Khammam

News June 14, 2024

విత్తనాలు నాటేందుకు రైతుల ఎదురు చూపు

image

ఖమ్మం జిల్లాలో పత్తి ప్రధాన పంటగా సాగవుతోంది. అయితే, 60 మి.మీ. కనీస వర్షపాతం నమోదైతేనే విత్తనాలు విత్తేందుకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ జిల్లాలో ఎక్కడా ఆ మేరకు వర్షం కురవలేదు. ఈ ఏడాది జిల్లాలో పత్తి సాధారణ సాగు విస్తీర్ణం 2 లక్షల ఎకరాలుగా వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇందులో ఇప్పటి వరకు 24,313 ఎకరాల్లో మాత్రమే విత్తనాలు నాటగా.. పూర్తిస్థాయిలో వర్షం కురిస్తేనే మిగతా రైతులు నాటే అవకాశముంది.

News June 14, 2024

జిల్లా వ్యాప్తంగా చల్లబడిన వాతావరణం

image

ఖమ్మంతో పాటు పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం వర్షం కురిసింది. దీంతో వాతావరణం చల్లబడగా ఉక్కపోతతో సతమతమవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. ఖమ్మం అర్బన్ మండలం ఖానాపురంలో 51.5 మి.మీ. ఎన్నెస్పీ గెస్ట్ హౌస్ ప్రాంతంలో 45 మి.మీ., ప్రకాశనగర్లో 8.5 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, కామేపల్లి, మధిర మండలంలోని పలు ప్రాంతాల్లో సైతం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.

News June 14, 2024

ఖమ్మం: రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్

image

కారేపల్లి మండలం గేటు కారేపల్లికి చెందిన నరేశ్ గురువారం విడుదలైన లాసెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయి మూడో ర్యాంకు సాధించాడు. ఇరిగేషన్ శాఖలో AEగా నేలకొండపల్లిలో విధులు నిర్వర్తిస్తున్న ఆయన గతేడాది సైతం లాసెట్ రాసి రెండో ర్యాంకును దక్కించుకున్నారు. అయితే ఉద్యోగం, కుటుంబ పరిస్థితుల వల్ల ఆసక్తి ఉన్నా LLB చేయడం సాధ్యం కావడం లేదని.. ఎప్పటికైనా కుదురుతుందనే భావనతో ఏటా ఎగ్జామ్ రాస్తున్నట్లు నరేశ్ చెబుతున్నారు.

News June 14, 2024

ఖమ్మం: వేల కోట్లు ఖర్చు చేసినా కేసీఆర్ నీరు ఇవ్వలేదు: డిప్యూటీ సీఎం

image

సీతరామ సాగునీటి ప్రాజెక్ట్ ద్వారా ఒక్క ఎకరాకు కేసీఆర్ నీళ్లు ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, తుమ్మలతో కలిసి ప్రాజెక్ట్‌ను భట్టి సందర్శించిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టారన్నారు. ఎన్కూర్ లింక్ కెనాల్‌కు రాజీవ్ కెనాల్‌గా నామకరణం చేసి ఆగస్టు నాటికి లక్ష 20వేల ఎకరాలకు నీరు అందిస్తామని భట్టి పేర్కొన్నారు.

News June 13, 2024

ఖమ్మం: పిడుగుపాటుతో గీత కార్మికుడు మృతి.!

image

పిడుగుపాటుతో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన గురువారం బోనకల్ మండలంలో చోటు చేసుకుంది. మోటమర్రి గ్రామానికి చెందిన చిట్టిమోదు విష్ణు చెట్టుపై కల్లు గీస్తుండగా ఒక్కసారిగా చెట్టుపై పిడుగు పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విష్ణు మృతితో వారి కుటుంబంలో, ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అటు సిరిపురంలో పిడుగుపాటుకు రైతులు శ్రీనివాసులు, నారాయణకు చెందిన రెండు పాడిగేదెలు మృతి చెందాయి.

News June 13, 2024

ఖమ్మం: అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ కౌంటర్ ఒప్పందపై దరఖాస్తుల స్వీకరణ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో గల అన్ని ప్రధాన బస్టాండ్లలో, పూర్తిగా తమ స్వంత వనరులతో అడ్వాన్స్‌డ్ రిజర్వేషన్ కౌంటర్‌ను 24/7 ఆపరేట్ చేయుటకు ఒప్పంద ప్రాతి పదికన, ఔత్సాహికుల నుంచి దరఖాస్తులు స్వీకరించబడుతున్నట్లుగా, ఉమ్మడి జిల్లా డిప్యూటీ రీజనల్ మేనేజర్ (ఆపరేషన్స్), GN పవిత్ర, ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాల కోసం సంబంధిత డిపో మేనేజర్ కార్యాలయంలో సంప్రదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

News June 13, 2024

ఖమ్మం: బావిలో పడి రైతు మృతి

image

ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి రైతు మృతి చెందిన ఘటన గురువారం ముదిగొండ మండలంలో చోటు చేసుకుంది. చిరుమర్రి గ్రామానికి చెందిన గాలి హనుమంతరావు(38) అనే రైతు మంచినీళ్లు తెచ్చేందుకు వ్యవసాయ బావి దగ్గరకు వెళ్లాడు. అక్కడ అతనికి ఒక్కసారిగా ఫీట్స్ రావడంతో బావిలో పడి ఊపిరాడక మృతి చెందాడు. హనుమంతరావు మృతితో వారి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News June 13, 2024

క్లోరిన్ గ్యాస్ లీక్.. ముగ్గురికి అస్వస్థత

image

దుమ్ముగూడెం మండలం పర్ణశాల జంక్షన్లో ఉన్న మిషన్ భగీరథ ప్రాజెక్టులో క్లోరిన్ గ్యాస్ లీకవడంతో ముగ్గురు వ్యక్తులు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇద్దరు రక్తపు వాంతులు చేసుకున్నారు. మరోకరు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భద్రాచలం ఆసుపత్రికి తరలించారు. పంప్ హౌస్లో ఏర్పాటు చేసిన క్లోరిన్ ట్యాంక్ మారుస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా శబ్దం రావడంతో పరిసర ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

News June 13, 2024

సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యారేజీని పరిశీలించిన మంత్రులు

image

దుమ్ముగూడెం సీతమ్మ సాగర్ ప్రాజెక్టు బ్యారేజిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న అధికారులను ప్రాజెక్టు వివరాలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్, తదితరులు పాల్గొన్నారు.

News June 13, 2024

ఖమ్మం: పెళ్లి కార్డుపై పవన్ కళ్యాణ్ ఫోటో

image

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లాపురం గ్రామానికి చెందిన కుటుంబరావు పవన్ కళ్యాణ్‌పై తన అభిమానాన్ని వినుత్నంగా చాటుకున్నాడు. ఈనెల 18న కుటుంబరావు పెళ్లి ఉండగా పవన్ కళ్యాణ్‌పై అభిమానంతో తన పెళ్లి పత్రికపై జనసేన, అధినేత పవన్ కళ్యాణ్ ఫోటోను ముద్రించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ప్రస్తుతం ఈ పెళ్లి కార్డు ఖమ్మం జిల్లాలో వైరల్‌గా మారింది.