India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

తల్లి ప్రేమ ముందు ఏదీ పనికి రాదని మరోసారి నిరూపితమైంది. మంగళవారం భద్రాద్రి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఏఎన్ఎంల ట్రైనింగ్‌కు పలువురు హాజరయ్యారు. ఇందులో భాగంగా పినపాకకు చెందిన ఏఎన్ఎం శ్రీ రేఖ తన ఐదు నెలల కుమారుడితో హాజరైంది. బుడ్డోడిని పడుకోబెట్టేందుకు ఆమె కలెక్టరేట్ ఆవరణలో చీరతో ఉయ్యాల కట్టి పడుకోబెట్టి, విరామ సమయంలో వచ్చి లాలించారు. ఈ తల్లి ప్రేమను చూసి సహ ఉద్యోగులు అభినందిస్తున్నారు.

KMM-NLG-WGL టీచర్ MLC ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించారు. ఖమ్మం 2474, సత్తుపల్లి 277, మధిర 203, సింగరేణి 177, వైరా 113, కల్లూరు 94, కామేపల్లి 85, ఏన్కూర్ 75, కొణిజర్ల 66, కూసుమంచి 66, వేంసూరు 65, పెనుబల్లి 63, ఎర్రుపాలెం 59, నేలకొండపల్లి 55, రఘునాథపాలెం 41, తల్లాడ 37, చింతకాని 36, ముదిగొండ 35, బోనకల్ 34, తిరుమలాయపాలెం 34 మంది ఉన్నారు.

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన పానెం సరస్వతి (50) బట్టలు ఉకితి ఆరేస్తోంది. ఈ క్రమంలో ఐరన్ దండానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్‌కు గురైంది. దీంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. ఆమె భర్త 2 నెలల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

అనిశెట్టిపల్లి వద్ద <<15422949>>రాత్రి <<>> అక్కడి గ్రామస్థులకు ఓ యువతి లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. CGకి చెందిన యువతి(20) కొత్తగూడెంలోని బంధువుల ఇంట్లో ఉంటూ కూలీపనులు చేస్తోంది. ఉదయం ఓ ఆటోడ్రైవర్ పని ఇప్పిస్తానని ఆమెను అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి యత్నించాడు. సహకరించకపోవడంతో కత్తితో దాడి చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న యువతి గ్రామస్థులకు విషయం తెలిపింది. కేసు నమోదైంది.

ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ముదిగొండ మండలం మేడేపల్లి గ్రామంలో జరిగింది. పోలీసుల వివరాలు.. గ్రామానికి చెందిన రెహ్మాన్(28) ఆటోడ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. ల్లయ్య అనే వ్యక్తి నుంచి అతడి తల్లి రూ.50 వేలు అప్పు తీసుకుంది. ఆదివారం పుల్లయ్య రెహ్మాన్‌ను అప్పు చెల్లించాలని అడిగినట్లు తండ్రికి చెప్పాడు. ఈక్రమంలో ఇంట్లో ఉరేసుకున్నట్లు తండ్రి పోలీసులకు తెలిపాడు. కేసు నమోదైంది.

కేంద్ర బడ్జెట్‌లో తమ తెలంగాణ ప్రజలను ఎందుకు పట్టించుకోలేదని ఖమ్మం ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి అన్నారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణకు కేటాయింపుల్లో నిర్లక్ష్యం ఎందుకని లోక్ సభలో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలను పూర్తిగా విస్మరించారని, పన్నుల రూపంలో కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్నా కేటాయింపులు చేయలేదని తెలిపారు. బంగారు గుడ్డు పెట్టే బాతును చంపకండి అని హితవు పలికారు.

ఖమ్మం-వరంగల్-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్ సోమవారం ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీలందరూ తనను గెలిపించాలని ఆయన కోరారు. అదే విధంగా తీన్మార్ మల్లన్న తనకు మద్దతు తెలపడంపై చాలా సంతోషంగా ఉందని, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ జాతీయ అధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్ ఉన్నారు.

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రజలకు ఖమ్మం వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్‌తో కలిసి, వెలుగుమట్ల అర్బన్ పార్క్‌ను సందర్శించారు. రోడ్డు నిర్మాణ పనులు రెండు వైపుల నుంచి జరగాలని, మార్చి 15 నాటికి రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Sorry, no posts matched your criteria.