Khammam

News June 23, 2024

ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయి: జిల్లా కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలలో ప్రతిరోజు ఆకస్మిక తనిఖీలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ తెలిపారు. వైద్యాన్ని వ్యాపారంగా మార్చే వారిపై ఉక్కు పాదం మోపుతానని ఆయన అన్నారు. ముగ్గురు మంత్రుల ప్రాతినిథ్యం జిల్లా అభివృద్ధికి తోడ్పడుతుందని చెప్పారు. ధరణి సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు.

News June 23, 2024

ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి: కలెక్టర్

image

 గోదావరి నదిలో ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. రాములవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా గోదావరిలో స్నానం ఆచరిస్తారని.. భక్తులు స్థానాలు చేసే ప్రదేశాలలో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శనివారం గోదావరిలో మునిగి బాలుడు మృతి చెందడంతో ఆ ప్రదేశాన్ని కలెక్టర్ పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

News June 22, 2024

పాఠశాల ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు

image

ములకలపల్లిమండలం రాజీవ్ నగర్ కాలనీలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడు పత్తిపాటి వీరయ్యను జిల్లా విద్యాశాఖ అధికారి శనివారం సస్పెండ్ చేశారు. సదరు ఉపాధ్యాయుడు నిన్న ఆల్కహాల్ సేవించి మద్యం మత్తులో పాఠశాల విధులకు హాజరైనందుకు గాను, విధులలో అలసత్వం వహించినందుకుగాను, క్రమశిక్షణా చర్యలలో భాగంగా వీరయ్యను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

News June 22, 2024

KTDM: పుష్ప-2 వాహనంతో అభిమానుల ఫొటోలు

image

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.

News June 22, 2024

KTDM: పుష్ప-2 వాహనంతో అభిమానుల ఫొటోలు

image

చింతూరు డివిజన్ పరిధి మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ‘పుష్ప-2’ మూవీ షూటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఆ మూవీలో హీరో అల్లుఅర్జున్ వినియోగించిన లారీతో పాటు జీపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఉన్నాయి. వీటి వద్ద అభిమానులు, పర్యాటకులు పలువురు ఫొటోలు దిగుతున్నారు. దీంతో ఆ ప్రాంతం ఒక్కసారిగా సందడిగా మారింది.

News June 22, 2024

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మంత్రి

image

ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శనివారం ముఠాపురం, శంకర్ గిరి తండా, రాజేశ్వరపురం గ్రామాల్లో స్థానిక ప్రజలతో నిర్వహించిన సమావేశాల్లో మంత్రి హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజల నుంచి తెలుసుకున్న ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు.

News June 22, 2024

పెరిగిన ఎరువుల ధరలు

image

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎరువుల ధరలకు తోడు పురుగుమందుల ధరలు కూడా బాగా పెరిగాయి. కాంప్లెక్స్ ఎరువులు గతంలో రూ.1,300 ఉంటే ఇప్పుడు రూ.1,900కు చేరాయి. గతంలో రూ.900కు లభించిన పొటాష్ ధర రూ.1,650కు, డీఏపీ ధర రూ.1,350కు చేరింది. ఫలితంగా పంట సాగుకు పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఎరువుల ధరలు, పెట్టుబడితో పోలిస్తే ప్రభుత్వం ప్రకటించే కనీస మద్దతు ధరలు గిట్టుబాటయ్యే పరిస్థితులు లేవని రైతులు పేర్కొంటున్నారు.

News June 22, 2024

భద్రాచలం వద్ద గోదావరిలో బాలుడి మృతి

image

భద్రాచలం వద్ద తీవ్ర విషాదం జరిగింది. గోదావరిలో స్నానానికి వెళ్లి బాలుడు మృతిచెందాడు. మొత్తం ఐదుగురు పిల్లలు గోదావరిలో దిగగా, అందులో ఒకరు మృత్యువాత పడ్డాడు. నదిలో కొట్టుకుపోతున్న మిగతా నలుగురు పిల్లలను బోట్ టీం సభ్యుడు ప్రసాద్ కాపాడారు. బాలుడి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News June 22, 2024

ఖమ్మం: భూవివాదం.. గొడ్డలితో దాడి

image

ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం సింగరాయపాలెంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. పొలం గట్టు వివాదంలో ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు గొడ్డలితో దాడి చేశారు. క్షతగాత్రులను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News June 22, 2024

మోత మోగుతున్న టమాటా ధర.. కిలో 80 పైనే

image

టమాటా ధర ఆకాశాన్నంటుతోంది. స్థానికంగా ఉత్పత్తి లేకపోవటంతో ధరకు రెక్కలొచ్చాయి. నెల క్రితం రైతు బజార్లలో కిలో రూ.25కు లభించిన టమాటా ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. కొత్తగూడెం మార్కెట్కు నిత్యం 300 టన్నుల మేర టమాటాను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకొని వ్యాపారులకు విక్రయిస్తారు. ప్రస్తుతం ఉత్పత్తి లేక వ్యాపారులు ఆర్డర్ చేసినా 100 టన్నులకు మించి రావడం లేదు.