరోపించారు.

ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని డిగ్రీ కాలేజ్ సమీపంలోని మినీ హైడల్ పవర్ ప్రాజెక్టు వద్ద సాగర్ కాలువలో హోంగార్డ్ నరేశ్(36) <<15520402>>మృతదేహం కలకలం<<>> సృష్టించిన విషయం తెలిసిందే. ఉదయం కాలువలో నరేశ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. అయితే ఆయన ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు కాలువలో పడి చనిపోయారా..? లేదా ఆత్మహత్య చేసుకున్నారా అనేది తెలియాల్సి ఉంది. దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

సాగర్ కాలువలో హోంగార్డు మృతదేహం కలకలం సృష్టించింది. ఈ ఘటన నేలకొండపల్లి మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. నేలకొండపల్లి పోలీస్ స్టేషన్‌లో హోంగార్డుగా విధులు నిర్వహిస్తున్న గంటా నరేశ్ డిగ్రీ కాలేజ్ సమీపంలోని సాగర్ కాలువలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

పిల్లల సంరక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆదేశించారు. బుధవారం జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ చివరి త్రైమాసిక పనితీరుపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా.పి.శ్రీజతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో తప్పనిసరిగా చైల్డ్ ప్రొటెక్షన్ సంబంధించి సమావేశాలు జరగాలని, దీనికి సంబంధించి తహశీల్దార్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలని తెలిపారు.

ఖమ్మం రైల్వే స్టేషన్‌లో 46 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ఇన్‌స్పెక్టర్ అంజలి తెలిపిన వివరాలు.. రైల్వే స్టేషన్‌లో రైల్వే పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించగా ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. అతడి వద్ద 46 కేజీల గంజాయి పట్టుబడిందన్నారు. దాని విలువ రూ.11.58 లక్షలు ఉంటుందని ఇన్‌స్పెక్టర్ అంజలి తెలిపారు.

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన యువకుడిపై ఖమ్మం జిల్లా కారేపల్లి PSలో బుధవారం కేసు నమోదైంది. ఎస్ఐ రాజారాం తెలిపిన వివరాలు.. భాగ్యనగర్ తండాకు చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఇటీవల యువకుడు ఆమెను పెళ్లి చేసుకోనని చెప్పడంతోపాటు అతడి ఆరుగురి ఫ్రెండ్స్‌తో కలిసి యువతి ఇంటి వద్ద గొడవ చేశాడు. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడితోపాటు, అతడి ఫ్రెండ్స్‌పై కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.