India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

అప్పు బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. చింతకాని మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన గిరిజన కౌలు రైతు నేరుశుల ఎల్లయ్య అప్పు బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఖమ్మం రూరల్ మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖమ్మం రూరల్ మండలం ఎదులాపురం క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు విషయం తెలుసుకున్న ఖమ్మం రూరల్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

సింగరేణి మండలం చీమలపాడు డ్రాగన్ మరియు పామాయిల్ తోటలను ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పరిశీలించారు. రైతు వెంకటేశ్వర్లు పొలం గట్టు పై కూర్చొని రైతుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రాగన్ పంటలోఆదాయం, పామాయిల్ పంట వలన వచ్చే ఆదాయాన్ని గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన అధికారి ఇతర రైతులు పాల్గొన్నారు.

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (TGDPS) సలహా కమిటీని ఏర్పాటు చేశారు. ఈనెల 14న సలహా కమిటీకి సంబంధించిన జీవో విడుదల కాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అధ్యక్షతన డాక్టర్ బి. ఆర్ అంబేడ్కర్ సచివాలయంలో కమిటీ సభ్యులతో ప్రాథమిక సమావేశం నిర్వహించారు. కమిటీ విశ్లేషణలు రాష్ట్రంలో స్వల్ప కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలకు మద్దతుగా ఉంటుందని డిప్యూటీ సీఎం చెప్పారు.

ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సత్తుపల్లి మండలం గంగారంలోని జలగం నగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కంచి రాధాకృష్ణ (30) గ్రామంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. మృతునికి భార్య, కుమారుడు ఉన్నారు. రాధాకృష్ణ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

భద్రాద్రి జిల్లాలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. మణుగూరు మండలం పగిడేరులో పలు బోరుబావుల నుంచి వేడి నీరు ఉబికి వస్తోంది. ఈ నీటిని శాస్త్రవేత్తలు పరిశీలించారు. సమీపంలో ఉన్న గోదావరి నీరు భూమి అంతర్భాగంలో ప్రవహిస్తుండటం వంటి కారణాలతో వేడినీరు వచ్చే అవకాశమున్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పర్యాటక ప్రదేశంగా మారిపోయింది. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వచ్చి వేడినీటిని చూసి ఆశ్చర్యపోతున్నారు.

కూసుమంచి మండలంలో ఖమ్మం – సూర్యాపేట హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హాట్యతండా సమీపంలో డ్రైవర్ నిద్ర మత్తులోకి జారడంతో డీసీఎం వ్యాను డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నా చేసిన ఘటన పెనుబల్లి మండలంలో చోటు చేసుకుంది. మండాలపాడుకు చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన యువతి ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని కోరగా నిరాకరించాడు. అతడితో పెళ్లి జరిపించాలని ప్రియుడి ఇంటిముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఆ యువతికి ఆగ్రామ మహిళలు మద్దతుగా నిలిచారు.

వాట్సాప్ చాటింగ్ బాలుడి ప్రాణాలు తీసిన ఘటన భద్రాద్రి జిల్లాలో జరిగింది. SI రవికుమార్ వివరాల ప్రకారం.. చుంచుపల్లి మం. ఓ తండాకు చెందిన బాలుడు 9వ తరగతి చదువుతున్నాడు. బాలుడికి తన క్లాస్‌మేట్ బాలికతో స్నేహం ఉండటంతో వాట్సాప్‌లో చాట్ చేస్తుండేవాడు. బాలిక కుటుంబ సభ్యులు బాలుడిని మందలించారు. దీంతో మనస్తాపం చెంది పురుగుమందు తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఖమ్మం రీజియన్‌లో ఆర్టీసీ కార్గోకి కాసుల వర్షం కురుస్తోంది. గతేడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు 3,29,743 ద్వారా రూ.6,49,30,640 ఆదాయం వచ్చింది. అత్యధికంగా మే నెలలో జిల్లాలో 35,199 పార్శిళ్ల బుకింగ్ ద్వారా రూ.68,46,890 ఆదాయం సమకూరింది. అలాగే డిసెంబర్‌లో 33,588 పార్శిళ్ల ద్వారా రూ.68,97,835 ఆదాయం లభించింది. అలాగే ఇతర ప్రాంతాలకు 1,740 పార్శిళ్లు హోం డెలివరీ ద్వారా రూ.4,84,050 ఆదాయం వచ్చింది.
Sorry, no posts matched your criteria.