India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

కాలేజీలో అడ్మిషన్ కోసం వచ్చిన ఓ అమ్మాయిని తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్న మన జిల్లా వాసి ప్రేమ కథ చాలా ప్రత్యేకమైనది. వారెవరో కాదండోయ్. మన స్టేట్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నందిని దంపతులు. HYD సెంట్రల్ యూనివర్సిటీలో భట్టి MA చదువుతుండగా అదే యూనివర్సిటీలో నందిని అడ్మిషన్ కోసం వచ్చారు. అలా ఏర్పడిన పరిచయాన్ని ప్రేమగా మార్చుకుని ఇరు కుటుంబాలను ఒప్పించి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.

హైదరాబాద్ చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడి ఘటనలో తల్లాడ మండలానికి చెందిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంజనాపురానికి చెందిన భూక్యా శ్రీను, అంకోలు శీరిష, వెంకట్రామునితండాకు చెందిన భూక్యా గోపాల్ రావు, నారయ్యబంజరకు చెందిన బానోత్ బేబీరాణిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీలకు పన్ను వసూళ్లు టెన్షన్‌గా మారింది. ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, కొత్తగూడెం, మణుగూరు, ఇల్లెందు, మధిర మున్సిపాలిటీల్లో 50% పైగా ఆస్తి పన్నులు వసూళ్లయ్యాయి. వైరా మున్సిపాలిటీలో కేవలం 27 శాతమే వసూళ్లయ్యాయి. ఇటీవల జరిగిన సమీక్షలో లక్ష్యానికి దూరంగా మున్సిపల్ సిబ్బందిపై ఉన్నతాధికారులు సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వసూళ్లలో వేగం పెంచాలని ఆదేశించినట్టు సమాచారం.

కల్లు అమ్మకంలో వచ్చిన విభేదాలతో ఓ గీత కార్మికుడు మరోగీత కార్మికుడి కల్లుకుండలో పురుగు మందు కలిపిన ఘటన కూసుమంచి మండలంలో వెలుగు చూసింది. మొక్క వీరబాబుకు ఐతగాని రమేష్‌కు మధ్య విభేదాలు ఉన్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న రమేష్, వీరబాబుకి చెందిన కల్లు కుండలో విషం కలిపాడు. చెట్టు ఎక్కగా వాసన రావడంతో అనుమానం వచ్చిన వీరబాబు, పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారించగా రమేష్ అంగీకరించడంతో కేసు నమోదు చేశారు.

ఖమ్మం జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వైరా సుందరయ్య నగర్‌లో పట్టపగలే భారీ చోరి జరిగింది. ఓ వద్ధురాలి ఇంట్లో చోరబడిన దొంగలు ఆమెపై దాడి చేయడంతో పాటు ఆమె కాళ్లు, చేతులను కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి చోరీకి పాల్పడ్డారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ చోరీ జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

ఖమ్మం బ్యాంక్ కాలనీలో <<15433998>>వృద్ధ దంపతులు సూ<<>>సైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. కష్టపడి దాచుకున్న సొమ్ము అప్పుగా ఇస్తే.. తిరిగి రాకపోవడంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు లేఖలో రాసినట్లు సమాచారం. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వైద్యానికి డబ్బులేక మనస్తాపంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. వారు రాసిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ బాలకృష్ణ తెలిపారు.

ఖమ్మం జిల్లాలో నేడు (గురువారం) మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నట్లు మంత్రి కార్యాలయ ఇన్ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. నేలకొండపల్లి, కూసుమంచి, ఖమ్మం నగరం, కొణిజర్ల మండలాల్లో పర్యటించి పలు భాదిత కుటుంబాలను పరామర్శిస్తారని అన్నారు. అనంతరం పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గమనించాలని పేర్కొన్నారు.

తెలంగాణ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏడు మైనారిటీస్ గురుకుల పాఠశాల, కళాశాలలో 2025 -26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కోరుతున్నట్లు జిల్లా మైనారిటీ శాఖ జిల్లా అధికారి సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 28వ తేదీ వరకు అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
Sorry, no posts matched your criteria.